ఒక్క ఛార్జ్.. మూడు చక్రాలు.. ఒక రికార్డు! ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎల్ట్రా ఆటో!

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (GEML) భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగానికి పునాది వేసిన కంపెనీల్లో ఒకటి. ఎలక్ట్రిక్ సికిళ్లు, స్కూటర్లు, 3-వీలర్ ఆటో రిక్షాల వరకు పలు వాహనాలను ఇది మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రత్యేకించి ఆంపియర్ వంటి బ్రాండ్‌లతో ఈ సంస్థ దేశ వ్యాప్తంగా వినియోగదారులకు నమ్మకమైన, అనుకూలమైన ఎలక్ట్రిక్ రవాణాకు వాహనాలను అందిస్తోంది. ఇప్పుడీ కంపెనీ మరోసారి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది. ఎల్ట్రా సిటీ ఎక్స్‌ట్రా (Eltra City Xtra) అనే తమ ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్యాసింజర్ వాహనంతో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం, బెంగళూరులోని తమ ప్రధాన కేంద్రం నుంచి తమిళనాడులోని రాణిపేట వరకూ, ఒక్కసారి ఛార్జ్ చేసిన తరువాత 324 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త రికార్డును నెలకొల్పింది.

ఈ సాహసోపేత ప్రయాణం కేవలం ఒక టెక్నికల్ డెమో మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహన సామర్థ్యాన్ని, రేంజ్‌పై ఉన్న అనుమానాలను తుడిచిపెట్టేసేలా నిలిచింది. అంతేకాదు, ఈ అద్భుతమైన ఫీట్‌కి గుర్తింపుగా ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇది గ్రీవ్స్ ఎలక్ట్రిక్‌కి గర్వకారణమే కాకుండా, భారతదేశంలో ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నదానికి ప్రతీకగా కూడా చెప్పవచ్చు.

Eltra City Xtra Three Wheeler

ఒక్క ఛార్జ్‌తో 300 కిలోమీటర్లకుపైగా ప్రయాణించగల సామర్థ్యాన్ని సాధించడం అంటే, సాధారణ ప్రయాణికుల అవసరాలకు, వాణిజ్య అవసరాలకు ఒక స్థిరమైన పరిష్కారాన్ని అందించినట్లే. ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ 3-వీలర్ ఎలక్ట్రిక్ ఆటో ఇంత దూరం ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే వాస్తవ డ్రైవింగ్ పరిస్థితుల్లో సాధారణంగా అందించే రేంజ్ 170 కి.మీ అని కంపెనీ స్పష్టం చేసింది.

అంటే, సాధారణ బరువు, డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నప్పుడు, పట్టణ రహదారులపై ట్రాఫిక్, బ్రేకింగ్, మలుపుల మధ్య సాగుతున్నప్పుడు, ఈ ఆటో ఒకే ఛార్జ్‌తో సుమారు 170 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ఇది రోజువారీ వాణిజ్య రవాణాకు సరిపడే ప్రాక్టికల్ రేంజ్. ఈ ఆటో గరిష్టంగా గంటకు 60 కి.మీ వేగంతో పరుగెత్తగలదు. ట్రాఫిక్ భరితమైన నగరాల్లో ఇది సురక్షితమైన, ఆర్థికంగా ప్రయోజనకరమైన వేగంగా భావించవచ్చు.

Eltra City Xtra India Book Of Record Details

ఇక సామర్థ్యం విషయానికి వస్తే, 330 కిలోల వరకు బరువు మోయగలదు. అంటే, ప్రయాణీకుల బరువు‌తో పాటు సాధారణ సరుకుల రవాణాకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు, 12-డిగ్రీల గ్రేడియంట్ ఉన్న ఎత్తైన రోడ్లపై పూర్తి లోడ్‌తో ఎల్ట్రా సిటీ ఎక్స్‌ట్రా సులభంగా వెళ్లగలదని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల దాకా రహదారులను దృష్టిలో ఉంచుకుంటే, చాలా కీలకమైన ఫీచర్‌.

ఈ ఎలక్ట్రిక్ ఆటో గరిష్టంగా 9.5 kW పవర్‌ను ఉత్పత్తి చేసే మోటార్‌తో వస్తోంది. దీనికి తోడు, 10.75 kWh సామర్థ్యం కలిగిన IP67 రేటింగ్ ఉన్న LFP బ్యాటరీ అమర్చబడి ఉంది, నీరు, దుమ్ము వంటి పరిస్థితుల్లో సురక్షితంగా పనిచేస్తుంది. ఇలాంటి శక్తివంతమైన బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఓ రాత్రంతా చార్జింగ్ పెడితే, మరుసటి రోజు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.

Eltra City Xtra India Book Of Record

గమనిక: ఈ ఆర్టికల్‌లో వాడిన ఫోటోలను https://3wheelers.greaveselectricmobility.com/eltra నుంచి తీసుకున్నాం.

More from DriveSpark

Article Published On: Thursday, July 24, 2025, 16:37 [IST]
English summary
Eltra city xtra three wheeler electric auto rickshaw sets india book of record
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+