డాక్టర్లు, ఇంజనీర్ల ఫేవరెట్ కారు.. రూ.5.79 లక్షలు, 34 కి.మీల మైలేజ్.. గత నెలలో ఎంతమంది కొన్నారంటే?

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) ఎప్పటినుంచో భారతీయ మార్కెట్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా పేరు గడించింది. సాదాసీదా డిజైన్, విశాలమైన ఇంటీరియర్, మైలేజ్‌ ఫ్రెండ్లీ ఇంజిన్‌, విశ్వసనీయమైన మారుతి సర్వీస్ నెట్‌వర్క్‌ కారణంగా ఈ కారు మిలియన్లాది కుటుంబాల ఫ్యామిలీ కార్గా నిలిచింది. దీని పెర్ఫామెన్స్‌కు దేశంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రధానంగా డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ కారును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే కాలానికి అనుగుణంగా మారుతూ మరింత ఆధునిక రూపకల్పనతో, వినియోగదారుల కోసం డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తున్నా, ఈసారి అమ్మకాల గ్రాఫ్‌లో మాత్రం కొంత వెనుకంజ వేసింది.

ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం, 2025 ఆగస్టు నెలలో మొత్తం 14,552 యూనిట్లు మాత్రమే డెలివరీ చేయబడ్డాయి. 2024 ఇదే కాలంలో 16,450 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, సంవత్సరం వారీగా చూస్తే అమ్మకాలు సుమారు -11.54 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ తగ్గుదల వెనుక కేవలం ఒకే కారణం లేదని, మార్కెట్ పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల ధోరణి, ప్రభుత్వ విధానాలు వంటి అంశాల ప్రభావం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Family Budget Car Maruti Suzuki Wagonr August 2025 Sales Report Details

ఇటీవలి సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి GST రేటు తగ్గింపు వార్త. సెప్టెంబర్‌ నుండి వాహనాలపై పన్ను తగ్గుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో, చాలా మంది కస్టమర్లు ఆగస్టులో కొనుగోలు చేయకుండా వేచి చూడాలని నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉందనే ఆలోచన వారిని ఆగస్టు డెలివరీలను వాయిదా వేయించిందని చెప్పాలి. అదే సమయంలో, మార్కెట్‌లో SUVల క్రేజ్‌ మరింత పెరిగింది.

ప్రస్తుత తరుణంలో కాంపాక్ట్ SUVలు కూడా హ్యాచ్‌బ్యాక్‌ల కంటే కొద్దిపాటి తేడాతోనే లభిస్తున్నాయి. రోడ్లపై స్టైల్, స్పేస్, సేఫ్టీ ఫీచర్ల పరంగా SUVలు అందిస్తున్న విలువను చూసి చాలా మంది వినియోగదారులు చిన్న హ్యాచ్‌బ్యాక్ బదులు SUV వైపు మళ్లుతున్నారు. ఈ ట్రెండ్ కూడా వ్యాగన్ఆర్ అమ్మకాలపై ప్రభావం చూపినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే, వ్యాగన్ఆర్ తన స్థిరమైన ప్రజాదరణను కోల్పోలేదని చెప్పవచ్చు.

Family Budget Car Maruti Suzuki Wagonr August 2025 Sales Report Details

అయితే తాత్కాలికంగా GST తగ్గింపు అంచనాలు, SUVల ఆకర్షణ, మార్కెట్ డైనమిక్స్ కారణంగా ఆగస్టు నెలలో అమ్మకాల సంఖ్య కాస్త తగ్గింది. రాబోయే నెలల్లో ధరలు సవరించబడిన తర్వాత మళ్లీ వ్యాగన్ఆర్ తన సొంత స్థాయిని తిరిగి సాధించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్రస్తుతం భారత మార్కెట్‌లో ధర పరంగా కూడా చాలా ఆకర్షణీయంగా అందుబాటులో ఉంది.

దీని ప్రస్తుత ధర రూ.5.79 లక్షల నుండి రూ.7.62 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త కార్లపై జీఎస్టీని తగ్గించడంతో, సెప్టెంబర్ 22 నుండి కొత్త పన్ను రేట్లు అమల్లోకి రానున్నాయి. దీని వల్ల వ్యాగన్ఆర్ ధరలు మరింత చౌకగా మారబోతున్నాయి. వినియోగదారుల కోసం ఇది ఒక అదనపు లాభంగా మారనుంది. ఇది మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

Family Budget Car Maruti Suzuki Wagonr August 2025 Sales Report Details

మొదటిది 1-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, రెండోది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇక చివరగా ఎక్కువ మైలేజ్ అందించే 1-లీటర్ పెట్రోల్/CNG ఇంజిన్‌లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. వేరియంట్ ఆధారంగా కస్టమర్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక చేసుకోవచ్చు. పెట్రోల్ వెర్షన్‌లు 23 kmpl, CNG వేరియంట్ 34 km/kg వరకు మైలేజీ అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, September 13, 2025, 7:30 [IST]
English summary
Family budget car maruti suzuki wagonr august 2025 sales report details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+