హోండా యాక్టివా Vs సుజుకి ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో ఏదీ బెస్ట్‌? ఈ రెండింట్లో ఉన్న ఫీచర్లు ఇవే!

దేశంలో ఎలక్ట్రిక్ టూ- వీలర్స్ వాడకం పెరుగుతోంది. ఫ్యూయల్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈవీలైతే ఖర్చులు కలిసి వస్తాయని అందరూ ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ టూ- వీలర్ సెగ్మెంట్‌లో స్టార్టప్ సంస్థలైన ఓలా, ఏథర్ వంటివి మంచి పేరు సంపాదించాయి. మరోవైపు పెట్రోల్ స్కూటర్ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న హోండా, సుజుకీ సంస్థలు సైతం.. ఈవీల్లోకి అడుగు పెట్టడంతో మార్కెట్ లెక్కలు మారబోతున్నట్లు కనిపిస్తున్నాయి. హోండా సంస్థ తమ యాక్టివా- ఇ స్కూటర్‌తో, సుజుకీ సంస్థ ఇ- యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఈ రెండు స్కూటర్లు కూడా పాపులర్ ఐసీ‌ఈ స్కూటర్లు అయిన యాక్టివా, యాక్సెస్‌కు ఎలక్ట్రిక్ వెర్షన్లుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు స్కూటర్ల మధ్య ఉన్న తేడాలేంటో చూసేద్దాం.

కలర్స్: సుజుకి ఇ- యాక్సెస్ స్కూటర్ మూడు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్స్‌లో వస్తుంది. అవి Metallic Matte Black No. 2 + Metallic Matte Bordeaux Red, Pearl Grey White + Metallic Matte Fibroin Gray, and Pearl Jade Green + Metallic Matte Fibroin Gray.

Honda Activa e Vs Suzuki e Access scooter

మరోవైపు హోండా యాక్టివా ఇ- స్కూటర్... ఐదు మోనో-టోన్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. Pearl Serenity Blue, Pearl Misty White, Matte Foggy Silver Metallic, Pearl Igneous Black, Pearl Shallow Blue అనే ఐదు రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

బ్యాటరీ ప్యాక్, రేంజ్: యాక్టివా- ఇ స్కూటర్‌లో రీమూవెబుల్ బ్యాటరీ ప్యాక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ రెండు బ్యాటరీలతో వస్తుంది. దీంట్లో 1.5 kWh బ్యాటరీ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 102 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఇక సుజుకి ఫిక్స్‌డ్ బ్యాటరీ సెటప్ ఉంటుంది. ఇది 3.07 kWh LFP బ్యాటరీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 95 కి.మీ.ల దూరం ప్రయాణించవచ్చని సుజుకీ సంస్థ చెబుతోంది.

Honda eActiva

రేంజ్ విషయంలో యాక్టివా కాస్త ఎక్కువ అని చెప్పాలి. అయితే.. యాక్టివా ఇ స్కూటర్‌లో హోమ్ ఛార్జింగ్ ఫంక్షన్ అందుబాటులో లేదు. అంటే ఈ ఈవీ బ్యాటరీని.. హోండా సంస్థకు చెందిన e-Swap stationలో మార్చుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. యాక్సెస్ స్కూటర్ ఇంటి వద్ద ఛార్జింగ్ మాత్రమే కాకుండా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుంది.

ఎలక్ట్రిక్ మోటార్: యాక్టివా ఇ- స్కూటర్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ 6 kW పవర్ 22 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 80 kmph. దీంట్లో ఎకో, స్టాండర్డ్, స్పోర్ట్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి. సుజుకి ఇ- యాక్సెస్‌లో 4.1 kW పవర్, 15 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 71 kmph. దీంట్లో మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

Suzuki E Access

ఫీచర్లు: హోండా యాక్టివా ఈ స్కూటర్‌లో ఫీచర్లు అధికంగానే ఉన్నాయని చెప్పాలి. దీంట్లో LED లైట్లు, TFT ఇన్స్ట్రమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, రివర్స్‌మోడ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, స్మార్ట్ కీ ఫీచర్లు ఉన్నాయి. సుజుకి ఇ-యాక్సెస్ TFT స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్- బై- టర్న్ నేవిగేషన్, కాల్, SMS అలర్ట్స్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటాయి. అలాగే స్మార్ట్ కీ, సైడ్ స్టాండ్ అలర్ట్ వంటివి ఉన్నాయి.

ధర ఎంత?: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.17 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. దీంట్లో RoadSync Duo వేరియంట్ ధర రూ.1.52 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్- షో రూమ్ ధరలు మాత్రమే. అదే సమయంలో సుజుకి సంస్థ తమ ఇ- యాక్సెస్ స్కూటర్ ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే.. దీని ధర రూ.1.10 లక్షలుగా ఉంటుందని అంచనా.

కొన్ని నెలలుగా ఇ- స్కూటర్లలో ఓలా సంస్థ ఆధిపత్యం కనిపిస్తుండగా.. దాన్ని అధిగమిస్తూ గత డిసెంబరు నెలలో బజాజ్ సంస్థ తమ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో టాప్‌లో నిలిచింది. ఇక రెండో స్థానాన్ని టీవీఎస్ మోటార్ సంస్థ కైవసం చేసుకోగా.. ఓలా సంస్థ మూడో స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు ఈ హోండా యాక్టివా- ఇ, సుజుకి ఇ- యాక్సెస్‌ రాకతో ఈ లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Sunday, January 26, 2025, 7:20 [IST]
English summary
Honda activa e vs suzuki e access scooter features range powertrain comparison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+