టెస్లా ఎగిరే కారు.. ఎప్పుడు వస్తుందో తెలుసా? సంచలన ప్రకటన చేసిన ఎలాన్ మస్క్!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన టెస్లా (Tesla) కంపెనీ, ఇప్పుడు మరొక అద్భుతమైన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) మళ్లీ ఒక సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎప్పుడూ వినూత్న ఆలోచనలతో సాంకేతిక రంగాన్ని కదిలించే ఈ వ్యాపారవేత్త, ఈసారి ఎగిరే కారు కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా, ఎలాన్ మస్క్ మాట్లాడుతూ టెస్లా కంపెనీ 2025 చివరి నాటికి ఒక ఎగిరే కార్ ప్రోటోటైప్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోందని వెల్లడించారు. ఆయన మాటల్లో ఇది ఇప్పటివరకు ఆవిష్కరించబడిన అత్యంత గుర్తుండిపోయే ఉత్పత్తి అని పేర్కొనడం, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న విశ్వాసాన్ని, సాంకేతిక శక్తిని స్పష్టంగా చూపిస్తోంది.

మస్క్ ప్రకారం, టెస్లా ఎగిరే కారు కేవలం గాలిలో తేలిపోతూ ప్రయాణించే వాహనం మాత్రమే కాదు, భవిష్యత్ నగర రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే ఒక విప్లవాత్మక ఆవిష్కరణగా ఉంటుంది. ఈ కారు ఆధునిక ఎలక్ట్రిక్ ప్రోపల్షన్ టెక్నాలజీ, లైట్వెయిట్ ఏరోడైనమిక్ డిజైన్, ఆటోపైలట్ సామర్థ్యాలతో వస్తుందని పరిశ్రమలో చర్చ మొదలైంది. ఎలాన్ మస్క్ గతంలో స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, హైపర్‌లూప్ వంటి సాహసోపేత ప్రాజెక్ట్‌లతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

Elen Musk Reveals Tesla Flying Car Will Be Launch Soon Full Details Inside

పై ఇమేజ్ AI ఆధారితమైనది. మస్క్ కలలన్నీ ఆలోచనలుగా కాకుండా నిజాలుగా మారడం వల్లే మస్క్ పేరు విజనరీగా నిలిచింది. మొత్తం మీద, ఈ ప్రకటనతో టెస్లా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. మస్క్ మాటలు విన్న వెంటనే టెక్ ప్రపంచం అంతా ఉత్సాహంతో నిండిపోయింది. ఎగిరే కారు అంటే ఇదివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూశాం, కానీ ఇప్పుడు ఆ కల సాకారం కావడానికి సమయం దగ్గర్లోనే ఉందనిపిస్తోంది.

ఇప్పుడీ టెస్లా ఎగిరే కారు ప్రాజెక్ట్ నిజంగా కొత్త అధ్యాయం రాయబోతోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాన్ మస్క్ చాలా కాలం నుంచి ఈ ఆలోచనను మదిలో ఉంచుకున్నాడు. నిజానికి ఆయన 2014 నుంచే ఎగిరే కార్లపై తన ఆసక్తిని, భవిష్యత్తులో అవి సాధ్యమవుతాయని చెప్పుకొచ్చాడు. అయితే, ఇప్పటివరకు దానికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఆయన నోట ప్రకటన రావడం పరిశ్రమ మొత్తానికి పెద్ద వార్తగా మారింది.

చారిత్రాత్మకంగా చూస్తే, గత రెండు దశాబ్దాల్లో అనేక కంపెనీలు వ్యక్తిగత ఎగిరే వాహనాలు లేదా eVTOL (electric Vertical Take-Off and Landing) వాహనాలు రూపొందించడానికి ప్రయత్నించాయి. కానీ వాటిలో చాలా ప్రాజెక్టులు ప్రోటోటైప్ దశను దాటి ముందుకు సాగలేకపోయాయి. కొన్ని కంపెనీలు టెక్నాలజీ పరిమితులు, పెట్టుబడుల కొరత లేదా రెగ్యులేటరీ అనుమతుల సమస్యల వల్ల వెనుదిరిగాయి.

అంటే, ఇప్పటివరకు ఎగిరే వాహనాల రంగం సైన్స్ ఫిక్షన్ స్థాయిలోనే నిలిచిపోయింది. అయితే ఇప్పుడు టెస్లా వంటి ప్రపంచ స్థాయి కంపెనీ, ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఈ రంగంలో అడుగుపెట్టడం, వాస్తవ మార్పులకు నాంది కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. టెస్లా ఇప్పటికే ఆటోమోటివ్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలతో సరికొత్త ప్రమాణాలు సృష్టించినందున, ఎగిరే కార్ల ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు కూడా మరింత పెరిగాయి.

మొత్తం మీద, మస్క్ చెప్పిన ఈ ప్రకటన ఎగిరే వాహనాల కలను మరోసారి జీవంతో నింపింది. ఇప్పటివరకు విఫలమైన అనేక ప్రయత్నాల మధ్య, టెస్లా ఈ సాంకేతిక సవాలును సక్సెస్‌గా పూర్తిచేస్తుందా? అనే ఆసక్తికర ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెస్లా ఎగిరే కారు మార్కెట్లోకి అధికారికంగా విడుదల అయితే గనక, రవాణ రంగంలో కొత్త పురోగతి వచ్చినట్లవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 3, 2025, 17:30 [IST]
English summary
Elen musk reveals tesla flying car will be launch soon full details inside
Read more on: #tesla motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+