నెలకు రూ.6,700తో 33 కి.మీ మైలేజ్ కారు సొంతం.. చిన్న ఫ్యామిలీకి బంగారం లాంటి కారు
భారతదేశంలో సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో కార్లను అందించడంలో మారుతి సుజుకి(Maruti Suzuki) ఎప్పటికీ ముందంజలో ఉంటుంది. కుటుంబ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని, తక్కువ ఖర్చుతో, ఎక్కువ మైలేజ్ ఇస్తూ, సులభంగా నిర్వహించగలిగే వాహనాలను అందించడం ఈ కంపెనీ ప్రత్యేకత. తాజాగా ప్రభుత్వం జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల కార్ల ధరలు భారీగా పడిపోయాయి. ఈ తగ్గింపుతో మారుతి కార్లపై కూడా వినియోగదారులు మంచి లాభాన్ని పొందే అవకాశం కలిగింది. మారుతి సుజుకి తయారుచేసిన ప్రసిద్ధ మోడల్ ఎస్-ప్రెస్సో (S-Presso) ఇప్పుడు మరింత అందుబాటు ధరలో లభిస్తోంది. సాధారణంగా చిన్న కుటుంబాలకు లేదా మొదటి కారు కొనుగోలు చేసేవారికి ఇది సరైన ఎంపికగా మారుతుంది.
డిజైన్ పరంగా కాంపాక్ట్‌గా ఉండడం వల్ల నగర రోడ్లలో సులభంగా నడపవచ్చు. అంతేకాక, మారుతి బ్రాండ్ నమ్మకాన్ని తీసుకువచ్చే ఈ హ్యాచ్‌బ్యాక్ తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది. జీఎస్టీ తగ్గింపుతో ఎస్-ప్రెస్సో ధర నేరుగా రూ. 1.29 లక్షలు తగ్గింది. దీంతో ఇప్పుడు దీని కనిష్ట ధర రూ. 3.50 లక్షలు కాగా, గరిష్ట ధర రూ. 5.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

ఇంత తక్కువ ధరలో, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, భద్రతా ఫీచర్లు, మంచి మైలేజ్‌ను అందించే ఈ కారు నిజంగా విలువకట్టలేని ఆఫర్‌గా చెప్పుకోవచ్చు. కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నవారికి ఈ సమయంలో ఎస్-ప్రెస్సో ఒక అద్భుతమైన ఎంపిక అవుతుంది. ఇది ప్రతి మధ్యతరగతి కుటుంబం కోసం సరైన భాగస్వామిగా నిలుస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఆన్-రోడ్ ధర, EMI గురించి ముఖ్యమైన వివరాలను ఇక్కడ మేము ఇచ్చాము.
ఎస్-ప్రెస్సో స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్‌ను ఎంచుకునే వారికి ఆన్-రోడ్ ధర రూ. 4.15 లక్షలు వస్తుంది. మీరు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగతా రూ.3.15 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణాన్ని 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు గణించినట్లయితే, నెలవారీ EMI సుమారు రూ. 6,700 వరకు ఉంటుంది. నగరాల్లో మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి ఇది సులభంగా భరించగలిగే ఆప్షన్‌గా కనిపిస్తుంది.

LXI పెట్రోల్ మోడల్ ధర రూ. 4.50 లక్షలు. ఇక్కడ కూడా మీరు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, లోన్ మొత్తం రూ. 3.50 లక్షలు అవుతుంది. అదే వడ్డీ రేటు, అదే ఐదు సంవత్సరాల కాలపరిమితి వద్ద EMI సుమారు నెలకు రూ.7,200గా వస్తుంది. ఈ వేరియంట్ కొంచెం ఎక్కువ ఫీచర్లు కలిగి ఉండటం వల్ల కుటుంబ అవసరాలను మరింత బాగా తీర్చగలదు.
VXI పెట్రోల్ మోడల్ ప్రస్తుతం ఎస్-ప్రెస్సోలో టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. దీని ఆన్-రోడ్ ధర రూ. 5.09 లక్షలు. మీరు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మిగతా రూ. 4.09 లక్షల వరకు రుణం పొందవచ్చు. EMI లెక్కలు వేస్తే నెలకు రూ. 8,400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేరియంట్ ఎక్కువగా యంగ్ బయ్యర్లు, ఫీచర్లను ప్రాధాన్యంగా చూసేవారు ఎంచుకునే అవకాశం ఉంటుంది.

LXI CNG వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 5.46 లక్షలు. మీరు అదే విధంగా రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చెల్లిస్తే, లోన్ మొత్తం రూ. 4.46 లక్షలు అవుతుంది. ఈ రుణంపై 9% వడ్డీ రేటుతో ఐదు సంవత్సరాల పాటు గణించిన EMI నెలకు రూ. 9,250 వరకు ఉంటుంది. ఈ కారు దాాదాపు 24 నుండి 33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.


Click it and Unblock the Notifications