EV Vs ICE Car Safety పెట్రోల్, డీజీల్ లేదా ఎలక్ట్రిక్ కార్లలో సేఫ్టీలో బెస్ట్ ఏవీ అంటే?
ఈ కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దేశంలో ఈవీల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో మీరు కూడా ఈవీలవైపు మళ్లాలని ఆశపడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే! కారు కొనేముందు ఎవరైనా సరే.. సేఫ్టీని చూసి కొనుగోలు చేస్తారు. ఫీచర్లు ఎన్నో ఉన్నా సేఫ్టీ పరంగా సరిగ్గా లేకపోతే ఇక ఆ కారును ఎవరూ ఇష్టపడరు, దాన్ని కొనాలనుకోరు. మరి సేఫ్టీ విషయంలో ఐసీఈ కారు బెటరా? లేదా ఈవీలు వాడడం మంచిదా? ఈ ప్రశ్నలకు సమాధానం ఆస్ట్రేలియన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్(ANCAP) అధికారులు తేల్చారు. వారు నిర్వహించిన క్రాష్ టెస్టులో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో సేఫ్టీ పరంగా ఓ క్లారిటీ కూడా దొరికింది. ఆ వివరాలేంటో చూసేద్దాం.
ANCAP కింద మొత్తం 57 ఈవీలను పరీక్షించారు. అందులో ఆరు ఈవీలు మాత్రమే.. గరిష్ఠ స్కోర్ సాధించలేకపోయాయి. ఇక ఐసీఈ వెహికిల్స్ విషయానికి వస్తే మాత్రం... 117 ఐసీఈ కార్లలో 18 కార్లు ఓవరాల్ స్కోర్ పొందలేకపోయాయి. ఇది సేఫ్టీలో ఈవీలే కొద్ది మేర ముందంజలో ఉన్నట్లు చూపిస్తోంది. ఈ టెస్టులో ఫైవ్-స్టార్ రేటింగ్ సాధించిన ఈవీ కార్ల శాతం 89శాతంగా ఉండగా.. ఐసీఈ వాహనాల శాతం 85శాతంగా ఉంది.

ఈ టెస్టులో చాలా ఎలక్ట్రిక్ కార్లు ఫైవ్- స్టార్ రేటింగ్ సాధించినప్పటికీ.. అవన్నీ కూడా కొత్త మోడల్స్ కావడం గమనార్హం. ఈ కొత్త కార్లన్నీ కీలకమైన సేఫ్టీ ఫీచర్లను జోడించి తీసుకురావడం వీటికి కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇక ఐసీఈ వాహనాల విషయానికి వస్తే.. ఎంట్రీ-లెవెల్ కార్లు మాత్రమే ఫైవ్-స్టార్ రేటింగ్ సాధించలేకపోయాయి. అందులో మహీంద్రా స్కార్పియో, ఎంజీ 5, సుజుకీ స్విఫ్ట్ వంటివి ఉన్నాయి.
వీటిలో హ్యుందాయ్ ఐ30 సెడాన్, ఎంజీ3, జీప్ గ్లాడియేటర్, జీప్ ర్యాంగ్లర్ కార్లు త్రీ- స్టార్ రేటింగ్ మాత్రమే సాధించాయి. ఓవరాల్ సేఫ్టీ పరంగా ఈవీలు, ఐసీఈల మధ్య వ్యత్యాసం అంత పెద్దగా లేకపోయినప్పటికీ.. ధర విషయంలో మాత్రం ఈవీలే ముందంజలో ఉన్నాయి. ఇక దేశంలో ఈవీ రంగాన్ని పరిశీలిస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ కార్యక్రమంలో భాగంగా ఈవీల సాంకేతికత అభివృద్ధికి రూ.14,000 ను కేటాయించింది.

బ్యాటరీ, పవర్‌ట్రైన్ సాంకేతికతల అభివృద్ధి ఇదివరకే ప్రారంభమైంది. అనేక విదేశీ సంస్థలు కూడా భారత్‌లో ఈవీల తయారీ కోసం ముందుకొస్తున్నాయి. ఈ రూ.14,000 కోట్లను రానున్న ఐదు సంవత్సరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. 2030 నాటికి ఈవీ రంగం నుంచి రూ.20 లక్షల కోట్ల ఆదాయం దేశానికి అందుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
అనేక రాష్ట్రాలు ఈ దిశగా ఈవీల పాలసీలను రూపొందించి, పని చేస్తున్నాయి. వీటి ద్వారా రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్సెస్ నుంచి మినహాయింపునిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం కూడా ఈవీ పాలసీని ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ఈవీలపై సబ్సిడీలు అవసరం లేవని గడ్కరీ నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఐసీఈ వెహికిల్స్ కంటే.. ఈవీలు చాలా తక్కువ జీఎస్‌టీతో ఉన్నాయని.. అయితే ఇటీవల ఈవీలపై సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్ కూడా పెరుగుతోందని అన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








