భారత ఆటోమొబైల్ మార్కెట్ చరిత్రను తిరగరాసిన 9 కార్లు ఇవే.. రోడ్లను ఏలిన వీటిలో మీ ఫేవరెట్ ఏది ?

మనదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో ఒకటి. ప్రతి సంవత్సరం వివిధ కంపెనీల నుంచి డజన్ల కొద్దీ కార్లు రిలీజ్ అవుతుంటాయి. అయితే, కొన్ని కార్లు మాత్రమే కస్టమర్ల గుండెల్లో చెదరని ముద్ర వేసుకుంటాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మారుతి 800, అంబాసిడర్‌తో సహా ఈ 9 ముఖ్యమైన కార్లు అమ్మకాల విషయంలో కొత్త అధ్యయాన్ని సృష్టించాయి. అవేంటో చూద్దాం.

1. మారుతి 800 (Maruti 800): మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్స్ భాగస్వామ్యంతో 'మారుతి 800' కారు 1983లో చాలా గ్రాండుగా విడుదలైంది. ఇది అనతి కాలంలోనే మధ్యతరగతి ప్రజల అభిమాన కారుగా మారిపోయింది. దాదాపు ఇరవై సంవత్సరాల పాటు అగ్రస్థానంలో కొనసాగిన ఈ మారుతి 800 కారు ఉత్పత్తిని 2014లో నిలిపివేశారు. అప్పటి వరకు దాదాపు 29.2 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయబడ్డాయి.

India Milestone Cars

అనేక కారణాల వల్ల మారుతి 800 అమ్మకాలను అధికారికంగా నిలిపివేశారు. ఈ కారు కనీసం రూ. 2.06 లక్షలు, గరిష్టంగా రూ. 2.38 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. ఇది పెట్రోల్, ఎల్‌పిజి ఇంజిన్ ఆప్షన్‌లతో లభించేది. లీటరుకు 14.0 నుండి 16.1 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చేది. ప్రస్తుతం ఈ కారు స్థానంలో 'మారుతి సుజుకి ఆల్టో కె10' హ్యాచ్‌బ్యాక్ అమ్ముడవుతోంది.

2. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift): ఇది కూడా పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరుగాంచింది. ఈ కారు 2005లో విడుదలైంది. ఇప్పటికీ మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. దానికి నిదర్శనంగా ఈ మార్చిలోనే 17,746 యూనిట్లను కస్టమర్లు కొనుగోలు చేశారు. కొత్త స్విఫ్ట్ రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.64 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తుంది.

Maruti Swift

3. హిందుస్థాన్ అంబాసిడర్ (Hindustan Ambassador): భారతదేశ వినియోగదారుల కోసం హిందుస్థాన్ మోటార్, ఇంగ్లాండ్‌కు చెందిన మోరిస్ ఆక్స్‌ఫర్డ్ కంపెనీ ఈ అంబాసిడర్ కారును అమ్మకానికి తీసుకొచ్చింది. 1957 నుంచి 2014 వరకు అంబాసిడర్ కార్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. అయితే, ఇతర కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ కారణంగా ఈ కారు అమ్మకాలను నిలిపివేశారు. చివరిగా అంబాసిడర్ రూ. 4 లక్షల ప్రారంభ ధరకు లభించింది.

4. మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio): దేశంలో అత్యధిక సంఖ్యలో అమ్ముడయ్యే ఎస్‌యూవీలలో ఇదొకటి. ఈ కారు 2002లో అట్టహాసంగా విడుదలైంది. ప్రస్తుతం స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ అనే రెండు రకాలుగా కొనుగోలుకు అందుబాటులో ఉంది. స్కార్పియో ఎన్ రూ. 13.99 లక్షల నుంచి రూ. 24.89 లక్షల వరకు, స్కార్పియో క్లాసిక్ రూ. 13.62 లక్షల నుంచి రూ. 17.50 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ధరను కలిగి ఉంది.

