బైక్ కంటే తక్కువ ధరకే హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు! చిన్న కుటుంబాలకు బెస్ట్.. తొలి చూపులోనే ఆకట్టుకుంది
హీరో మోటోకార్ప్ (hero motocorp) గురించి చెప్పుకుంటే, ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఎన్నో దశాబ్దాలుగా పెట్రోల్ ఇంజిన్ బైక్‌లు, స్కూటర్లు అందిస్తూ లక్షలాది మంది వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన ఈ బ్రాండ్, ఇప్పుడు కొత్త యుగానికి సరిపోయేలా తన పాదాన్ని ఎలక్ట్రిక్ విభాగంలో కూడా బలంగా మోపుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతుండటంతో, హీరో మోటోకార్ప్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. అయితే, ఎలక్ట్రిక్ మోడళ్లను తన ప్రధాన బ్రాండ్ కింద కాకుండా, ప్రత్యేక గుర్తింపుతో విడుదల చేయడానికి VIDA అనే ప్రత్యేక EV బ్రాండ్‌ను రూపొందించింది.
ఇప్పటికే Vida V1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో తన స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ బ్రాండ్, యువతను ఆకట్టుకునే డిజైన్, ఆధునిక ఫీచర్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, హీరో మోటోకార్ప్ VIDA బ్రాండ్ కింద ఇకపై కేవలం స్కూటర్లకే పరిమితం కాకుండా, మరో పెద్ద అడుగు వేయబోతోంది. అది ఎలక్ట్రిక్ కారు అభివృద్ధిపై పని చేస్తోందనే ఊహాగానాలు బలం పుచ్చుకుంటున్నాయి.

ఇటలీలోని మిలాన్ నగరం ప్రతి సంవత్సరం ప్రపంచ ఆటోమొబైల్ రంగం కళకళలాడే వేదికగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడే జరగుతుంది ప్రతిష్టాత్మకమైన EICMA ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులు, ఆటో ప్రేమికులు, వాహన తయారీ సంస్థలు ఆసక్తిగా ఎదురుచూసే వార్షిక ఆటోమొబైల్ ఎగ్జిబిషన్. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా EICMA 2025 అద్భుతంగా నిర్వహించబడింది. కొత్త టెక్నాలజీలు, భవిష్యత్ వాహనాలు, కట్టింగ్-ఎడ్జ్ డిజైన్లతో ఈ ఫెస్టివల్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
ఈ వేదికలో హీరో VIDA బ్రాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బ్రాండ్, భవిష్యత్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సిద్ధమవుతున్నట్టు సందేశం ఇవ్వడమే కాకుండా, తన కాన్సెప్ట్ మోడళ్లతో అందరి దృష్టిని తనవైపు మళ్లించుకుంది. VIDA స్టాల్‌లో కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే కాదు, పూర్తిగా భవిష్యత్ దృష్టితో రూపొందించిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ కూడా ప్రదర్శించబడింది. ఇవి ఆధునిక డిజైన్, అధునాతన బ్యాటరీ టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో ఆకట్టుకున్నాయి.

NEX 3 పేరుతో విడా స్టాల్‌లో కనిపించిన ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు మొత్తం EICMA ఫెస్టివల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిన్నదైన డిజైన్, భవిష్యత్ తరహా లుక్, అనూహ్యంగా కాంపాక్ట్ సైజ్‌తో ఇది ఒక కొత్త రకం అర్బన్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సూచికగా నిలుస్తోంది. ఇది 2-సీటర్ మైక్రో ఎలక్ట్రిక్ కారు. ముందు డ్రైవర్, ఆయన వెనుక ఒకే ఒక్క ప్రయాణికుడు కూర్చోవడానికి వీలుగా కేబిన్‌ను డిజైన్ చేశారు.
ఈ కారు పొడవు, వెడల్పు చాలా చిన్నగా ఉండేలా రూపొందించారు. సిటీ ట్రాఫిక్‌లో బైక్‌లా దూసుకెళ్లేలా, పార్కింగ్ కోసం బోలెడంత స్థలం వెతకాల్సిన పనిలేకుండా, పట్టణ ప్రయాణాలకు సరిగ్గా సరిపోయేలా కారు తయారైంది. సిటీ ట్రాఫిక్‌లో రోజూ బైక్‌పై వెళ్లడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా మండే వేసవిలో గాలి చెమటలు పట్టించే వేడి, వర్షాకాలంలో ఒక్కసారిగా కురిసే భారీ వర్షంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణం ఒక సవాలుగా మారుస్తాయి.

హెల్మెట్, రెయిన్‌కోట్, జాగ్రత్తలు అన్నీ వేసుకున్నా కూడా ప్రయాణం అసౌకర్యంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చాలామంది నానో లాంటిదే కానీ ఎలక్ట్రిక్‌లో చిన్న కారు ఉంటే బాగుండు అని అనుకునే వారు తక్కువ కాదు. అదే ఆలోచనను నిజం చేస్తున్నట్లుగా హీరో విడా బ్రాండ్ కింద ప్రదర్శించిన ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారు ప్రత్యక్షమైంది. ఇది తక్కువ ధరలో రానుందని తెలుస్తుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications








