ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. మైలేజ్ మాస్టర్స్.. రూ. 12 లక్షల లోపు బెస్ట్ 5-సీటర్ SUVలు ఇవే!

మనదేశంలో SUVల హవా కొనసాగుతోంది. వాటి స్టైలిష్ డిజైన్, విశాలమైన క్యాబిన్, లేటెస్ట్ ఫీచర్ల కారణంగా వినియోగదారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా కొత్త SUV కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, రూ. 12 లక్షల కంటే తక్కువ ధరలో లభించే కొన్ని అద్భుతమైన 5-సీటర్ SUVల గురించి తెలుసుకుందాం.

ఇవి మంచి మైలేజీని కూడా అందిస్తాయి. ఈ జాబితాలో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, కియా సోనెట్, స్కోడా కలోక్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకి బ్రెజ్జా, హోండా ఎలివేట్ వంటి పాపులర్ మోడల్స్ ఉన్నాయి.

5-Seater SUVs

1. టాటా పంచ్ : భారతీయ మార్కెట్లో రూ. 12 లక్షల లోపు లభించే పాపులర్ SUVలలో టాటా పంచ్ ఒకటి. దీని ధర రూ. 6.20 లక్షల నుంచి రూ. 10.32 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, CNG ఆఫ్షన్‎తో కూడా లభిస్తుంది. ఇది లీటరుకు18.8 నుంచి 26.99కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.

ఈ ఎస్‎యూవీలో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ముఖ్యమైన ఫీచర్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం రెండు ఎయిర్‌బ్యాగులు అందించబడ్డాయి.

Tata Punch Price

2. హ్యుందాయ్ ఎక్స్‌టర్ : హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా రూ. 12 లక్షల లోపు ధరలో లభించే మరో పాపులర్ SUV. దీని ధర రూ. 6.21 లక్షల నుంచి రూ. 10.51 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆఫ్షన్లో లభిస్తుంది. ఇది లీటరుకు19.2 నుంచి 27.1కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఈ కారు 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంది.

3. కియా సోనెట్ : కియా సోనెట్ రూ. 12 లక్షల కంటే కొంచెం ఎక్కువ ధరలో, కొన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 17.80 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇది లీటరుకు 17.65 నుండి 20.75కి.మీ వరకు అందిస్తుంది.

kia syros

ఇది 5-సీటర్ వాహనం. ఇందులో ఒక చిన్న ఫ్యామిటీ సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈ కారు డ్యూయల్ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిస్‌ప్లే), ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డ్యూయల్-జోన్ AC, సేఫ్టీ కోసం ADAS వంటి లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది.

4. స్కోడా కైలాక్ : స్కోడా కైలాక్ రూ. 12 లక్షల లోపు ధరలో లభించే స్టైలిష్ SUV. దీని ధర రూ. 7.89 లక్షల నుంచి రూ. 14.40 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. లీటరకు 15 నుంచి18కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఇది 5-సీట్ల కెపాసిటీ కలిగి ఉంది. ముఖ్యమైన ఫీచర్లలో 10-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి.

5. హ్యుందాయ్ క్రెటా : ఇది రూ. 12 లక్షల కంటే కాస్త ఎక్కువ ధరలో లభిస్తుంది. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20.42 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ (న్యాచురల్లీ ఆస్పిరేటెడ్), 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. మైలేజ్ లీటరుకు 17.4 నుండి 21.8కి.మీ వరకు ఉంటుంది. ఇది డ్యూయల్ డిస్‌ప్లేలు, డ్యూయల్-జోన్ AC, ADAS వంటి ఫీచర్లను కలిగి ఉంది.

maruti Brezza

6. మారుతి సుజుకి ఫ్రాంక్స్ : ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్స్‎లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒకటి. ఇది కూడా రూ. 12 లక్షల లోపు ధరలో లభించే మరో మంచి SUV. దీని ధర రూ. 7.51 లక్షల నుంచి రూ. 13.04 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్, CNG ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది.

ఈ మోడల్ ఇది 20.1 నుంచి 28.51కిలోమీటర్ల వరకు అత్యుత్తమ మైలేజ్‌ను అందిస్తుంది. ఇది కూడా 5సీటర్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇందులో ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ఇందులో ముఖ్యమైన ఫీచర్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, 6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

7. మారుతి సుజుకి బ్రెజ్జా : ఇది కూడా రూ. 12 లక్షల లోపు ధరలో చాలా వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 8.69 లక్షల నుంచి రూ. 14.14 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్ ఆఫ్షన్లలో లభిస్తుంది. లీటరుకు 17.38 నుంచి 25.51కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఇది 5-సీటర్, 9-ఇంచుల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగులు వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Honda Elevate

8. హోండా ఎలివేట్ : ఇది రూ. 12 లక్షల కంటే కొంచెం ఎక్కువ ధరతో ప్రారంభమవుతుంది. దీని ధర రూ. 11.91 లక్షల నుంచి రూ. 16.73 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. లీటరుకు 15.31 నుంచి 16.92కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇది 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

పైన పేర్కొన్న ప్రతి SUV రూ. 12 లక్షల రేంజ్‎లో లభిస్తుంది (కొన్ని బేస్ వేరియంట్లు లేదా కొంచెం ఎక్కువ ధర కలిగి ఉంటాయి). ఇవన్నీ 5-సీటర్ సామర్థ్యం కలిగి ఉండి.. మంచి మైలేజ్‌ను అందిస్తాయి. మీ బడ్జెట్‌కు అనుగుణంగా నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 31, 2025, 13:30 [IST]
English summary
Guide to 5 seater suvs under 12 lakhs choosing the right car for your family
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+