మారుతి ఎర్టిగా, వ్యాగన్ ఆర్‌ల మ్యాజిక్.. సీఎన్‌జీలో దూసుకుపోతున్నాయి.. ఎందుకు అంత డిమాండ్?

మారుతి కంపెనీ గత 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత ఎక్కువ సంఖ్యలో సీఎన్‌జీ వాహనాలను తయారు చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన మొత్తం వాహనాల్లో 33.6 శాతం సీఎన్‌జీ వాహనాలే ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి కంపెనీ గత 2025 ఆర్థిక సంవత్సరంలో 33 శాతం కంటే ఎక్కువ సీఎన్‌జీ వాహనాలను తయారు చేసింది. ఇందులో ఎక్కువ శాతం సీఎన్‌జీ వాహనాలు భారతదేశంలోనే అమ్ముడయ్యాయి. మారుతి కంపెనీ 3 కార్లను అమ్ముతోంది అంటే, అందులో ఒక కారు ఖచ్చితంగా సీఎన్‌జీ కారు అని ఆ కంపెనీ తెలిపింది.

Maruti Suzuki

మారుతి కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 17,60,765 కార్లను విక్రయించింది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ కార్లు 11,48,363, సీఎన్‌జీ కార్లు 5,91,730, హైబ్రిడ్ కార్లు 20,672 అమ్ముడయ్యాయి. పెట్రోల్ కార్లు 65.2 శాతం వాటాను కలిగి ఉండగా, సీఎన్‌జీ కార్లు ఇప్పటివరకు లేని విధంగా 33.6 శాతం వాటాను నమోదు చేశాయి.

మారుతి సుజుకి కంపెనీ 2020 ఏప్రిల్ నెలలోనే భారతదేశంలో డీజిల్ ఇంజిన్ కార్లను పూర్తిగా నిలిపివేసింది. దానికి బదులుగా, ఎక్కువ మైలేజీనిచ్చే సీఎన్‌జీ, హైబ్రిడ్ కార్లను విక్రయిస్తోంది. ఈ మధ్యకాలంలో సీఎన్‌జీ కార్లకు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

Wagnor

ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న మొత్తం సీఎన్‌జీ కార్లలో 70 శాతం ఈ మారుతి కంపెనీవే. ఇందులో టాక్సీ మోడల్స్‌లో ఎక్కువ సీఎన్‌జీ కార్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసే కార్లలో కూడా సీఎన్‌జీ కార్ల అమ్మకాలు పెరిగాయి. సీఎన్‌జీ కార్లు, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లతో పోలిస్తే ఎక్కువ మైలేజీ, తక్కువ ధర వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

మారుతి కంపెనీ సీఎన్‌జీ కార్లలో అత్యధికంగా అమ్ముడైన కారు ఎర్టిగా. దీనిలో 1.30 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. పెట్రోల్ కార్లు కేవలం 61,052 మాత్రమే అమ్ముడయ్యాయి. అదేవిధంగా పెట్రోల్ కార్ల కంటే సీఎన్‌జీ కార్లు ఎక్కువగా అమ్ముడైన మరో కారు వ్యాగన్ ఆర్‌. ఇందులో సీఎన్‌జీలో 1,02,128 కార్లు అమ్ముడవగా, పెట్రోల్‌లో కేవలం 96,323 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

Dzire

మారుతి కంపెనీ డిజైర్ సీఎన్‌జీలో 89,015 కార్లు, పెట్రోల్ వెర్షన్‌లో 76,006 కార్లు అమ్ముడయ్యాయి. ఎక్స్‌ఎల్6 (XL6) వాహనాన్ని పరిశీలిస్తే, 19,879 కార్లు సీఎన్‌జీలో, 17,232 వాహనాలు పెట్రోల్‌లో అమ్ముడయ్యాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టాటా, హ్యుందాయ్ కంపెనీలు కూడా సీఎన్‌జీ వాహనాలను విక్రయిస్తున్నప్పటికీ, మారుతి కంపెనీనే అత్యధిక సంఖ్యలో సీఎన్‌జీ వాహనాలను విక్రయిస్తోంది. ప్రజలు పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ వాహనాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. మైలేజ్, తక్కువ రన్నింగ్ కాస్ట్ వంటి కారణాలతో సీఎన్‌జీ వాహనాలు ఆదరణ పొందుతున్నాయి. ఈ ధోరణి భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 1, 2025, 9:26 [IST]
English summary
Ertiga wagon r lead the cng revolution maruti dominates the green vehicle segment
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+