రెండు డోర్లతో ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ కారు వచ్చేస్తుంది.. ఇది రోడ్లపై వెళ్తుంటే జనాలకు పిచ్చెక్కుతుంది!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. స్టార్టప్‌ల నుంచి మొదలుకుని దిగ్గజ సంస్థల వరకు ఈవీల తయారీలో జోరు పెంచుతున్నాయి. మరోవైపు.. వినియోగదారులు అందుబాటు ధరలో ఉండే హై-ఎండ్ ఈవీ మోడల్స్ కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో Gensol EV అనే ఓ వాహన తయారీ సంస్థ.. సరికొత్త వాహనాలతో మార్కెట్లోకి రాబోతోంది. ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ సంస్థ ఓ 3- వీలర్‌ను ఆవిష్కరించింది. దీంట్లో కేవలం రెండు సీట్లే ఉన్నాయి. మరో కార్గో మోడల్‌ను కూడా తీసుకురాబోతోంది. మరి ఈ ఈవీలో ఉన్న ఇతర ఫీచర్లేంటో చూసేద్దాం.

ఈ కొత్త ఈవీకి సంబంధించిన వివరాలను ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో జెన్‌సోల్ ఈవీ కో-ఫౌండర్, సీఈఓ ప్రతీక్ గుప్తా వెల్లడించారు. Ezio(ప్యాసెంజర్ కారు), ezibot(కార్గో కారు) పేర్లతో రానున్న వాహనాలకు ఇప్పటికే 30,000 ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ఇది సరసమైన ధరల్లో ఉండే ఈవీలను కొనేందుకు వినియోగదారుల ఆసక్తిని కనబరుస్తోందన్నారు.

Gensol EV Ezio Eziobot Vehicles

డీలర్‌షిప్ కోసం బ్లూస్మార్ట్ సంస్థతో తమ చర్చలు చక్కగా సాగుతున్నాయని ప్రతీక్ గుప్తా తెలిపారు. ఓలా సంస్థకు చెందిన స్ట్రేటజీ టీమ్ కూడా తమ కారు సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ఈ సంప్రదింపులతో బీ2బీ మార్కెట్ విస్తృతి కోసం తమ ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతున్నాయని అన్నారు. దీని ద్వారా.. ధరతో పాటు, ఆపరేటింగ్ కాస్ట్ 40శాతం వరకు వినియోగదారులకు తగ్గించగలవని పేర్కొన్నారు.

ఈ ఏడాది రెండో అర్ధబాగంలో ఇజియో(Ezio) కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది జెన్‌సోల్ సంస్థ. మొదట దీన్ని బెంగుళూరు, తర్వాత దిల్లీ ఇతర కీలక మార్కెట్లలో విడుదల చేయనుంది. అదే సమయంలో ఈ సంస్థ కార్గో వేరియంట్ అయిన ఎజిబోట్(Ezibot) మోడల్ ను 2026లో విడుదల చేయనుంది. తమ వాహనాల నాణ్యత, పర్ఫార్మెన్స్ విషయంలో పటిష్ఠంగా ఉండేలా ఈ సంస్థ చర్యలు తీసుకుంటోంది.

ఇందుకోసం వివిధ వాతావరణ పరిస్థితుల్లో అనువుగా ఉండేలా కఠిన పరీక్షలను నిర్వహిస్తోంది. జైసల్మేర్ వంటి ఉష్ణప్రాంతాలతో పాటు, పశ్చిమ కనుమల్లో ఉండే వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలాగా ఈ వాహనాల టెస్టింగ్ చేస్తోంది జెన్‌సోల్ సంస్థ. దీని ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టి ARAI సర్టిఫికేషన్ పొందింది.

ఈ కార్ల బ్యాటరీలు ఇతర ఈవీల్లో ఉండే 800-1000 సైకిల్స్‌తో కాకుండా.. 3,000 ఛార్జింగ్ సైకిల్స్‌తో అప్‌గ్రేడ్ చేసింది. దీని ద్వారా బ్యాటరీ లైఫ్ పెరిగి, డ్రైవర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. తమ LFP బ్యాటరీలను తిరిగి వినియోగించే విధంగా సెకండ్- లైఫ్ అప్లికేషన్ల పర్యావరణ భాగస్వామ్యం కోసం ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.

దీని కోసం తాము ఉపయోగించిన 48- వోల్ట్ సిస్టం ద్వారా ఈ బ్యాటరీలను 5 నుంచి 7 సంవత్సరాల తర్వాత తిరిగి ఉపయోగించేందుకు సాధ్యమవుతుంది. ఈ బ్యాటరీలను మొబైల్ టవర్ బ్యాకప్, పవర్ స్టోరేజ్ కోసం పునర్వినియోగించవచ్చు. ఈ ఆవిష్కరణలు.. పర్యావరణ హితకరంగా, తక్కువ ధరలో ఉండే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో జెన్‌సోల్ సంస్థ నిబద్ధతను చాటుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 28, 2025, 12:14 [IST]
English summary
Gensol ezio eziobot vehicles all set to launch soon with affordable price check details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+