Honda City Apex Edition అందంగా ముస్తాబై వచ్చిన ఫేమస్ సెడాన్.. తళుక్కుమనే లుక్స్‌తో.. చమక్కుమనే స్టైల్‌లో!
టూ-వీలర్ రంగంలో వినియోగదారులను బాగా ఆకట్టుకున్న దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హోండా.. ఫోర్ వీలర్ రంగంలోనూ తమ సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుని సాగుతోంది. హోండా ప్రస్తుతం సిటీ, అమేజ్, ఎలివేట్ అనే మూడు కారు మోడళ్లను భారత్ లో విక్రయిస్తోంది. అయితే.. ఈ కార్లు అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేకపోతున్నాయి. దీంతో తమ కార్ల సేల్స్ పెంచుకోవడం కోసం హోండా సంస్థ వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా... తమ పాపులర్ మిడ్ సైజ్ సెడాన్ సిటీ మోడల్‌కు సంబంధించి అపెక్స్ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఈ కారులో ఉండే ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
హోండా సిటీ కారు భారత్‌లో బాగా పాపులర్ అయిన సెడాన్ కారుల్లో ఒకటని చెప్పవచ్చు. దశాబ్దాలుగా వినియోగదారులను ఈ సిటీ మోడల్ ఆకట్టుకుంటూ వస్తోంది. ఇప్పుడు.. దీంట్లో అపెక్స్ ఎడిషన్ తాజాగా ఈ సంస్థ మార్కెట్లో లాంఛ్ చేసింది. ప్రీమియం ప్యాకేజ్‌తో దీన్ని తీసుకువచ్చినట్లు హోండా సంస్థ చెబుతోంది.

ఈ ప్రత్యేక ఎడిషన్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లు గానీ, మెకానికల్ మార్పులు గానీ కనిపించడం లేదు. అయితే.. ఈ కారును కొన్ని కాస్మెటిక్ చేంజేస్ చేసి, దీని స్టాండర్డ్ మోడల్ కంటే కొన్ని హంగులు జోడించి తీసుకువచ్చారు. హోండా సిటీ... V, VX and ZX అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ అపెక్స్ ఎడిషన్‌ను V, VX ట్రిమ్ లెవెల్స్ ఆధారంగా హోండా సంస్థ తయారు చేశారు.
హోండా సిటీ V MT Apex ఎడిషన్ కాదు ధర రూ.13,30,000 గా ఉంది. ఈ వేరియంట్‌లో CVT గేర్ బాక్స్ మోడల్ ధర రూ.14,55,000 గా ఉంది. ఇక దీంట్లో VT మ్యాన్యువల్ ధర రూ.14,37,000 వద్ద ఉంది. అదే సమయంలో.. VX CVT వేరియంట్ ధర రూ. 15,62,000గా ఉంది.

ఈ అపెక్స్ ఎడిషన్.. స్టాండర్డ్ వెర్షన్ కంటే రూ.25,000 అధికంగా ఉంది. స్టాండర్డ్ V, VX trims కంటే.. ఈ అపెక్స్ ఎడిషన్‌లో ఉన్న ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. ఈ కొత్త మోడల్ లో కొన్నింటిని అప్ గ్రేడ్ చేసి తీసుకువచ్చారు. ఈ అపెక్స్ ఎడిషన్‌లో లగ్జరీయస్ beige ఇంటీరియర్స్, ప్రీమియం లెదరెట్ ఇన్స్టుమెంట్ ప్యానెల్, లెదరెట్ కన్సోల్ గార్నిష్, ప్రీమియం లెదరెట్ డోర్ ప్యాడింగ్ వంటివి ఉంటాయి.
ఈ ప్రీమియం ఫీచర్లతో పాటు... ఈ అపెక్స్ ఎడిషన్ కారులో ఇన్సుట్రుమెంట్ ప్యానెల్, డోర్ పాకెట్స్ పైన రిథమిక్ యాంబియెంట్ లైట్ సిస్టం ఉంటుంది. ఈ కారు 7 రంగుల్లో అందుబాటులో ఉంది. అంతేగాకుండా దీంట్లో ఎక్స్‌క్లూజివ్ సీట్ కవర్స్, కుషన్స్ ఉన్నాయి. దీంట్లోని ఫెండర్స్, ట్రంక్ కూడా దీనికి ప్రధానాకర్షణగా కనిపిస్తున్నాయి.

ఈ సిటీ కారు... 1.5- లీటర్ ఫోర్- సిలిండర్ VTEC పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 121 PS గరిష్ఠ పవర్, 145 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 8- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, సన్ రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, రెయిన్- సెన్సింగ్ వైపర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి సదుపాయాలు వంటివి ఉంటాయి.
ఈ కారు 6 ఎయిర్ బ్యాగులతో వస్తుంది. దీంట్లో ABS, EBD, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్స్, చిన్నపిల్లల సీట్ల కోసం ISOFIX మౌంట్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం(TPMS), ADAS కూడా ఉంటాయి.
హ్యూందాయ్ వెర్నా, మారుతీ సుజుకీ సియాజ్, ఫోక్స్ వేగన్ వర్టీస్, స్కోడా స్లేలియ వంటి కార్లు ఈ హోండా సిటీకీ పోటీగా ఉన్నాయి. కాస్మెటిక్ ఛేంజెస్‌తో తీసుకువచ్చిన ఈ అపెక్స్ ఎడిషన్ వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. దీంట్లో మేజర్ ఛేంజెస్ పెద్దగా లేకపోయినప్పటికీ... ఇది ఓ గేమ్-చేంజర్ లా నిలిచే అవకాశం ఉంది. అయితే.. దీంట్లో లిమిటెడ్ ఎడిషన్ కారు కూడా... యునిక్ స్టైలింగ్‌ను ఇష్టపడేవారిని కచ్చితంగా ఆకట్టుకోనుంది.


Click it and Unblock the Notifications








