కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. బడ్జెట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే.. దేశంలో బాగా డిమాండ్ ఉన్న కారు ధర భారీగా పెరిగింది
భారత్‌లో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ కార్లను కొనుగోలు చేసే వారితో పోలిస్తే, తక్కువ ధరలో లభించే బడ్జెట్ కార్లు ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. దీంతో ఆటోమొబైల్ తయారీదారులు కూడా ఇలాంటి కార్లను అత్యధికంగా మార్కెట్లోకి విడుదల చేస్తుంటారు. ప్రధానంగా భారత్‌లో మారుతీ సుజుకీ కంపెనీ బడ్జెట్ వినియోగదారుల కోసం కార్లను తీసుకువస్తుంది. దీనికి పోటీగా హోండా(Honda) కూడా బడ్జెట్ ధరలో పలు మోడళ్లను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో హోండా నుంచి అమేజ్ కారు మార్కెట్లోకి వచ్చింది. ఇది అన్ని వర్గాల వారు కొనగలిగే విధంగా అందుబాటు ధరలోనే లభిస్తుంది. ముఖ్యంగా ఇండియాలో కాంపాక్ట్ సెడాన్ విభాగంలో తోపు మోడల్ అయిన మారుతీ సుజుకీ డిజైర్‌కు ఈ హోండా అమేజ్ (Honda Amaze) అతిపెద్ద ప్రత్యర్థిగా ఉంది. ఈ కారుకు దేశంలో మంచి ఆదరణ ఉంది.
బడ్జెట్ ధరలో మోడళ్ల కోసం చూస్తున్న వారికి ఇది సరైన ఆప్షన్. ఇంత డిమాండ్ ఉన్న కారు ధరను కంపెనీ రూ.30,000 వరకు పెంచింది. హోండా అమేజ్‌లో ఇటీవల కొత్త అప్‌డేట్ పెట్కోల్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేశారు. దీని ప్రారంభ బేస్ వేరియంట్ ధర రూ. 8 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ ధర రూ. 10.90 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇది V, VX, ZX అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, బేస్ మోడల్, ఇతర ట్రిమ్‌ల ధర రూ. 10,000 నుండి రూ. 15,000 వరకు పెరిగాయి. అదే టాప్-ఎండ్ ZX మాన్యువల్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ల ధరలు దాదాపు రూ.30,000 వరకు పెరిగాయి. పెరిగిన ఈ ధరల ప్రకారం, హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 8.09 లక్షలుగా ఉంది.
అదే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. జనవరి 31 వరకు పాత ధరలు చెల్లుబాటులో ఉండే విధంగా హోండా ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుంచి పెరిగిన ఈ ధరల ప్రకారం, హోండా కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు అదనంగా మరింత డబ్బులు చెల్లించాల్సి ఉంది. కారు వేరియంట్‌ను బట్టి రూ. 30,000 వరకు ఎక్కువ చెల్లించాలి.

హోండా కొత్త అమేజ్ కారు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ 90 bhp పవర్, 110 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తుంది. డీజిల్ వేరియంట్‌ను నిలిపివేసిన తరువాత అమేజ్ ప్రస్తుతం దేశంలో మంచి డిమాండ్ ఉన్న మోడల్‌గా ఉంది.
అమేజ్ మైలేజ్ పరంగా చూసినట్లయితే మాన్యువల్ గేర్‌బాక్స్‌లో అత్యధికంగా లీటర్ పెట్రోల్‌కు దాదాపు 18.65 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. అదే CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌లలో 19.46 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. కొత్త మోడల్‌ను కొనుగోలు చేసే వారికి 3 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీని హోండా అందిస్తుంది. అలాగే, అదనంగా పొడిగించిన వారంటీతో మరో 7 సంవత్సరాలు పెంచుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








