కారు లగ్జరీనే..కానీ ఖర్చు చూస్తే గుండె గుభేల్..డీజిల్ వెర్షనే కావాలని పట్టుబడుతున్న కస్టమర్లు.. తలపట్టుకున్న

ఒకప్పుడు మధ్య తరగతి ప్రజల కారు.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో రారాజుగా వెలిగిన హ్యుందాయ్ i20 (Hyundai i20) ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. అదిరిపోయే లుక్స్, లగ్జరీ ఫీచర్లతో మారుతి సుజుకి బాలెనోకు సైతం గట్టి పోటీనిచ్చిన ఈ కారు, ఇప్పుడు అమ్మకాల్లో వెనుకబడిపోతోంది.

ముఖ్యంగా డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేయడం, మార్కెట్లో మైక్రో ఎస్‌యూవీల ట్రెండ్ భారీగా పెరగడం i20 పాలిట శాపంగా మారింది. తాజా రిపోర్టుల ప్రకారం, గత కొన్ని నెలలుగా ఈ కారు అమ్మకాలు గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. డీజిల్ కార్ల ప్రియులను తనవైపు తిప్పుకున్న ఈ బ్రాండ్, ఇప్పుడు కేవలం పెట్రోల్ ఆప్షన్లకే పరిమితమవ్వడం కస్టమర్లను నిరాశకు గురి చేస్తోంది.

End of Supremacy Hyundai i20 Sales Plummet as Customers Shift to Micro-SUVs and Miss Diesel Power

హ్యుందాయ్ i20 ప్రస్థానంలో సెకండ్ జనరేషన్ ఒక సంచలనం అని చెప్పాలి. ఆ మోడల్ తెచ్చిన క్రేజ్, దాని డిజైన్ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే, థర్డ్ జనరేషన్ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి i20 తన పాత వైభవాన్ని కోల్పోవడం మొదలైంది. తాజాగా నవంబర్ 2025 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. గత నెలలో కేవలం 3,777 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి.

గతేడాది నవంబర్‌లో అమ్ముడైన 3,925 యూనిట్లతో పోలిస్తే ఇది 4 శాతం తక్కువ. ఇది చిన్న తగ్గుదలలా అనిపించినా, ప్రధాన పోటీ సంస్థ మారుతి బాలెనో నెలకు పదివేల యూనిట్లకు పైగా అమ్ముడవుతుంటే, హ్యుందాయ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. కేవలం సేల్స్ పడిపోవడమే కాదు, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా i20 కి ఉన్న రీసేల్ వాల్యూపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.

End of Supremacy Hyundai i20 Sales Plummet as Customers Shift to Micro-SUVs and Miss Diesel Power

ఈ పతనానికి ప్రధాన కారణం డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేయడం. భారతీయ రోడ్లపై లాంగ్ జర్నీ చేసే వారికి, ఎక్కువ మైలేజీ ఆశించే వారికి i20 డీజిల్ వేరియంట్ ఒక వరప్రసాదంలా ఉండేది. కానీ కఠినమైన ఉద్గార నియమాల (BS6 Phase 2 / Emission Norms) కారణంగా హ్యుందాయ్ డీజిల్ ఇంజిన్‌కు పూర్తిగా స్వస్తి పలికింది.

దీంతో డీజిల్ కార్ల ప్రేమికులందరూ టాటా ఆల్ట్రోజ్ వంటి డీజిల్ ఆప్షన్ ఉన్న ఇతర మోడళ్ల వైపు మళ్లారు. అంతేకాకుండా, హ్యుందాయ్ సంస్థే సొంతంగా విడుదల చేసిన మైక్రో ఎస్‌యూవీ ఎక్స్టర్(Exter) కూడా i20 మార్కెట్‌ను నిలువునా దెబ్బతీసింది. చాలామంది హ్యాచ్‌బ్యాక్ కంటే అదే ధరకు ఎస్‌యూవీ లుక్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న ఎక్స్టర్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో i20 ఒకరకమైన అస్తిత్వ సంక్షోభంలో పడిపోయింది.

End of Supremacy Hyundai i20 Sales Plummet as Customers Shift to Micro-SUVs and Miss Diesel Power

ప్రస్తుతం i20 రెండు రకాల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో మాత్రమే అందుబాటులో ఉంది. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ 83 bhp పవర్‌ను ఉత్పత్తి చేయగా, స్పోర్టీ డ్రైవింగ్ ఇష్టపడే వారి కోసం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది (ఇది కేవలం N లైన్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది).

మైలేజీని పెంచడం కోసం హ్యుందాయ్ ఇందులో ఐడిల్ స్టాప్ అండ్ గో(ISG) ఫీచర్‌ను చేర్చింది. దీనివల్ల 1.2 లీటర్ మాన్యువల్ వేరియంట్ 16 కి.మీ, ఆటోమేటిక్ వేరియంట్ 20 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతున్నా.. డీజిల్ ఇచ్చే ఆ పవర్, ఎకానమీ పెట్రోల్ ఇంజిన్లలో రావడం లేదన్నది వినియోగదారుల మాట.

ధర విషయానికి వస్తే, i20 స్టాండర్డ్ వేరియంట్లు రూ. 6.87 లక్షల నుంచి రూ. 10.52 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. స్పోర్టీగా ఉండే N లైన్ వేరియంట్ల ధర రూ. 9.14 లక్షల నుండి రూ. 11.60 లక్షల వరకు ఉంది. సేఫ్టీ విషయంలో మాత్రం హ్యుందాయ్ ఎక్కడా తగ్గలేదు.

6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ అసిస్ట్ వంటి 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే, కేవలం సేఫ్టీ ఫీచర్లు మాత్రమే అమ్మకాలను పెంచలేవని i20 గణాంకాలు నిరూపిస్తున్నాయి. భవిష్యత్తులో హ్యుందాయ్ ఈ మోడల్‌లో హైబ్రిడ్ టెక్నాలజీని లేదా సిఎన్‌జి ఆప్షన్‌ను తీసుకువస్తే తప్ప i20 మళ్ళీ పాత వైభవాన్ని అందుకోవడం కష్టమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, December 22, 2025, 14:45 [IST]
English summary
End of supremacy hyundai i20 sales plummet as customers shift to micro suvs and miss diesel power
Read more on: #hyundai #i20 #car sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+