టయోటా కారుకు భారీ డిమాండ్.. స్టాక్ లేదన్నా గోల పెడుతున్న కస్టమర్లు..తల పట్టుకుంటున్న షోరూం ఎంప్లాయీస్

మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎస్‌యూవీకి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. స్ట్రాంగ్ బాడీ, బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్, ఆకట్టుకునే ఫీచర్ల కారణంగా ఈ కారును కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా, జిఎస్‌టి 2.0 అమలు తర్వాత ధర తగ్గడం, పండుగ సీజన్ కలిసి రావడంతో ఈ ఎస్‌యూవీ విక్రయాలు భారీగా పెరిగాయి. రూ.10.95 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ హైరైడర్ స్పెషాలిటీ, అది అందిస్తున్న మైలేజ్ గురించి వివరంగా తెలుసుకుందాం.

టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మొత్తం 7,608 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది అంటే 2024 ఇదే నెలలో కేవలం 5,385 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, విక్రయాలు గతేడాదితో పోలిస్తే 41.28% పెరిగాయి.

Toyota Urban Cruiser Hyryder

ఈ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణం ఇటీవల అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు. దీని వల్ల హైరైడర్ ధర ఏకంగా రూ.66,100 వరకు తగ్గింది. ఇది కస్టమర్‌లను పెద్ద ఎత్తున ఆకర్షించింది.

టయోటా హైరైడర్ చాలా పోటీ ధరలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.10.95 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.19.76 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది మొత్తం ఇ (E), ఎస్ (S), జీ (G), వి (V) అనే నాలుగు ఆకర్షణీయమైన వేరియంట్లలో లభిస్తుంది.

Toyota Urban Cruiser Hyryder

డిజైన్ విషయానికి వస్తే.. హైరైడర్ ప్రీమియం గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇది మొత్తం ఏడు డిఫరెంటు కలర్లలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ బరువు 1,755 కేజీలు ఉంటుంది. ఇది దాని దృఢత్వాన్ని సూచిస్తుంది. దీని కొలతలు 4,365 మి.మీ. పొడవు, 1,795 మి.మీ. వెడల్పు, 1,645 మి.మీ. ఎత్తుగా ఉంటాయి.

హైరైడర్ పవర్ఫుల్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంది. ఇందులో 1.5-లీటర్ హైబ్రిడ్ ఇంజన్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్),సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, ఇ-సీవీటీ గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది. మైలేజ్ విషయంలో ఇది బైక్‌లకు ఏమాత్రం తీసిపోదు.

Toyota Urban Cruiser Hyryder

ఇది లీటరుకు 19 కి.మీ. నుండి గరిష్టంగా 27.97 కి.మీ. వరకు అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. 45 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీతో, ఇది ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కారు 12.4 సెకన్లలో 0 నుండి 100 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకోగలదు.

హైరైడర్ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా మెరుగ్గా ఉంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఐదుగురు ప్రయాణికులు సులభంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుంది. లాంగ్ ట్రిప్‌ల కోసం ఇందులో 373 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

సేఫ్టీ విషయంలో కూడా హైరైడర్ రాజీ పడలేదు. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, వీఎస్‌సీ (VSC - వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, October 10, 2025, 13:30 [IST]
English summary
High demand for toyota hyryder 27 97 kmpl mileage price cut drives sales
Read more on: #toyota #car sale #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+