XUV 7XO గా రాబోతున్న మహీంద్రా 7-సీటర్ SUV..ఇక కూడా టయోటా ఇన్నోవా మేకప్ వేసుకోవాల్సిందేనా
మహీంద్రా కంపెనీ చరిత్రలోనే ఒకప్పుడు XUV500 సృష్టించిన సంచలనాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన మోడల్ XUV700. పాత మోడల్‌లో ఉన్న లోపాలను సరిదిద్ది, కంఫర్ట్, సేఫ్టీని రెట్టింపు చేసి మార్కెట్‌లోకి వచ్చిన ఈ 7-సీటర్ ఎస్‌యూవీ టయోటా ఇన్నోవా (Toyota Innova) కొనాలనుకున్న చాలా మందిని కూడా తన వైపు లాక్కుంది. అద్భుతమైన డ్రైవింగ్ డైనమిక్స్, సౌకర్యాన్ని అందించి ఈ మోడల్ చాలా త్వరగా ఇండియాలో సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం భారత రోడ్లపై 3 లక్షలకు పైగా XUV700 కార్లు దూసుకుపోతున్నాయి.
XUV500 స్థానంలో XUV700 వచ్చి ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కంపెనీ XUV700 ఫేస్‌లిఫ్ట్ (Facelift) వెర్షన్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఈ అప్‌డేటెడ్ మోడల్‌కు కొత్త పేరు కూడా ఇవ్వనున్నట్లు కార్‌దేఖో నివేదించింది.

దీనిలో భాగంగా మహీంద్రా కంపెనీ భారత మార్కెట్‌లో XUV 7XO అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. XUV300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను XUV 3XOగా మార్చినట్లే, XUV700 కి కూడా పేరు మార్పు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ మెయిన్ లుక్కులో పెద్దగా మార్పులు లేకుండా, కొన్ని ముఖ్యమైన అప్‌డేట్‌లతో రానుంది. ముందు భాగంలో రీడిజైన్ చేసిన బంపర్, కొత్త హెడ్‌ల్యాంప్ భాగాలు ఉండే అవకాశం ఉంది.
ఇది కారుకు మరింత ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తుంది. ప్రస్తుత మోడల్‌లోని ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ కొత్త మోడల్‌లో కూడా కొనసాగే అవకాశం ఉంది. సైడ్ వ్యూలో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌ను (డ్యూయల్ టోన్ ఫినిష్ ఉండే అవకాశం ఉంది) తీసుకురావాలని మహీంద్రా చూస్తోంది. వెనుకవైపు టైల్ ల్యాంప్, బంపర్ డిజైన్‌లో కూడా మార్పులు ఆశించవచ్చు. అలాగే కొన్ని కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లను కూడా అందించే అవకాశం ఉంది.

కొత్త XUV 7XO లో ఇంటీరియర్ పరంగా మహీంద్రా భారీ మార్పులు తీసుకురానుంది. కంపెనీ లేటెస్ట్ బోర్న్-ఎలక్ట్రిక్ (Born-Electric) మోడల్స్ నుండి ప్రేరణ పొందిన డిజైన్‌ను ఈ కొత్త ఎస్‌యూవీలో అందించనున్నారు. ఇందులో అత్యంత ముఖ్యమైన హైలైట్ కొత్త ట్రిపుల్-స్క్రీన్ సెటప్ (Triple-Screen Setup) కావచ్చు.
దీంతో పాటు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, మరింత మెరుగైన లెవెల్ 2 ADAS ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అంకుల్ లైటింగ్, అదనపు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి ఫీచర్లను కూడా ఈ ఫ్యామిలీ ఎస్‌యూవీలో అందించనున్నారు.

మహీంద్రా XUV700 ప్రస్తుతం 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కూడా అవే ఇంజిన్ ఆప్షన్లు కొనసాగే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్ కోసం 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం XUV700 ఎక్స్‌షోరూమ్ ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 25.14 లక్షల వరకు ఉంది. అయితే, ఈ మార్పుల కారణంగా కొత్త XUV 7XO ధరలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చని అంచనా. కొత్త మోడల్ వచ్చే ఏడాది జనవరి 2026లో మార్కెట్‌లోకి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications








