7+1 సీట్లతో తొలి ఎలక్ట్రిక్‌ ఆటో విడుదల.. దీని కొనుక్కుంటే లక్ష్మీ దేవి ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లే!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో అనేక స్టార్టప్ సంస్థలు ఈ రంగంలో అడుగుపెడుతున్నాయి. తమ వాహనాలతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అలా కస్టమర్లకు బాగా చేరువైన సంస్థ ఒక గాయత్రి ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిటిమెట్. ఈ సంస్థ నుంచి తాజాగా ఓ కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా భారత మార్కెట్లో విడుదలైంది. సాధారణ ఆటో రిక్షా కంటే మెరుగైన ఫీచర్లు, సదుపాయాలతో ఈ ఇ-రిక్షాను తీసుకువచ్చింది గాయత్రి సంస్థ. ముఖ్యంగా ఇందులో 7+1 సీటర్ ఫెసిలిటీ దీనికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.

ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఫీచర్లు, రేంజ్, స్పెసిఫికేషన్లు వంటి తదితర విశేషాలు ఉన్నాయి. అయితే భారత్‌లోని ఏ ఇతర ఆటో రిక్షాలో కూడా 7+1 సీటింగ్ కెపాసిటీ అందుబాటులో లేదు. అందుకే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా భారత్‌లోనే తొలి 7+1 సీటర్ ఆటోరిక్షాగా పేరు సంపాదించింది. దబంగ్ మ్యాక్స్ఎక్స్(Dbang maxX) పేరుతో దీన్ని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.

Gayatri Electric Dabang maaX Electric Auto

ఈ ఎలక్ట్రిక్ ఆటో.. ఇంటర్నల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ నుంచి సర్టిఫికేషన్ పొందింది. అంటే ఈ రిక్షాను అన్ని ప్రభుత్వ నిబంధనలను అనుసరించి తయారు చేశారని అర్థం. అందువల్ల ఈ ఆటో... సేఫ్టీ సహా ఇతర విషయాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తుందని చెప్పవచ్చు. ఈ ఆటో 50 kmph స్పీడ్‌తో ప్రయాణించగలదు. అలాగే దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కి.మీ.ల దూరం ప్రయాణించగలదు.

దీని సూపర్ రేంజ్ కేపబిలిటీ కోసం ఈ ఎలక్ట్రిక్ ఆటోలో... 60V\12.6 KW లిథియం-ఐరన్-పాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అలాగే దీన్ని ఫుల్ ఛార్జింగ్ కోసం తక్కువ రూపాయలే ఖర్చు అవుతాయని కూడా గాయత్రి సంస్థ అంటోంది. అందువల్ల ఈ ఆటోతో ఆటో డ్రైవర్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.

అలాగే.. ఇందులో ఏడుగురు ప్రయాణికులను తీసుకువెళ్లవచ్చు. దీంతో సాధారణ ఆటో కంటే ఈ ఆటోతో డబుల్ ఆదాయం పొందడానికి అవకాశంగా చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఆటోను షేర్ ఆటో సర్వీసు కోసం గాయత్రి సంస్థ తీసుకువచ్చింది. గాయత్రి ఎలక్ట్రిక్ వాహన సంస్థ కేవలం ప్యాసెంజర్ ఆటోలనే కాకుండా భారత మార్కెట్లో కొత్త లోడ్ ఆటోను కూడా తీసుకువచ్చింది.

Entrega పేరుతో ఈ ఆటోను మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ లోడ్ ఆటో ఎంట్రిగా HD+, ఎంట్రిగా LD అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. దీన్ని వినియోగదారులకు మ్యాగ్జిమమ్ బెనిఫిట్ అందించే విధంగా రూపొందించారు. ఈ లోడ్ ఆటో 700 కిలోల వరకు బరువును తరలించగలదు. అలాగే దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 140 కి.మీ.ల దూరం ప్రయాణించవచ్చు.

ఇందులో లిథియం- ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 60V\210 AH తో పని చేస్తుంది. ఇక ఇందులో 7800W మోటార్ ఉంటుంది. ఇదే మోటార్ దబాంగ్ మ్యాక్స్ఎక్స్(Dbang maxx) ప్యాసెంజర్ ఆటోలోనూ ఉంటుంది. నిటారుగా ఉండే రోడ్లపై ఈ ఆటోలు బాగా పని చేస్తాయని గాయత్రి సంస్థ చెబుతోంది. అందువల్ల.. ట్యాక్సీ సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: గాయత్రి సంస్థ ఈ ఎలక్ట్రిక్ ఆటోల ధరను వెల్లడించలేదు. అయితే... త్వరలోనే ఈ వివరాలు వెల్లడవ్వనున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. ఈ ఆటో ధర రూ.2.50 లక్షల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఒకవేళ నిజంగానే ఇంత తక్కువ ధరలో వస్తే గనుక ఇది కారు సేల్స్‌ను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Sunday, February 16, 2025, 10:36 [IST]
English summary
Gayatri electric launches dabang maxx electric auto check this 7 seater rickshaw details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+