అద్భుతమైన ఫీచర్స్ ఉన్నా ఆదరించే వారే లేరు..మారుతి చిన్న మోడల్ కు ఆదరణ కరువు

భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి కార్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఆ కంపెనీ కార్లు ప్రతి నెలా భారీ సంఖ్యలో అమ్ముడవుతున్నప్పటికీ కొన్ని మోడళ్లు మాత్రం అమ్మకాల్లో వెనుకబడి ఉన్నాయి. అలాంటి కార్లలో ఒకటి మారుతి సుజుకి ఇగ్నిస్ కూడా ఒకటి. ఈ కారు అమ్మకాలు నెలనెలా నిరాశ కలిగిస్తున్నాయి. తాజాగా 2025 మార్చి నెలలో కూడా ఇగ్నిస్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. అసలేం జరిగిందో కథనంలో తెలుసుకుందాం.

తాజాగా విడుదలైన సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. మారుతి సుజుకి 2025మార్చి నెలలో భారతదేశంలో కేవలం 1,900 ఇగ్నిస్ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. అయితే, గత ఏడాది అంటే 2024మార్చి నెలలో ఈ సంఖ్య 2,788గా ఉంది. ఇది ఏకంగా 32శాతం క్షీణత నమోదైంది. ఇగ్నిస్ కారును మారుతి సుజుకి నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఇగ్నిస్ ప్రారంభ వేరియంట్ (సిగ్మా) ధర రూ.5.85లక్షలు.

Maruti Suzuki Ignis

అదే సమయంలో ఈ కారు టాప్ వేరియంట్ (ఆల్ఫా ఏజీఎస్) ధర రూ. 8.12 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. మారుతి సుజుకి ఇగ్నిస్ మొత్తం 10 రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో 7 సింగిల్ టోన్ కలర్ ఆప్షన్‌లు కాగా, మిగిలిన 3 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లు.

సింగిల్ టోన్ కలర్ ఆప్షన్‌లు: నెక్సా బ్లూ, ల్యూసెంట్ ఆరెంజ్, సిల్కీ సిల్వర్, టర్క్వోయిజ్ బ్లూ, గ్లిస్టరింగ్ గ్రే, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లు: బ్లాక్ రూఫ్‌తో ల్యూసెంట్ ఆరెంజ్, సిల్వర్ రూఫ్‌తో నెక్సా బ్లూ, బ్లాక్ రూఫ్‌తో నెక్సా బ్లూ.

Maruti Suzuki Ignis

మారుతి సుజుకి ఇగ్నిస్ కారులో 1.2 లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్‌ వద్ద 61 kW పవర్, 4,200 ఆర్‌పిఎమ్‌ వద్ద 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

భారతీయ మార్కెట్‌లో టాటా టియాగో, టాటా పంచ్ వంటి కార్లతో మారుతి సుజుకి ఇగ్నిస్ పోటీ పడుతోంది. మారుతి సుజుకి ఇగ్నిస్ కారులో 17.78 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Maruti Suzuki Ignis

ఇవన్నీ కాకుండా టిల్ట్ ఫీచర్‌తో కూడిన స్టీరింగ్ వీల్, ఆటో ఓఆర్‌విఎమ్, 60:40 స్ప్లిట్ సీట్లు, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ల వంటి ఫీచర్లు కూడా మారుతి సుజుకి ఇగ్నిస్‌లో ఉన్నాయి. అయినప్పటికీ, వినియోగదారుల నుండి ఆశించిన స్పందన లభించకపోవడంతో మారుతి సుజుకి ఇగ్నిస్ అమ్మకాల్లో వెనుకబడి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : భారతీయ మార్కెట్‌లో అమ్మకాల్లో వెనుకబడి ఉన్న మారుతి సుజుకి కార్లలో ఇగ్నిస్ ఒకటి. కాబట్టి మారుతి సుజుకి ఇగ్నిస్ అమ్మకాలను పెంచడానికి అవసరమైన సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది జరిగితేనే మారుతి సుజుకి ఇగ్నిస్ కారు అమ్మకాల సంఖ్యను పెంచగలదు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, April 20, 2025, 12:00 [IST]
English summary
Even if given for free people might not buy is this the situation for maruti suzuki cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+