ఆ కంపెనీ కార్లపై భారీ ఆఫర్లు.. ఇప్పుడు కొంటే మీరు నక్కతోక తొక్కినట్లే!
హోండా కార్లు మార్కెట్‌లో మరితం గ్రిప్ పెంచుకోవడం కోసం సిటీ, అమేజ్ ఎలివేట్ SUVలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ప్రోత్సాహకాలు నగదు డిస్కౌంట్లు, బైబ్యాక్ ఆప్షన్లు, ఎక్స్‌ఛేంజ్, కార్పొరేట్ బెనిఫిట్స్‌తో పాటు ఏడేళ్ల వరకు పొడగించిన వారంటీలను పొందవచ్చు. ఈ ఆఫర్లు 2024, 2025 మోడళ్లకు వర్తిస్తాయని అలాగే డీలర్‌షిప్‌లలో స్టాక్ ఉన్నంత వరకే ఇవి అందుబాటులో ఉంటాయని హోండా తెలిపింది. ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలు సిటీలను బట్టి మారుతాయని కంపెనీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఆఫర్ల వివరాలు ఈ కథనంలో మీకోసం..
కస్టమర్లను పెంచుకోవడానికి అలాగే సేల్స్‌లో ఈ కార్లను గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా ఆఫర్లను ప్రకటించినట్లు తెలుస్తోంది. హోండా అందిస్తున్న ఈ ఆఫర్లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే కస్టమర్లను ఖచ్చితమైన వివరాల కోసం స్థానిక డీలర్లను సంప్రదించాలని కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ కార్లు కొనాలనుకునే వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.

ఎక్స్‌టెండెట్ వారంటీ ఆప్షన్‌లతో కలిపి మొత్తం రూ. 68,300 వరకు డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండాహోండా సిటీ e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ఇతర బెనిఫిట్స్‌తో కలిపి రూ. 90,000 వరకు క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ చర్య ద్వారా హోండా తన కస్టమర్ల వ్యాల్యూ చేస్తుందని భావిస్తున్నారు. ఆకర్షణీయమైన ధరల వద్ద ప్రీమియం ఫీచర్‌లను పొందే కార్ల కోసం చూస్తుంటే ఇవి సరిపోతాయి.
ఈ హోండా అమేజ్ దాని రెండవ తరం లైనప్‌లలో E, S వేరియంట్‌లపై ఆఫర్లు ప్రకటించాయి. అలాగే అమేజ్ VX వేరియంట్ కొనుగోలుపై రూ. 40,000 డిస్కౌంట్స్ కలిపి రూ. 1.07 లక్షల వరకు ఆఫర్‌లతో ఆకర్షిస్తోంది. S వేరియంట్ కోసం రూ. 20,000 డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నందున CNG కిట్‌తో అమేజ్‌తో ఇది లభిస్తుంది.

ఇక హోండా ఎలివేట్ SUV డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మిడ్-సైజ్ SUVపై కంపెనీ మంచి తగ్గింపుని అందిస్తోంది, 2024 ZX మాన్యువల్ వేరియంట్ రూ. 86,100 వరకు తగ్గింపుతో.. ఇతర మాన్యువల్ వేరియంట్‌లు SV, V మరియు VXలపై రూ. 76,100 వరకు డిస్కౌంట్స్ అందించనున్నారు. ఇక 2025 మోడల్ సంవత్సరానికి సంబంధించి ZX మాన్యువల్‌పై రూ. 66,100 వరకు తగ్గింపును పొందవచ్చు.
అలాగే SV, V, VX మాన్యువల్ ట్రిమ్‌లపై రూ. 56,100 వరకు తగ్గింపును పొందవచ్చు. అదనంగా, ఎలివేట్ యొక్క 2024 ఎపెక్స్ ఎడిషన్ మాన్యువల్ వేరియంట్‌లు రూ. 65,000 ఆఫర్‌తో వస్తాయి. అలాగే 2025 మోడల్ రూ. 45,000 తగ్గింపు ఉంది. ఎలివేట్ యొక్క CVT ఆటోమేటిక్ వేరియంట్‌లకు కూడా అందించారు.

సిటీ, అమేజ్, ఎలివేట్ మోడళ్లపై తాజా తగ్గింపు ఆఫర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది కలిసి వస్తుంది. నగదు తగ్గింపులు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు, పొడగించిన వారంటీలు వంటి ప్రయోజనాలతో ఈ ఆఫర్లు కస్టమర్ సంతృప్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతే కాకుండా అమ్మకాలను పెంచడానికి ఇవి రూపొందించబడ్డాయి. ఈ ప్రమోషన్‌లను ఉపయోగించుకోవాలని ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు తమ సమీపంలోని హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించి వివరాల తెలుసుకోవాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








