కారు కొనాలా? ఒక్క నంబర్ మారిందంటే చాలు.. మీ ఛాన్స్ మిస్! వెంటనే షోరూమ్‌కు వెళ్లండి!

కొత్త సంవత్సరం మొదలవుతున్న వేళ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) వినియోగదారులకు ఒక షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. జపాన్‌కు చెందిన ఈ ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్, జనవరి 2026 నుంచి తన కార్ల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2025 చివరలో ఒక్కనంబర్ మారి 6 చేరిందటే ఇప్పుడు ఎక్కువ ధరతో కారు కొనాల్సి వస్తుంది. దీంతో కొత్తగా హోండా కారు కొనాలని భావిస్తున్న వారికి ఈ ప్రకటన కీలకంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం మీద ఒక స్పష్టమైన ట్రెండ్ కొనసాగుతోంది. ముడిసరుకు ధరలు, లాజిస్టిక్స్, రవాణా ఖర్చులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాహన తయారీదారులు కాలానుగుణంగా తమ వాహనాల ధరలను సవరించుకోవాల్సి వస్తోంది. హోండా కూడా ఈ పరిస్థితి నుంచి మినహాయింపు కాదు.

అయితే, గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల భారం పూర్తిగా వినియోగదారులపై పడకుండా చూసేందుకు హోండా ఎంతవరకూ సాధ్యమో అంతవరకూ ప్రయత్నించినట్లు కంపెనీ తెలిపింది. అయినా కూడా, ప్రస్తుతం ఇన్‌పుట్ ఖర్చుల్లో గణనీయమైన పెరుగుదల జరగడం హోండాను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. ముఖ్యంగా షీట్ మెటల్ ధరలు, ఎలక్ట్రానిక్ భాగాల ఖర్చులు, ప్లాస్టిక్ ముడిసరుకు ధరలు భారంగా మారాయి.

Honda Announces Car Price Hike Effective January 2026 Details

అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే, రూపాయి విలువ పడిపోవడంతో రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు భారీగా పెరగడం కంపెనీపై ఒత్తిడి తెచ్చాయి. ఈ పెరిగిన ఖర్చులను పూర్తిగా తానే భరించడం కష్టంగా మారడంతో, చివరికి కార్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని హోండా స్పష్టం చేసింది. మొత్తంగా, జనవరి 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ ధరల పెంపు నిర్ణయం, హోండా కార్లు కొనాలనుకునే వినియోగదారులకు ఒక ముఖ్యమైన అప్డేట్‌గా మారింది.

కొత్త సంవత్సరం ముందు లేదా ఈ ఏడాది చివర్లో కారు కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. హోండా ప్రకటించిన ధరల పెంపు జనవరి 2026 నుంచి కొత్త మోడల్ ఇయర్ ప్రారంభమయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఆ తేదీ నుంచి తయారయ్యే లేదా కొత్త మోడల్ సంవత్సరం కింద మార్కెట్‌లోకి వచ్చే కార్ల ధరలు పెరిగిన రేట్లతో అందుబాటులోకి వస్తాయి. ఇది పరిశ్రమలో సాధారణంగా పాటించే విధానమే.

Honda Announces Car Price Hike Effective January 2026 Details

వాహనాల ధరలు సాధారణంగా వార్షిక ఉత్పత్తి ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ కారణంగా, కొత్త మోడల్ సంవత్సరానికి చెందిన కార్ల ధరలు, ప్రస్తుతం డీలర్ షోరూమ్‌లలో స్టాక్‌గా ఉన్న వాహనాల ధరలు భిన్నంగా ఉంటాయి. అదే మోడల్ అయినప్పటికీ, తయారీ తేదీ, మోడల్ ఇయర్ ఆధారంగా ధరల్లో తేడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో, జనవరి 2026కు ముందు తయారు చేయబడిన హోండా వాహనాలు స్టాక్ పూర్తయ్యే వరకు పాత ధరకే విక్రయించబడతాయి.

ధరల పెంపు అమల్లోకి వచ్చే ముందు కారు కొనాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి అవకాశం కావచ్చు. మొత్తంగా చూస్తే, కొత్త మోడల్ ఇయర్ వాహనాలకు మాత్రమే పెరిగిన ధరలు వర్తిస్తాయని, ఇప్పటికే తయారైన స్టాక్‌పై మాత్రం ప్రస్తుత ధరలే కొనసాగుతాయని హోండా స్పష్టంగా తెలియజేసింది. కస్టమర్ కారు కొనుగోలు చేయడానికి షోరూమ్‌కు వచ్చిన సమయంలో, డీలర్లు ధరల వ్యత్యాసం, అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి స్పష్టంగా వివరించటం జరుగుతుంది.

Honda Announces Car Price Hike Effective January 2026 Details

కొత్త మోడల్ ఇయర్ వాహనాల ధరలు, స్టాక్‌లో ఉన్న పాత మోడల్ ఇయర్ కార్ల ధరల మధ్య ఉండే తేడాను కస్టమర్లకు తెలియజేసి, వారి అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా సరైన ఎంపిక చేసుకునేలా మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేకంగా నిర్దిష్ట కాలంలోనే వాహనం కొనాలనుకునే వారు లేదా బడ్జెట్‌ను గట్టిగా పరిశీలిస్తున్న కస్టమర్లకు ఈ ధర వ్యత్యాసం చాలా బెస్ట్. దీంతో అదే కారును తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, December 26, 2025, 15:02 [IST]
English summary
Honda announces car price hike effective january 2026 details
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+