కస్టమర్లు రాకపోయేసరికి దోమలు కొట్టుకుంటున్న డీలర్లు.. సగానికి పైగా పడిపోయిన కంపెనీ సేల్స్

ఒకప్పుడు భారతీయ మార్కెట్లో ఎంతో వెలుగొందిన హోండా కార్స్ ఇండియా, ఇప్పుడు తన స్థానాన్ని పునరుద్ధరించుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. జపాన్‌లో ప్రధాన కార్యాలయం కలిగి, ఏళ్ల తరబడి భారత్‌లో కార్లను అందించిన ఈ కంపెనీ అమ్మకాల పరంగా క్రమంగా వెనుకబడుతోంది. అసలు ఈ పరిస్థితిని హైలైట్ చేస్తూ హోండా ఇటీవల జూన్ నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలను బయటపెట్టింది. గత సంవత్సరం ఇదే జూన్‌లో కంపెనీ 9,776 కార్లను విక్రయించింది. కానీ ఈ సంవత్సరం జూన్‌లో అమ్మకాల సంఖ్య గణనీయంగా తగ్గి కేవలం 5,124 యూనిట్లకే పరిమితమైంది. అంటే, కేవలం ఒక ఏడాది వ్యవధిలో సగానికి పైగా విక్రయాలు తగ్గిపోయాయి. ఇది కేవలం ఒక్క నెలకు పరిమితం కాని సమస్య కాదనే విషయం కూడా తెలుస్తుంది.

ఎందుకంటే హోండా కార్ల అమ్మకాలు నెల నెలా క్రమంగా తగ్గుతున్న వాస్తవాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నో కొత్త బ్రాండ్లు, సరికొత్త SUVలు, మెరుగైన ఫీచర్లతో కూడిన కాంపిటేటర్ల కారణంగా హోండాకు మార్కెట్లో పోటీ పెరిగింది. తక్కువ అమ్మకాల వలన, భవిష్యత్తు వ్యూహాలను కొత్తగా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. మరి, సొల్యూషన్‌గా హోండా కొత్త మోడళ్లను తెస్తుందా? లేక నమకాన్ని తిరిగి గెలుచుకునే విధంగా మరేదైనా చేస్తుందా అని చూడాలి.

Honda Cars India June 2025 Sales 5124 Recorded

2024 జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో హోండా మొత్తం అమ్మకాలు దాదాపు 47.6 శాతం తగ్గాయి. అయితే ఈ మొత్తం సంఖ్యలో దేశీయ విక్రయాలు, ఎగుమతులు రెండూ ఉన్నాయి. వివరంగా చెప్పాలంటే, జూన్ 2025లో భారతదేశంలో హోండా విక్రయించిన కార్ల సంఖ్య 4,618 యూనిట్లు. అంటే, దేశీయంగా మాత్రమే తీసుకుంటే ఈ గణాంకం చాలా పెద్ద తగ్గుదలను చూపించడంలేదు. 2024 జూన్‌లో కంపెనీ దేశీయంగా 4,804 కార్లను అమ్మింది.

ఈ రెండు గణాంకాలను పోలిస్తే దేశీయ అమ్మకాల్లో కేవలం 3.87 శాతం తగ్గుదల మాత్రమే నమోదైంది. అంతేకాక, మే 2025లో దేశీయ మార్కెట్లో హోండా కేవలం 3,950 కార్లను మాత్రమే విక్రయించింది. అంటే మే నుంచి జూన్‌కి వచ్చే సరికి 668 యూనిట్ల వృద్ధి కనిపించింది. వృద్ధి చిన్నదే అయినా, మే నెల వర్షాకాల ప్రారంభం, వినియోగదారుల కొనుగోలు ఆలోచనల్లో మార్పులు వంటి కారణాలతో కొంత సానుకూల సంకేతంగా భావించవచ్చు.

Honda Cars India Sales

అయితే అసలు పెద్ద దెబ్బ ఎక్కడ తగిలిందంటే, హోండా ఎగుమతుల విభాగంలోనే. గత ఏడాది జూన్‌లో హోండా భారతదేశంలో తయారు చేసిన 4,972 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. కానీ ఈ ఏడాది జూన్‌లో ఆ సంఖ్య ఒక్కసారిగా కూలిపోయి కేవలం 506 యూనిట్లకే పరిమితమయ్యింది. అంటే దాదాపు 90 శాత తగ్గుదల జరిగింది. ఇది కంపెనీ మొత్తం అమ్మకాలలో భారీ పతనానికి ప్రధాన కారణం.

మొత్తంగా చూసుకుంటే ఏడాది వ్యవధిలో కంపెనీ అమ్మకాలు గణనీయంగా తగ్గినా, నెలవారీ లెక్కలో జూన్‌లో కొంత ఊరట కనిపించింది. కానీ ఈ చిన్న వృద్ధి మాత్రమే సమస్యలకు పూర్తి పరిష్కారం కాదని స్పష్టంగా తెలిసిపోతోంది. మార్కెట్లో గట్టి పోటీ, కొత్త మోడళ్ల కొరత, కస్టమర్ల ఆభిరుచులలో మార్పులు.. ఈ అన్ని అంశాలు హోండా భవిష్యత్తులో మరింత బలమైన వ్యూహాలు తీసుకురావాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

Honda Cars Sales Report

ప్రస్తుతం హోండా కార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో కేవలం మూడు మోడళ్లను మాత్రమే ఎలివేట్, అమేజ్, సిటీలను విక్రయిస్తోంది. ఒకప్పుడు అద్భుతమైన మోడల్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న హోండా, ఇప్పుడు అతి కొద్దిమాత్రమే కార్లను ఆఫర్ చేయడం, దేశీయ అమ్మకాల తగ్గుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త వేరియంట్ల లేకపోవడం, SUV విభాగంలో కాంపిటేషన్ అధికంగా పెరగడం, వినియోగదారుల ఆభిరుచుల్లో మార్పులు హోండాకు ప్రతికూలంగా పనిచేశాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 4, 2025, 17:33 [IST]
English summary
Honda cars india june 2025 sales 5124 recorded check all details here
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+