ఈ హోండా కొత్త కారుపై ఆఫర్ పొడిగింపు… జనవరి 31 వరకు తక్కువ ధరకే.. కొనాలంటే ఇప్పుడే మంచి ఛాన్స్!
భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ నెలకొంది. ఈ సెగ్మెంట్ లో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు అదరగొడుతున్నాయి. ఇప్పుడిక ఈ పోటీలో దిగ్గజ సంస్థ హోండా కూడా తగ్గేదేలే అంటోంది. తమ అమేజ్ కారు మోడల్‌కు సంబంధించి జనరేషన్ ఛేంజ్‌తో ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను గతేడాది డిసెంబరులో తీసుకువచ్చిందీ సంస్థ. దీన్ని వినియోగదారులకు మరింత చేరువచేసి, సేల్స్ పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. ఈ సెడాన్ కారుపై లాంఛింగ్ సందర్భంగా ప్రకటించిన ఇంట్రడక్టరీ ప్రైజ్ ఆఫర్‌ను జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ కారు ధర ఎంత ఉంటుంది? దీంట్లో ఉండే ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.
హోండా సంస్థ ఈ న్యూ జనరేషన్ అమేజ్ కారును డిసెంబరు 4న మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు దీని ప్రారంభ ధర(ఎక్స్- షోరూమ్) రూ.7.99 లక్షలుగా ప్రకటించింది. అయితే.. ఇది పరిచయం సందర్భంగా అందిస్తున్న ధర అని, త్వరలోనే దీని ధరలో మార్పు ఉంటుందని తెలిపింది. కానీ, ఇప్పుడు... ఈ ధరను జనవరి 31 వరకు కొనసాగిస్తామని ప్రకటించింది. దీంతో ఈ వాహనం కొనాలనే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

హోండా అమేజ్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది.. V, VX, ZX అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. Platinum White Pearl, Lunar Silver Metallic, Golden Brown Metallic, Obsidian Blue Pearl, Meteoroid Grey Metallic, Radiant Red Metallic అనే కలర్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది.
దీని డిజైన్ విషయానికి వస్తే.. ఈ కారు లార్జర్ ఫ్రంట్ గ్రిల్ తో ఉంటుంది. ఇది honeycomb ప్యాటర్న్‌తో ఉంటుంది. దీంట్లో రెండువైపులా ఇంటిగ్రేటెడ్ DRLs తో కూడిన స్లీకర్ LED హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. గ్రిల్ పైన కనెక్టెడ్ క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది. అప్‌డేటెడ్ క్లామ్‌షెల్ బానెట్ ప్రీమియం టచ్‌తో ఉంటుంది.

ఈ ఫోర్త్ జనరేషన్ సెడాన్‌ను ఫీచర్ - రిచ్ కేబిన్‌తో హోండా సంస్థ తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 7- అంగుళాల TFT డ్రైవర్ డిస్‌ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ USB ఛార్జింగ్ పోర్ట్స్, 6 స్పీకర్లతో ఆడియో సిస్టం ఉంటుంది. 416 లీటర్ల బూట్ స్పేస్‌తో ఈ కారు ఉంటుంది.
ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే ఇది 6 ఎయిర్ బ్యాగులతో అన్నీ స్టాండర్డ్ వేరియంట్లలో ఉంటుంది. అంతేగాకుండా దీంట్లో లెవెల్ 2 ADAS సూట్, లేన్ వాచ్ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్, మల్టీ- యాంగిల్ రియర్ పార్కింగ్ కెెమెరా, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

ఈ కారు 1.2 లీటర్ 4- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 5- స్పీడ్ మ్యాన్యువల్/7- స్టెప్ CVT(paddle shifters)తో అనుసంధానించి ఉంటుంది. దీంట్లోని ఇంజిన్ 89 bhp పవర్ 110 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మ్యాన్యూవల్ వెర్షన్‌లో 18.65 kmpl మైలేజీ అందిస్తుంది. CVT వెర్షన్‌లో 19.46 kmpl మైలేజీ అందిస్తుంది. దీంట్లో డీలర్‌షిప్ లెవెల్లో CNG kit కూడా ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








