ఒకప్పుడు ఈ కారు కోసం ఎగబడేవారు.. కానీ ఇప్పుడు కేవలం 406 మంది మాత్రమే కొన్నారు.. ఎందుకు ఈ పరిస్థితి?

ఒకప్పుడు భారతీయ కారుప్రియులకు సెడాన్ అంటే ఓ స్టేటస్ సింబల్, సౌకర్యం, క్లాస్ అన్నీ కలబోతగా అనిపించేది. హోండా సిటీ, మారుతీ సియాజ్, హ్యుందాయ్ వెర్నా లాంటి మోడళ్లు ఒక్కసారి రోడ్డు మీద కనిపిస్తే, తల తిరిగి చూసేంతగా ఆకర్షించేవి. ఈ కార్లు సాఫీగా సాగిపోయే రైడ్ అనుభవం, ఇంటీరియర్ ప్రీమియం లుక్‌తో అందరిని కట్టిపడేసేవి. అయితే ఇప్పుడు కాలం మారింది. SUVలు బలంగా ఎంట్రీ ఇచ్చాయి. బలమైన పనితీరు, క్కువ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాల కారణంగా ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుంది. ఇదే సమయంలో సెడాన్లకు తగ్గుతుంది. తాజాగా హోండా సిటీ సెడాన్ అమ్మకాలు కూడా దీనిని రుజువు చేస్తున్నాయి. ఇటీవల కంపెనీ నుంచి వచ్చిన అమ్మకాల నివేదిక ప్రకారం, హోండా సిటీ ఏప్రిల్ 2025 లో గతంలో కంటే సగానికి పైగా తక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

మారుతున్న వినియోదారుల అభిరుచుల కారణంగా చాలా మంది ఎస్‌యూవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండంటంతో హోండా సిటీ సేల్స్ ఏప్రిల్ నెలలో తగ్గినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 2025లో మొత్తం కేవలం 406 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. గతేడాది అదే నెలలో 824 యూనిట్లు అమ్ముడైన నేపథ్యంలో చూస్తే, ఇది 50.73 శాతం తగ్గుదలగా చెప్పవచ్చు. ఈ క్షీణతకు వెనుక ఉన్న కారణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Honda City Sedan April 2025 Sales

ఒకప్పుడు "సెడాన్ అంటే హోండా సిటీ" అనే స్థాయిలో భారతీయుల మనసుల్లో చోటు సంపాదించిన కారు, ఇప్పుడు మార్కెట్లో నిలవడం కష్టంగా మారుతోంది. హోండా సిటీ ఎంతగానో అభిమానించబడిన మోడల్ అయినప్పటికీ, తాజా అమ్మకాల గణాంకాలు చూస్తే అభిమానం కాస్త తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఏకంగా అమ్మకాలు 50 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. దీన్ని బట్టి ప్రజాధారణ పొందిన కారు ఇప్పుడు కష్టాల్లో ఉంది.

గతంలో ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే, కాలుష్య నియంత్రణ నిబంధనల నేపథ్యంలో, హోండా తమ డీజిల్ వేరియంట్‌ను మార్కెట్లో నుండి తొలగించాల్సి వచ్చింది. ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో కంపెనీ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, దాని ధర కాస్త ఎక్కువగా ఉండటంతో సామాన్య మధ్యతరగతి వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేయడానికి వెనకడుగు వేశారు.

Honda City Sedan April 2025 Sales 50 73 Percent Down

పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమేఎంపికగా తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో, మైలేజ్, డైలీ యూజ్‌ వంటి అంశాల ఆధారంగా వినియోగదారులకి ఇది సరైన ఆప్షన్‌గా కనిపించలేదు. పైగా SUVల ధాటికి, సెడాన్ కేటగిరీ కాస్త వెనుకబడింది. అయినప్పటికి, హోండా సిటీ తన సెగ్మెంట్ డిమాండ్‌ను తిరిగి నిలబెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రస్తుతం హోండా సిటీ SV, V, VX, టాప్-ఎండ్ ZX ఎలిగెంట్ ఎడిషన్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

ఈ మోడల్ ప్రారంభ ధర రూ.12.42 లక్షల నుండి రూ.16.69 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఈ సెడాన్‌ మోడల్‌ 1.5 లీటర్, నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది అత్యధికంగా 121 bhp పవర్, 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, రోజువారీ డ్రైవింగ్‌కు సరిపడే బలమైన పనితీరును అందిస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికల విషయానికి వస్తే, సిటీ వినియోగదారులకు రెండు ఆప్షన్లలో లభిస్తుంది.

Honda City Sedan April 2025 Sales

6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, స్మూత్‌గా ఫంక్షన్ అయ్యే CVT ఆటోమేటిక్ ఉన్నాయి. ముఖ్యంగా, CVT గేర్‌బాక్స్‌ గల వేరియంట్ 18.4 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్‌ లీటరుకు 26.5 కి.మీల వరకు ఇస్తుంది. నగర ప్రయాణాలకు ఇది ఎంత ఆర్థికంగా ఉంటుంది. కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి డజన్ల కొద్ది ఆప్షన్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 28, 2025, 7:30 [IST]
English summary
Honda city sedan april 2025 sales 50 73 percent down compared to previous
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+