కొండలను కూడా పిండి చేసేంత స్ట్రాంగ్ బండ్లను తీసుకొస్తున్న టాటా.. బడ్జెట్ రెడీ చేస్కొని రెడీగా ఉండండి
భారతదేశంలో టాటా మోటార్స్ (Tata Motors) అంటే కేవలం కార్ల తయారీ సంస్థ మాత్రమే కాదు.. భద్రతకు, వినూత్నతకు మరో పేరు. టియాగో, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడళ్లతో ఇప్పటికే మార్కెట్‌లో తిరుగులేని స్థానాన్ని పదిలం చేసుకున్న ఈ కంపెనీ త్వరలో మరో మూడు కొత్త కార్లను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా భద్రత, ఎలక్ట్రిక్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ రాబోతున్న ఈ మూడు కార్లు టాటా అవిన్య ఎక్స్, టాటా సఫారీ ఈవీ, టాటా సియెర్రా ఆటో రంగంలో సంచలనం సృష్టించనున్నాయి. వీటి ధరలు, ప్రత్యేకతలు, విడుదల తేదీల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
1. టాటా అవిన్య (Tata Avinya X)
కొత్త అవిన్య ఒక విద్యుత్ ఆధారిత ఎస్‌యూవీ. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించారు. అక్కడ చూపిన నమూనా చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టి ఆకృతికి పోలిన ఎల్‌ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్, గ్రిల్, టైల్ లైట్లను ఇది కలిగి ఉంది.

ఇది పదుల సంఖ్యలో ప్రత్యేకతలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా టచ్‌స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను కలిగి ఉండవచ్చు. అదేవిధంగా, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360 డిగ్రీ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ కారు 5 సీట్లను కలిగి ఉంటుంది, ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. ఇది పెద్ద పరిమాణంలో ఉండే బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించగలదని అంచనా. 2026 రెండవ భాగంలో విడుదల కావచ్చని చెబుతున్నారు. దీని ధర సుమారు రూ. 40 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.

2. టాటా సఫారీ ఈవీ (Tata Safari EV)
ఇది ఒక ఎలక్ట్రిక్ బేస్డ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ కానుంది. సాధారణ సఫారీ కారు మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుంది. అత్యుత్తమ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ పగటి పూట వెలిగే లైట్లు, అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. మంచి కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
కొత్త సఫారీ ఈవీ హారియర్ ఈవీ వలె 65, 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. పూర్తి ఛార్జ్ చేస్తే 627 కిలోమీటర్ల వరకు దూరం ప్రయాణించగలదని అంచనా. ఇది 6 సీట్లను కలిగి ఉంటుంది. టచ్‌స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ సహా వివిధ ప్రత్యేకతలను కలిగి ఉంటుందని ఆశిస్తున్నారు. సుమారు రూ. 32 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉండవచ్చని అంచనా వేయబడింది. 2026 మొదటి భాగంలో విడుదల కావచ్చని చెబుతున్నారు.

3. టాటా సియెర్రా (Tata Sierra)
ఇది వచ్చే నెలలోనే (నవంబర్) అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. ఇంధన (పెట్రోల్/డీజిల్), ఎలక్ట్రిక్ బేస్డ్ రూపాల్లో వినియోగదారులకు లభించనుంది. ఇది మరింత ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు పెట్రోల్ డీజిల్ మోడల్ సుమారు రూ. 10 లక్షలు, ఎలక్ట్రిక్ వెహిక రూ. 25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉండవచ్చని చెబుతున్నారు.
కొత్త సియెర్రా 5 సీట్లను కలిగి ఉంటుంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో సహా అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుందని ఆశిస్తున్నారు. 7 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360 డిగ్రీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








