విడుదలకు ముందే 30000 ప్రీ-బుకింగ్స్..! విచిత్రంగా ఉన్న ఈ డిజైన్‌కు మార్కెటో మంచి డిమాండ్
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. దిగ్గజ సంస్థల నుంచి మొదలకుని పలు స్టార్టప్ కంపెనీల నుంచి అదిరిపోయే మోడళ్లు మార్కెట్లోకి వరుసగా విడుదల అవుతున్నాయి. గత ఏడాదిలో చాలా ఈవీలు మార్కెట్లో సందడి చేశాయి. 2024 ఏడాదిలో మొత్తం వాహనాల సేల్స్‌లో ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన అమ్మకాలు కూడా మెరుగ్గానే నమోదు అయ్యాయి. ఇప్పుడు ఈ కొత్త ఏడాది 2024లో కూడా అంతకంటే ఎక్కువ ఈవీలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రపంచపు అతిపెద్ద ఆటోమొబైల్ ఈవెంట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో పలు ఈవీ తయారీదారులు తమ మోడళ్లను ప్రదర్శించారు. ఇవి చాలా వరకు అందిరిని ఆకట్టుకునే డిజైన్లతో అధునాతన ఫీచర్స్‌తో ఉన్నాయి. ఎంజీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు తమ ఈవీలను ప్రదర్శించాయి.
అయితే, వీటితో పాటే Gensol(జెన్‌సోల్) EV అనే వాహన తయారీ సంస్థ కూడా రెండు సీట్లతో ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను మోడల్ (ezio)ను ఆవిష్కరించింది. ఇది చూడటానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆటో ఎక్స్‌పోను చూడటానికి వచ్చిన వారిలో చాలా మంది ఈ 3 వీలర్ ఈవీని అలా చూస్తూనే ఉండిపోయారు. దీని వెరైటి డిజైన్ అందరిని ఆకట్టుకుంది. ఇది ఒక కారులాగా అనిపించినప్పటికి టాక్సీ సేవలకు ఉపయోగపడే ఎలక్ట్రిక్ త్రీవీలర్.

Gensol EV కేవలం రెండు సీట్లను కలిగి ఉంటుంది. త్వరలో విడుదల కాబోతుంది. రెండు సీట్లతో కూడిన ఎలక్ట్రిక్ త్రీవీలర్‌కు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందంటే లాంచ్ కాకముందే చాలా మంది ముందుగా బుకింగ్ చేసుకున్నారు. దీంతో పాటు మరో కార్గో మోడల్ Ezibotను కూడా విడుదల కాబోతుంది. ECO ఎలక్ట్రిక్ కార్, ECOBOT కార్గో ప్లాట్‌ఫారమ్ పేరుతో వస్తున్న ఈ వాహనాలను దాదాపు 30,000 మంది బుకింగ్ చేసుకున్నారు.
జెన్‌సోల్ EV సహ వ్యవస్థాపకుడు, CEO ప్రతీక్ గుప్తా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మా ఆటో కారు, కార్గో కారు ఇండియాలో సంచనల మోడళ్లు అవుతాయని అన్నారు. ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేయడానికి బ్లూస్మార్ట్, ఓలా ప్రాజెక్ట్ టీమ్‌తో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఇది బీ2బీ మార్కెట్‌ను విస్తరించడానికి తీవ్ర ప్రయత్నమని తెలిపారు.
రెండు సీట్లతో ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను మోడల్ ఇజియో(Ezio) బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 200 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. దీన్ని ఛార్జ్ చేయడానికి దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. ఈ మోడల్‌ను కంపెనీ 2025 మధ్య భాగంలో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర కూడా చాలా తక్కువగా పేద వారిని దృష్టిలో ఉంచుకునే విధంగా ఉంటుందని సమాచారం.
ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను మొదట బెంగళూరులో అందుబాటులోకి తీసుకువస్తారు. తరువాత ఢిల్లీలో, ఇతర ప్రాంతాల్లో కొనుగోలుకు ఉంచుతారు. మరో కార్గో మోడల్ ఎజిబోట్ (Ezibot) మోడల్‌ను మాత్రం వచ్చే ఏడాది అంటే 2026లో విడుదల చేస్తారని తెలుస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








