కారు కొనాలా? బడ్జెట్ సిద్ధం చేసుకోండి.. అదిరిపోయే హోండా సిటీ కొత్త మోడల్ షోరూమ్‌లోకి వచ్చింది!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయినటువంటి హోండా (Honda) తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ అయిన హోండా సిటీకి ఇటీవల స్పోర్ట్ ఎడిషన్ రూపంలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఎంతో ఆడంబరంగా వచ్చిన ఈ కారు సుమారు 14.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ (Honda city Sport Edition) ఇప్పటికే డీలర్‌షిప్‌లకు చేరుకుందని తెలుస్తుంది. స్పోర్టీ టచ్, ఆకర్షణీయమైన కలర్స్‌తో కారును ప్రీమియమ్ అనుభూతిని అందించేలా రూపొందించారు. హోండా భారత్ ఆటోమొబైల్ రంగంలో తన స్థానం నిలుపుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తుంది. కొత్త తరం అమేజ్‌తో తన అమ్మకాలను పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పుడు దీనికి అదనపు బలంగా ఈ సిటీ స్పోర్ట్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.
హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ డిజైన్‌లో స్పోర్టీయ టచ్ మాత్రమే కాకుండా, ప్రసిద్ధ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. హోండాకు ప్రత్యేకమైన V-TEC వేరియబుల్ వాల్వ్ టైమింగ్ టెక్నాలజీతో ఈ ఇంజిన్, వేగం కోసం మాత్రమే కాకుండా స్మూత్ పవర్ డెలివరీ కోసం కూడా ప్రసిద్ధి చెందింది. 7-స్పీడ్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఈ ఇంజిన్‌కి జతచేయబడింది.

కాబట్టి, ట్రాఫిక్‌లో సౌకర్యంగా కారు నడిపినా, ఓపెన్ రోడ్‌పై, ప్రతి సందర్భంలో ఈజీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 120 bhp పవర్‌తో పాటు 145 Nm పీక్ టార్క్‌ను సృష్టించే సామర్థ్యం ఈ సెడాన్‌కి ఉంది. ఇంత బలమైన పెట్రోల్ ఇంజిన్ ఉన్నప్పటికీ, సిటీ ఆటోమేటిక్ మైలేజ్ సామర్థ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది లీటరుకి 18.40 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు.
హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్‌కు ఫ్రంట్ గ్రిల్, స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, డోర్‌కి అమర్చిన ORVMలు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌కి ప్రత్యేక బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం ద్వారా కారు ముందు నుంచి వెనుక వరకు డైనమిక్ అటిట్యూడ్‌ని ఇస్తుంది. వీటితో పాటు టెయిల్‌గేట్‌పై Sports అనే ప్రత్యేక బ్యాడ్జింగ్ కూడా, ఈ ఎడిషన్ స్పోర్ట్స్ స్పిరిట్‌కి గుర్తుగా నిలుస్తుంది. ఇంటీరియర్‌లోనూ లగ్జరీ అనుభూతి కోసం హోండా కసరత్తు చేసింది.

సీట్ల నుంచి స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ వరకు లెథరెట్ ఫినిషింగ్ వాడటం వల్ల కారు క్యాబిన్ ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. అందులో యాంబియంట్ లైటింగ్ కలవడం వల్ల, రాత్రిపూట ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. ఫీచర్ల విషయంలో కూడా హోండా ఎక్కడా తగ్గడం లేదు. కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించబడింది, ఇది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది.
వాయిస్ కమాండ్ సామర్థ్యం ఉండటంతో, డ్రైవింగ్ సమయంలోనే కొన్ని పనులను వాయిస్ ద్వారా నిర్వహించవచ్చు. నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలన్నీ వాడుకదారులకోసం అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని MID యూనిట్, అవసరమైన అన్ని సమాచారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. సేఫ్టీ కోసం లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటివి ఈ కారులో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