Mahindra Scorpio

5. టాటా నానో (Tata Nano): ఇది పేదల కారుగా ప్రజల పేరుగాంచింది. 'నానో' కారు దివంగత రతన్ టాటా కలల ప్రాజెక్ట్. 2008 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారిగా టాటా నానో కారును ఆవిష్కరించారు. మరుసటి సంవత్సరం (2009) దేశీయ మార్కెట్‌లో అట్టహాసంగా అమ్మకానికి వచ్చింది. అయితే, 'టాటా నానో' కారు ఆశించిన స్థాయిలో అమ్ముడుపోలేదు.

ఈ నేపథ్యంలో 2018లో ఈ కారు అమ్మకాలను నిలిపివేశారు. చివరిసారిగా నానో కారు రూ. 2.47 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. ఇది 624సిసి సామర్థ్యం గల పెట్రోల్, సిఎన్‌జి ఇంజిన్ ఆప్షన్‌లను కలిగి ఉంది. లీటరుకు 21.9 నుండి 36 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చేది.

Tata Nano

6. హోండా సిటీ (Honda City): ఈ కారును 1998 నుంచి దేశీయ మార్కెట్‌లో సక్సెస్ ఫుల్‎గా విక్రయిస్తున్నారు. ఇది ఒక సెడాన్, ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి పెద్ద బూట్ స్పేస్‌ను కలిగి ఉండడం దీనికి ప్లస్ పాయింట్. అందువల్ల వినియోగదారుల అభిమాన కారుగా మారింది. కొత్త హోండా సిటీ కారు రూ. 12.28 లక్షల నుంచి రూ. 16.55 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది.

ఈ హోండా సిటీ సెడాన్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. లీటరుకు 12-15 నుంచి 17-20 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 సీట్ల ఆప్షన్ ఉంది. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Honda City

7. టాటా ఇండికా (Tata Indica): ఇది ఒక హ్యాచ్‌బ్యాక్. 1998లో విడుదలైన ఈ కారు ఇరవై ఏళ్ల పాటు మార్కెట్‎ను శాసించింది. అయితే, అనేక కారణాల వల్ల 2018లో ఈ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలను నిలిపివేశారు. చివరిసారిగా టాటా ఇండికా రూ. 3.32 లక్షల నుండి రూ. 6.83 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది.

ఈ ఇండికా కారు 1.4 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా సిఎన్‌జి పవర్‌ట్రెయిన్‌ను కూడా కలిగి ఉంది. 16.84 నుండి 25 కి.మీ/లీటర్ వరకు మైలేజ్ ఇచ్చేది. ఇందులో కూడా ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం టాటా ఇండికా స్థానంలో 'టియాగో' కారు అమ్ముడవుతోంది.

Tata Indica

8. హ్యుందాయ్ శాంట్రో (Hyundai Santro): ఈ హ్యాచ్‌బ్యాక్‌ను 1998లో విడుదల చేశారు. దీనిని వినియోగదారులు పోటీపడి కొనుగోలు చేసేవారు. అయితే, 2022లో శాంట్రో అమ్మకాలను నిలిపివేశారు. చివరిసారిగా ఈ కారు రూ. 2.72 లక్షల నుండి రూ. 6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది.

9. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta): మొదటిసారిగా ఈ కారు 2015లో విడుదలైంది. ఇది ఒక ఎస్‌యూవీ. ప్రతి నెల దేశీయ మార్కెట్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడైన ముఖ్యమైన కార్ల జాబితాలో ఖచ్చితంగా ఒక స్థానాన్ని సంపాదించుకుంటుంది. కొత్త హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ రూ. 11 లక్షల నుంచి రూ. 20.42 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది.

Creta

కొత్త హ్యుందాయ్ క్రెటా కారు 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లను కలిగి ఉంది. లీటరుకు 17.4 నుండి 21.8 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ ఎస్‌యూవీలో 5 సీట్లు ఉన్నాయి. డ్యూయల్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ ఏసీతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 17, 2025, 12:40 [IST]
English summary
From maruti 800 to creta 9 milestone cars that shaped india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+