మీ ఫ్యామిలీ ఎంత పెద్దదైనా జాలీగా టూర్లకు వెళ్లొచ్చు..ఇన్నోవా కంటే డెడ్ చీప్‌గా ఈ కారును ఇంటికి తెచ్చుకోండి
మీరు మీ కుటుంబంతో కలిసి హిల్ స్టేషన్లకు సుదూర ప్రయాణాలు చేయాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, గ్రూప్ ట్రిప్‌లకు ఇన్నోవా వంటి ఖరీదైన ఎంపీవీలను కొని డబ్బు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రూ.15 లక్షల (ఆన్-రోడ్ అంచనా) బడ్జెట్‌లో, హైరేంజ్ కొండ ప్రాంతాల్లో కూడా అద్భుతంగా దూసుకుపోయే కియా కారెన్స్ క్లావిస్ మోడల్‌ను మీరు ఎంచుకోవచ్చు.ఈ కియా కారెన్స్ క్లావిస్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.
కుటుంబంతో కలిసి సరదాగా, హాయిగా, సుఖంగా లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లాలంటే కచ్చితంగా ఒక మంచి ఎంపీవీ(మల్టీ పర్పస్ వెహికల్) ఉండాల్సిందే. అలాంటి సుఖవంతమైన ప్రయాణం కోసం చాలా మంది ఇప్పుడు కియా కార్లలో బాగా అమ్ముడవుతున్న కారెన్స్ క్లావిస్ మోడల్‌ను ఎంచుకుంటున్నారు. సుమారు రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఇది దొరుకుతుండడంతో... పెద్ద పెద్ద కార్ల కోసం డబ్బాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే, బెస్ట్ ఫ్యామిలీ వెహికల్ ఇంటికి తెచ్చుకోవచ్చు.

చలికాలంలో కొండ ప్రాంతాలకు క్లావిస్‌లో ట్రిప్ వెళ్లడం ఒక గొప్ప అనుభవం. మంచు పడుతున్న వేళ, బంగారు రంగులో సూర్యుడిని చూస్తూ..7 సీటర్ క్లావిస్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు కుటుంబ సభ్యులందరినీ తీసుకొని కొండలు ఎక్కడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడంతో డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు మూడో వరుస సీటులో చాలా హాయిగా కూర్చోవడం చూస్తే... లాంగ్ జర్నీ టెన్షన్ అంతా పోతుంది.
ఈ కారులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 114 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొండ ప్రాంతాల ఎత్తులను అవలీలగా ఎక్కడానికి సహాయపడుతుంది. కంపెనీ క్లెయిమ్ చేస్తున్న మైలేజ్ లీటరుకు 19కిమీ అయినా, హైరేంజ్ ఎత్తులు ఎక్కుతున్నప్పుడు కూడా కచ్చితంగా లీటరుకు 15కిమీ కంటే తక్కువ కాకుండా మైలేజ్ వస్తుందని చెప్పొచ్చు.

పెద్ద పెద్ద మలుపులు, తిరుగుళ్లు ఉన్నా కూడా, ఎలాంటి బాడీ రోల్ (కారు పక్కకు ఒరగడం) లేకుండా, క్లావిస్ చాలా కూల్‌గా ప్రయాణించడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. పదునైన బ్రేకింగ్, సరైన గేర్ షిఫ్టింగ్ వ్యవస్థ ఉండడం వలన కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం భద్రతతో కూడుకొని ఉంటుంది.
ఉదయం, సాయంత్రం వేళ కొండ ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమం చూసేందుకు చాలా బాగుంటుంది. క్లావిస్ MPV లోని త్రీ-రో సీటింగ్ కారణంగా ఏడుగురు వ్యక్తులు చాలా సుఖంగా కూర్చోవచ్చు. అంతేకాదు, మీ లగేజీలన్నీ సర్దుకోవడానికి సరిపడా బూట్ స్పేస్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. క్లావిస్‌లో చేసిన ప్రయాణం.. ఒక క్లాస్ ట్రిప్ వెళ్లొచ్చాం అనిపించేంత గొప్ప జ్ఞాపకంగా మనసులో మిగిలిపోతుంది.

డిజైన్ విషయానికి వస్తే కారెన్స్ క్లావిస్ కొత్త లుక్‌లో ఉంది. ముందు భాగంలో కొత్త సిగ్నేచర్ బూమరాంగ్ ఆకారంలో LED DRLS (డే టైమ్ రన్నింగ్ లైట్స్), కొత్తగా స్టైల్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. సరికొత్త EV9, సిరోస్ మోడల్స్‌లో కనిపించిన క్లోజ్డ్ గ్రిల్ ను ఇందులోనూ చూడవచ్చు. బంపర్‌ను కూడా కొంచెం కొత్త యాంగిల్ టచ్‌లతో రీడిజైన్ చేశారు.
క్లావిస్ 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. ఇది HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+ వంటి అనేక వేరియంట్లలో లభిస్తుంది. కియా కారెన్స్ క్లావిస్ ధర రూ.11,49,900 నుంచి రూ.21,49,900 వరకు ఉంది. కొత్త GST ప్రకారం ఈ మోడల్ ధర రూ.78,674 వరకు తగ్గడంతో గత నెలల్లో క్లావిస్ అమ్మకాలు భారీగా పెరిగాయి.


Click it and Unblock the Notifications








