మారుతీకి కష్టకాలం మొదలైంది.. కియా కొత్త కారెన్స్ వచ్చేస్తోంది..ఇక దబిడిదిబిడే
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా త్వరలో సరికొత్త 7 సీటర్ ఎంపీవీని విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. అదే కియా కారెన్స్ (Kia Carens) ఫేస్‌లిఫ్ట్. ఈ కారు ఇప్పటికే మార్కెట్లో రెండు లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఈ మధ్య కాలంలో ఈ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత్‌తో పాటు విదేశాల్లో కూడా పలుమార్లు టెస్ట్ చేస్తుండగా కనిపించింది.
ఇప్పుడు ఈ కారు విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కియా మే 8న ఈ కొత్త ఎంపీవీ విడుదల చేయనుంది. అంతేకాకుండా, 2025 కియా కారెన్స్‌కు కొత్త పేరు కూడా ఉంటుందని కియా తెలిపింది. ప్రస్తుతం అమ్ముడవుతున్న కారెన్స్‌ను నిలిపివేయకుండా, ఈ రెండు మోడళ్లను కలిపి విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.

ధరల ప్రకటన ఎప్పుడు ఉంటుందనే దానిపై కంపెనీ స్పష్టమైన సమాచారం కంపెనీ ఇవ్వలేదు. 2022లో కారెన్స్‌ను విడుదల చేసిన విధంగానే, ఆవిష్కరణ జరిగిన నెల రోజుల్లోనే ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఉంది. సాధారణ ఫేస్‌లిఫ్ట్‌ల వలె కాకుండా, ఈ కొత్త 7-సీటర్ ఎంపీవీ అనేక లేటెస్ట్ ఫీచర్లతో.. మరింత ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌తో రానుంది.
దీని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లను కొనసాగించే అవకాశం ఉంది. కొత్త కారెన్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. గతంలో కనిపించిన స్పై చిత్రాలను పరిశీలిస్తే ఈ కొత్త ఎంపీవీ ప్రస్తుతమున్న కారెన్స్ ఎంపీవీ కంటే భిన్నమైన కొత్త రూపాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన EV6 ఎలక్ట్రిక్ కారు నుంచి ఇన్స్పైర్ అయిన హెడ్‌ల్యాంప్‌లు, గ్రిల్‌పై LED లైట్ బార్, కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లు, కొత్త LED టెయిల్ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఇందులో ఉండవచ్చు. కారెన్స్ ఫేస్‌లిఫ్ట్, ఇంటీరియర్ స్పై షాట్‌లు ఇప్పటివరకు బయటకు రాలేదు.
కానీ, ఎక్స్‌టీరియర్‌తో పోలిస్తే ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త అప్‌హోల్‌స్టరీ, కలర్ ఆప్షన్‌లతో పాటు డాష్‌బోర్డ్, డోర్‌ల వరకు మార్పులు ఉండవచ్చు. కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఎంపీవీ ఫీచర్ల జాబితాలో మరిన్ని సౌకర్యాలను చేర్చనున్నారు.

మెరుగైన సేఫ్టీ, సౌకర్యం కోసం 360-డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS సూట్ వంటి ముఖ్యమైన ఫీచర్లను ఇందులో చేర్చారు. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, అప్‌డేట్ చేసిన ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను కూడా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ హై-ఎండ్ వేరియంట్లలో అందించే అవకాశం ఉంది. కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్‌లను కొనసాగిస్తుందని భావిస్తున్నారు.
ఈ కారు 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ NA పెట్రోల్ ఇంజన్ 115hp పవర్‌ను, 144Nm టార్క్‌ను అందిస్తుంది. అయితే టర్బో మోటార్ 160hp పవర్‌ను, 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారెన్స్‌లోని డీజిల్ ఇంజన్ 116hp పవర్‌ను, 250Nm టార్క్‌ను అందించగలదు.

ఎంట్రీ-లెవెల్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్‌తో వస్తుంది. అయితే, కారెన్స్ టర్బో-పెట్రోల్ మోటార్‌తో 6-స్పీడ్ iMT లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో వస్తుంది. ప్రస్తుతం కారెన్స్ ఎక్స్-షోరూమ్ ధర 10.60 లక్షల నుండి 19.70 లక్షల రూపాయల వరకు ఉంది.
ఫేస్‌లిఫ్ట్ మోడల్ దీని కంటే ఎక్కువ ధర కలిగి ఉండే అవకాశం ఉంది. ఫుల్లీ లోడెడ్ ట్రిమ్‌కు 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ ధర ఉండవచ్చు. ఈ కారు ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, మారుతి సుజుకి XL6, టయోటా రూమియన్ వంటి ఎంపీవీలతో పోటీపడుతుంది. రాబోయే నెలల్లో కియా కొత్త కారెన్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








