ఈ కారుతో రోడ్లపైకి వెళ్తే దిష్టి తీయించుకోండి! కొత్త స్పోర్ట్ అవతారంలో హోండా సిటీ అదిరిపోతుంది

హోండా (Honda) సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీకి తాజాగా ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది. కంపెనీ వినియోగదారులను ఆకట్టుకోవడానికి "సిటీ స్పోర్ట్ ఎడిషన్ (city Sport Edition)"ను తీసుకొచ్చింది. ఇది కేవలం మరో ఎడిషన్ మాత్రమే కాదు, హోండా క్లాసిక్ డిజైన్‌కి స్పోర్టీ యాటిట్యూడ్‌ జోడించిన వినూత్న ప్రయత్నం. ఈ కొత్త స్పోర్ట్ ఎడిషన్ కార్ ఎక్స్‌టీరియర్ నలుపు రంగు యాసలతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. గ్రిల్, బంపర్, సైడ్ మిరర్లు వంటి అంశాలపై గ్లోస్సీ బ్లాక్ టచ్ స్పోర్టీగా కనిపిస్తాయి. నైపుణ్యాన్ని చాటుతాయి. అంతే కాక, లోపలికి వెళితే, ఎరుపు రంగు హైలైట్‌లతో కూడిన ఇంటీరియర్ డిజైన్ ఈ కారుని ప్రీమియంగా, స్పోర్టీగా మార్చేస్తుంది. ఇది నేటి యువతకు నచ్చేలా కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.

హోండా ప్రకటించినట్టు, సిటీ స్పోర్ట్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది భారత మార్కెట్‌లో మూడు ప్రత్యేకమైన కలర్స్ రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్ లలో స్పోర్టీ లుక్‌కు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఇంకా ప్రత్యేకంగా, ఈ ఎడిషన్‌ను కేవలం CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లో మాత్రమే అందించనున్నారు. మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో స్పోర్టీ వాహనాలకు ఇది సింబాలిక్‌గా నిలవనుంది.

Honda City Sport Edition

ఇది ప్రీమియమ్ లుక్, స్మూత్ పెర్ఫార్మెన్స్, పరిమిత ఎడిషన్ స్పెషల్ అట్రాక్షన్‌లతో మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించేందుకు సిద్ధంగా ఉంది. హోండా తన క్లాసిక్ మిడ్-సైజ్ సెడాన్‌ను మరింత స్టైలిష్‌గా, స్పోర్టీగా పరిచయం చేస్తూ కొత్త హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్‌ను మరింత వైభవంగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఎడిషన్ దేశవ్యాప్తంగా ఎక్స్-షోరూమ్ ధర రూ.14,88,900కు అందుబాటులోకి వచ్చింది. పనితీరు మెరుగ్గా ఉంటుందని కంపెనీ పేర్కొంటుంది.

ఈ కారులో హోండా 1.5 లీటర్ల i-VTEC పెట్రోల్ ఇంజిన్‌ని ఉపయోగించారు. ఇది ఇప్పటికే E20 ఇంధనానికి అనుకూలంగా రూపుదిద్దబడింది, అంటే భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇది గరిష్టంగా 121PS పవర్‌ను, 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కలిపి, ప్యాడిల్ షిఫ్టర్స్ సాయంతో మరింత నియంత్రణను డ్రైవర్‌కు అందిస్తుంది.

City Sport Edition Car Launched In India

దీని ద్వారా కారు ఓ స్మూత్, డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, 18.4 km/l వరకు అందించగలదు. కారు లుక్స్, ఇంజిన్ పనితీరుతో పాటు భద్రతా ప్రమాణాల్లోను ముందంజలో ఉంది. ఈ కారు హెండా సెన్సింగ్ (ADAS) అనే ఆధునిక భద్రతా వ్యవస్థతో వస్తోంది. ఇందులో లేన్ కీప్ అసిస్టు, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లీడర్ కార్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇవన్నీ కలిపి, రైడర్‌కు అధిక భద్రతతో పాటు సాంకేతికంగా సహజమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. కొత్త హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ లోపలికి అడుగుపెడితే, సాధారణ కార్ల ఇంటీరియర్ అనిపించదు, అదొక ప్రత్యేక అనుభూతిని, స్పోర్ట్స్ కార్-లెవల్ క్యాబిన్ స్టైల్‌ను అందిస్తుంది. ప్రీమియం లెదర్‌తో అలంకరించబడిన ఇంటీరియర్, నలుపు రంగు థీమ్‌తో డిజైన్ చేయబడి, ప్రతి భాగం స్పోర్టీ శైలిని ప్రతిబింబిస్తుంది.

Honda City Sport Edition Design

బ్లాక్ సీట్లు, వాటిపై ఉన్న ఎరుపు రంగు స్టిచింగ్, అలాగే ప్లష్ సాఫ్ట్ డోర్ ఇన్సర్ట్‌లు మరింత ఆకర్షణీయంగా, మృదువుగా అనిపించేలా రూపొందించాయి. అంతేకాదు, స్టీరింగ్ వీల్ డిజైన్ స్పోర్టీ లుక్‌ను కలిగి ఉండగా, డార్క్ థీమ్ బ్లాక్ రూఫ్ అంతటా యువతను బాగా ఆకట్టుకునే అంశం. దీని ప్రత్యేకత ఇంకా అంతే కాదు. డాష్‌బోర్డ్ చుట్టూ ఉన్న ముదురు ఎరుపు రంగు హైలైట్‌లు క్యాబిన్‌కి ఒక ప్రత్యేకతను తీసుకువచ్చాయి.

More from DriveSpark

Article Published On: Friday, June 20, 2025, 17:04 [IST]
English summary
Honda city sport edition car launched in india at rs 14 88 lakh details inside
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+