ఇక నెక్ట్స్ జనరేషన్ అంతా వీటిదే.. పెట్రోల్ కార్లన్నీ పాత సామాన్లకే..త్వరలో మార్కెట్లోకి హైబ్రిడ్ కార్ల సునామీ

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్ ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన హోండా, హ్యుందాయ్, కియా, రెనాల్ట్ 2026-2027 నాటికి కొత్త 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలను విడుదల చేయబోతున్నాయి. ఈ కొత్త వాహనాలు పర్యావరణానికి మేలు చేస్తూనే, మంచి మైలేజీని అందిస్తాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇంధన సామర్థ్యం, పర్యావరణ అనుకూలమైన వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, హోండా, హ్యుందాయ్, కియా, రెనాల్ట్ వంటి కంపెనీలు తమ సాధారణ పవర్‌ట్రైన్‌లను అడ్వాన్సుడ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కలిపి కొత్త కార్లను తీసుకురానున్నాయి.

Four New Hybrid SUVs Set to Launch in India Honda Hyundai Kia and Renault

హోండా:
హోండా 2027 చివరి నాటికి తమ మోడ్యులర్ పిఎఫ్‌2 (PF2) ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన కొత్త 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి ప్రణాళిక వేస్తోంది. ఈ మోడల్ హోండా ఎలివేట్ నుంచి తీసుకున్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సిటీ ఈ:హెచ్‌ఈవీ (City e:HEV) లాంటి పవర్ఫుల్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుందని సమాచారం.

ఈ హైబ్రిడ్ వ్యవస్థలో ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీతో కలిసి పనిచేసే పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ మోడ్‌ల మధ్య సులభంగా మారే వీలు కల్పిస్తుంది. ఈ ఎస్‌యూవీలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, ప్రీమియం ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉంటాయని అంచనా. ఈ కారు ధర సుమారు రూ. 18 నుండి 20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చు.

Four New Hybrid SUVs Set to Launch in India Honda Hyundai Kia and Renault

హ్యుందాయ్:
హ్యుందాయ్ 2027 నాటికి 'ఎన్​ఐ1ఐ' (Ni1i) అనే కోడ్ నేమ్‌తో 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీని తీసుకురానుంది. అల్కాజర్, టక్సన్ మధ్య స్థానం పొందే ఈ ఎస్‌యూవీ, భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారు చేయబడిన 1.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

కియా:
హ్యుందాయ్ బ్రదర్ బ్రాండ్ అయిన కియా కూడా ఎంక్యూ4ఐ (MQ4i) అనే కోడ్ నేమ్‌తో 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీని తీసుకురానుంది. ఇది గ్లోబల్ సోరెంటో (Sorento) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. మీడియం సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీపడుతుంది. హ్యుందాయ్, కియా రెండూ తమ మోడల్స్‌లో అడ్వాన్సుడ్ టెక్నాజలీ, సేఫ్టీ ఫీచర్లు, అధునాతన ఇంటీరియర్‌లను అందిస్తాయి.

Four New Hybrid SUVs Set to Launch in India Honda Hyundai Kia and Renault

రెనాల్ట్:
రెనాల్ట్ బోరియల్ (Boreal) అనే కొత్త కారును తీసుకురాబోతోంది. ఇది 1.6-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిపి హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను ఉపయోగిస్తుంది. ఈ కారు సుమారు 155 బీహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మంచి ధరలో విడుదల కావచ్చు.

ఈ హైబ్రిడ్ 7-సీటర్ ఎస్‌యూవీల రాక భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ హైబ్రిడ్ కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. పర్ఫామెన్స్ లేదా బూట్ స్పేసులో రాజీ పడకుండా ఫ్యామిలీలకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈ వాహనాలు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత పర్యావరణం గురించి ఆలోచించే కస్టమర్ల నుంచి, వ్యాపార సంస్థల నుంచి మంచి స్పందన లభించవచ్చని ఆశిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Sunday, August 31, 2025, 9:30 [IST]
English summary
Four new hybrid suvs set to launch in india honda hyundai kia and renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+