ఇంకేం కావాలి భయ్యా..ఆ కారు కొంటే 10ఏళ్లు టెన్షన్ పడాల్సిన పనిలేదు..డిజైర్ కు గట్టి పోటీ

సబ్-4 మీటర్ల సెడాన్ సెగ్మెంట్‌లో ఎప్పుడూ మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) హవానే ఉంటుంది. అయితే ఆ డిజైర్‌కు గట్టి పోటీ ఇచ్చే మోడల్‌గా హోండా అమేజ్ (Honda Amaze) పేరు తెచ్చుకుంది. పాత రోజుల్లో ఉన్నంత జోరు లేకపోయినా, ఇటీవల కొత్త జనరేషన్‌గా (న్యూజెన్) మార్కెట్‌లోకి వచ్చిన అమేజ్‌ను కొనుగోలుదారులు బాగా ఆదరిస్తున్నారు. ప్రముఖ మోడల్ సిటీ అమ్మకాలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో హోండా కంపెనీకి అమేజ్ అమ్మకాలు ఒక పెద్ద ఊరటగా నిలిచాయి.

హోండా అమేజ్ అమ్మకాలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. గత నెల అంటే 2025 అక్టోబర్‌లో అమేజ్ ఏకంగా 3,630 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది (2024) అక్టోబర్‌లో అమ్ముడైన 2,393 యూనిట్లతో పోలిస్తే, ఇది ఏకంగా 52 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.

Honda Amaze Sales Soar 52 10-Year Warranty and ADAS Drive Compact Sedan Demand

దేశంలోనే అతి తక్కువ ధరలో ADAS ఫీచర్లతో వస్తున్న కారు ఇదే కావడం, అలాగే పండుగ సీజన్ డిమాండ్, జీఎస్టీ కారణంగా ధరలు తగ్గడం అమ్మకాలు పెరగడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. జీఎస్టీ సవరణల వల్ల ఈ సెడాన్‌పై ఏకంగా రూ. 1.20 లక్షల వరకు ధర తగ్గింపు లభించింది.

కొత్త హోండా అమేజ్ మూడు వేరియంట్లలో (V, VX, ZX) అందుబాటులో ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధరలు రూ. 7.49 లక్షల నుంచి రూ. 10.00 లక్షల వరకు ఉన్నాయి. డిజైన్ పరంగా కొత్త అమేజ్.. ఎలివేట్ మోడల్‌ను పోలి ఉంటుంది. పెద్ద గ్రిల్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

Honda Amaze Sales Soar 52 10-Year Warranty and ADAS Drive Compact Sedan Demand

సైడ్ వ్యూలో పాత మోడల్ రూపాన్ని కొనసాగించినా, 15 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కొత్త లుక్‌ను ఇచ్చాయి. వెనుక భాగంలో వింగ్ ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ టైల్‌లైట్స్ కారుకు మరింత ప్రీమియం ఫీల్‌ను ఇస్తున్నాయి.

హోండా అమేజ్‌ను మంచి ఫ్యామిలీ కారుగా మార్చేది దాని ఇంటీరియర్, కంఫర్ట్. ఇది పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7 అంగుళాల టీఎఫ్‌టీ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో నిండి ఉంది.

Honda Amaze Sales Soar 52 10-Year Warranty and ADAS Drive Compact Sedan Demand

లెవెల్ 2 ADAS ఫీచర్ సేఫ్టీ విషయంలో గొప్ప ప్లస్ పాయింట్. అంతేకాకుండా 416 లీటర్ల బూట్ స్పేస్ లభించడం వలన లాంగ్ జర్నీలలో లగేజ్ పెట్టుకోవడానికి కూడా సరిపోతుంది. ఈ కారులో 1.2 లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 90 బీహెచ్‌పి పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ప్యాడెల్ షిఫ్టర్‌లతో కూడిన సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మైలేజ్ పరంగా అమేజ్ చాలా అద్భుతంగా ఉంది.పెట్రోల్ మాన్యువల్ లీటరుకు 18.65 కి.మీ, సీవీటీ ఆటోమేటిక్ లీటరుకు 19.46 కి.మీ ఇస్తుంది. హోండా అమేజ్‌తో 3 సంవత్సరాల అన్ లిమిటెడ్ కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీని అందిస్తోంది. అదనంగా ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీని ఎంచుకుంటే ఏకంగా 7 సంవత్సరాల వరకు వారంటీ పొందవచ్చు. ముఖ్యంగా హోండా ఈ కొత్త మోడల్‌తో పాటు 10 సంవత్సరాల వరకు ఎప్పుడైనా వారంటీని, రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 20, 2025, 7:13 [IST]
English summary
Honda amaze sales soar 52 10 year warranty and adas drive compact sedan demand
Read more on: #honda #honda city #car sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+