50 ఏళ్లుగా తరగని అందం.. ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్న కారు.. కోట్ల అమ్మకాలతో దూసుకుపోతుంది

దాదాపు 50 ఏళ్ల క్రితం అమ్మకానికి వచ్చిన ఒక కారు ఇప్పటికి మంచి ఆదరణ కలిగి ఉండటం అంటే సాధారణ విషయం కాదు. ఆ మోడల్ పేరే 'పోలో (Polo)'. ఇది ఫోక్స్‌వ్యాగన్(volkswagen) నుంచి విడుదలైన మోడల్. పోలో కారు అంతర్జాతీయంగానే కాకుండా ఇండియాలో కూడా బాగా పరిచయం ఉన్న మోడల్. ఫోక్స్‌వ్యాగన్ తొలిసారిగా దీన్ని 1975లో ప్రపంచానికి పరిచయం చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. లాంచ్ అయిన అనతి కాలంలోనే పోలో ప్రపంచ దేశాల్లో ఎక్కువగా సేల్స్ సాధించి సంచలనం సృష్టించింది. భారత్‌లో కూడా ఇతర కార్ల కంటే కూడా సేల్స్ పరంగా మెరుగైన స్థానంలో నిలిచింది. ఐదు దశాబ్దాలుగా ఒక కారు విజయవంతంగా అందరి అభిమానాన్ని పొందుతుంది. అయితే ఈ కారు ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు. రెండు సంవత్సరాల క్రితం దీని అమ్మకాలు ఇక్కడ నిలిపివేశారు.

ఫోక్స్‌వ్యాగన్ పోలోను 2022 నాటి నుంచి సేల్స్‌ను ఆపివేయడం జరిగింది. కానీ గ్లోబల్ మార్కెట్లో మాత్రం అందుబాటులో ఉంది. అయితే ఈ కారు తాజాగా అంతర్జాతీయంగా 50 ఏళ్లు పూర్తి చేసుకుని సరికొత్త మైలురాయికి చేరుకుంది. ఇది ఇప్పటి వరకు కూడా దాదాపు 2 కోట్లకు పైగా సేల్స్ యూనిట్లను సాధించింది. యాభైవ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంటున్న వేళ పోలో గురించి మరిన్ని విషయాలు క్రింది కథనంలో తెలుసుకుందాం.

volkswagen polo celebrates 50 years

1975లో ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టిన పోలో ప్రస్తుతం 6వ జనరేషన్ మోడల్ గ్లోబల్‌గా అమ్మకానికి అందుబాటులో ఉంది. అదే ఇండియాలో మాత్రం ఐదో తరం మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉండగా, ఆ తర్వాత తరం అమ్మకాలను నిలిపివేశారు. భారత్‌లో పోలో కారు దాదాపు 12 సంవత్సరాల పాటు సేల్‌కు ఉంది. ఈ కారును దేశంలో ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా కొనుగోలు చేశారు.

ఇండియాలో పోలో చివరి మోడల్ ఐదో తరం మాత్రమే. లోకల్ కంపెనీలతో పాటు, అంతర్జాతీయంగా బాగా పేరున్న కంపెనీల నుంచి సరికొత్త కార్లు దేశంలో విడుదల కావడంతో మార్కెట్లో పోటీ మరింత పెరిగింది. దీంతో ఇలాంటి వాతావరణంలో పోలో సేల్స్ కొంత ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. అమ్మకాలు తగ్గుతుండటంతో ఫోక్స్‌వ్యాగన్ తన పోలో కారు విక్రయాలను నిలిపివేసింది. అయితే గ్లోబల్‌గా పోలో సేల్స్ సానుకూలంగా ఉన్నాయి.

volkswagen polo 50 years

దీంతో ప్రపంచ మార్కెట్లో తన ప్రస్తుత మోడల్ ఆరో తరం కారును మాత్రం వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. ఇండియాలో పూణేలోని తన చకన్ ప్లాంట్‌లో తయారైన మొదటి మోడల్ మొదటి తరం పోలోనే. ఈ కారును ఆడి 50 కార్ మోడల్‌ను ప్రేరణగా తీసుకుని తయారు చేశారు. దీని ఆకట్టుకునే డిజైన్‌‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. కంపెనీ ఒక్కో తరంలో ట్రెండ్‌కు అనుగుణంగా ఫీచర్లను అందించింది.

ప్రధానంగా పోలో మూడవ తరం నుంచి లేటెస్ట్ ఫీచర్లు రావడం మొదలైంది. ఈ మోడల్‌లో ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు మరిన్ని ఫీచర్లు ఇచ్చారు. ఆ తరువాత 2002లో ముందు, సైడ్‌కు ఎయిర్‌బ్యాగులు, యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టం( ABS), పవర్ స్టీరింగ్ వంటివి ఇచ్చారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 1, 2025, 11:49 [IST]
English summary
German icon volkswagen polo celebrates 50 years here the details
Read more on: #volkswagen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+