ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫీలింగ్ కావాలా? 20 లక్షలుంటే చాలు.. ఈ కార్లతో రోడ్ల మీద రచ్చ చేయొచ్చు!
ప్రతి రైడ్‌ను ఎంజాయ్ చేయాలని చూస్తున్నారా.. అయితే రూ.20లక్షల లోపు ఉన్న టాప్ 5కార్ల లిస్ట్ చూద్దాం. ఈ కార్లు కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లడానికి మాత్రమే కాదు. డ్రైవింగ్‌లోని థ్రిల్‌ను, ప్రతి మలుపులో అడ్రినలిన్‌ను నింపే ఎక్సపీరియన్స్‌ను అందిస్తాయి. హ్యాచ్‌బ్యాక్‌ల నుండి SUVల వరకు ప్రతి కార్ల లవర్స్‌కు కోరుకునే బాడీ స్టైల్స్, బ్రాండ్‌లు, పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉన్న వాహనాల గురించి తెలుసుకుందాం.
హ్యుండాయ్ i20 N లైన్(Hyundai i20 N Line): దీని ధర రూ.10లక్షల నుంచి రూ.12.56లక్షల వరకు ఉంటుంది. స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్‌ల కోసం చూస్తున్నవారికి ఇది ఒక స్పెషల్ ఆఫ్షన్. స్పోర్టీ సస్పెన్షన్, టర్బో పెట్రోల్ ఇంజన్ కారణంగా ఇది మంచి డ్రైవింగ్‌ను అందిస్తుంది. 1-లీటర్ టర్బోపెట్రోల్ ఇంజన్ 120PS పవర్, 172Nmటార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ లేదా DCTగేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్నిస్తుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్(టర్బో)(Maruti Suzuki Fronx (Turbo)): దీని ధర రూ.7.55లక్షల నుండి రూ.13.04లక్షల వరకు. స్టైలిష్ డిజైన్‌కు పేరుగాంచిన ఫ్రాంక్స్ కేవలం చూడటానికి మాత్రమే కాదు. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది ఖరీదైన కార్లను కూడా వెనక్కి నెట్టగలదు. NA పెట్రోల్ ఇంజిన్‌తో కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, 1-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ 100PS పవర్, 148Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
స్కోడా కుషాక్(Skoda Kushaq): దీని ధర రూ.7.89లక్షల నుండి రూ.14.40లక్షల వరకు. స్కోడా కాంపాక్ట్ SUV ఆఫర్, పెద్ద కుషాక్‌తో పంచుకున్న MQB AO INప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఇది బాగా నిర్మించిన చట్రం, చురుకైన హ్యాండ్లింగ్, ఎట్రాక్టీవ్ స్టీరింగ్ కారణంగా డ్రైవింగ్ ఎంజాయ్ చేయవచ్చు. 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115PS పవర్, 178Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది బేస్ వేరియంట్ నుంచి కూడా మంచి డ్రైవింగ్‌ను అందిస్తుంది.

వోక్స్‌వ్యాగన్ విర్టస్ (Volkswagen Virtus): దీని ధర రూ. 11.56 లక్షల నుండి రూ. 19.40 లక్షల వరకు. దీని స్టీరింగ్, ఖచ్చితమైన హ్యాండ్లింగ్, అధిక మైలేజ్ కారణంగా ఇది ఒక స్పోర్టీ సెడాన్‌ను పోలి ఉంటుంది. GT వేరియంట్‌ను ఎంచుకోవడం ద్వారా 150 PS పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందవచ్చు.
దాని స్పోర్టీ లుక్ మరింత మెరుగుపరిచే డిజైన్ అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదే ప్లాట్‌ఫారమ్, ఇంజిన్‌ను కలిగి ఉన్న స్కోడా స్లావియా మరింత సౌకర్యవంతమైన సస్పెన్షన్‌ను, ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. విర్టస్, స్లావియాలను బడ్జెట్ ఆధారంగా సెలక్ట్ చేసుకోవచ్చు.

మహీంద్రాBE6(Mahindra BE6): ఎలక్ట్రిక్ వాహనం అయినప్పటికీ ఇది రూ.20లక్షల లోపు బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. రూ.18.9లక్షల నుండి ప్రారంభమయ్యే దీని బేస్ వేరియంట్ సుమారు 230 PS పవర్, 380 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని రియర్-వీల్ డ్రైవ్ సెటప్ మంచి డ్రైవింగ్‌ను అందిస్తుంది. ఎంజీ కామెట్ ఈవీ, టార్క్, సరదా డ్రైవింగ్ అనుభవాన్ని అందించే ఎలక్ట్రిక్ మైక్రో కారు కూడా ఒక ఎక్స్ ట్రా ఆఫ్షన్.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








