క్యూట్‌గా నల్ల కలర్‌లో అందంగా మురిసిపోతున్ను హోండా కొత్త కార్లు.. ఇవి చాలా స్పెషల్ గురూ..!

దిగ్గజ కంపెనీ హోండా కార్స్ ఇండియా కొత్త ఏడాది ప్రారంభంలోనే కస్టమర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. పొంగల్ పండుగ, రిపబ్లిక్ డేకు ముందు కంపెనీ రెండు ప్రత్యేక వెర్షన్ కార్లను విడుదల చేసింది. హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ (honda elevate black edition), సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ (Signature black edition) కార్లు తాజాగా మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఇవి అదిరిపోయే డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఎక్స్‌టీరియర్ షేడ్‌ మొత్తం కూడా కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ మాదిరిగా ఉంటాయి. ఇండియాలో కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ, దేశీయ ఆటోమొబైల్ తలయారీ కంపెనీలు భారత్‌లో వరుస బెట్టి పలు మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో హోండా కంపెనీ దేశీయంగా కొత్త కస్టమర్లను పెంచుకోడానికి అదిరిపోయే ఫీచర్స్‌తో ఈ కార్లను విడుదల చేసింది. ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ZX ట్రిమ్‌తో వచ్చింది. దీని మాన్యువల్ గేర్‌బాక్స్ ధర రూ.15.51 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అదే ZX CVT ట్రాన్స్‌మిషన్ టాప్ వేరియంట్ ధర రూ.16.73 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. అదే సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్ ధర రూ.15.71 లక్షలు(ఎక్స్ షోరూమ్), ZX CVT ట్రాన్స్‌మిషన్ టాప్ వేరియంట్ ధర రూ.16.93 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది.

Honda Elevate Signature Black Edition

బ్లాక్ ఎడిషన్ వేరియంట్‌లు కాస్మెటిక్ అప్‌డేట్‌లను కలిగి ఉన్నాయి. ఎగువ గ్రిల్‌పై క్రోమ్ యాక్సెంట్‌లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఈ రెండు కార్లలో ఇంటీరియర్ మొత్తం నలుపు రంగులోనే ఉంటుంది. లివేట్ బ్లాక్ ఎడిషన్ ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్‌తో లెథెరెట్ సీట్లు, బ్లాక్ డోర్ ప్యాడ్‌లు, బ్లాక్ స్టిచింగ్, బ్లాక్ డోర్ ప్యాడ్‌లు వంటి వాటిని కలిగి ఉంది. ప్రత్యేక 'బ్లాక్ ఎడిషన్' లోగో ఆకర్షణగా ఉంటుంది.

కార్లలో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో , యాపిల్ కార్ ప్లే, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ AC, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటివి ఉన్నాయి. సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ వేరియంట్ ఏడు కలర్స్‌లతో కూడిన యాంబియంట్ లైటింగ్‌ను కలిగి ఉంది. ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికుల రక్షణకు సంబంధించి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించారు.

Honda New Elevate Black Edition

ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం కూడా ప్రత్యేకంగా ఉంది. ఇంకా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC),వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెనుక పార్కింగ్ కెమెరా, లేన్‌వాచ్ కెమెరా, లేన్-కీపింగ్ అసిస్ట్, ఇతర లేటెస్ట్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS)ఫీచర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా అదనంగా సేఫ్టీ ఫీచర్స్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే, బ్లాక్ ఎడిషన్ 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ i-VTEC ఇంజిన్‌తో రన్ అవుతాయి. ఇవి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజిన్ 120 bhp పవర్, 145 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం CVT ఆటోమేటిక్ వేరియంట్‌లకు సంబంధించిన బుకింగ్స్ జనవరి నుంచి ఉంటాయి. మాన్యువల్ వేరియంట్లను ఫిబ్రవరి నుంచి డెలివరీ చేస్తారు.

Honda New Signature Black Edition Launched In India

ఈ రెండు ప్రత్యేక ఎడిషన్ కార్ల లాంచ్‌తో వాహన మార్కెట్లో హోండా కంపెనీ టాటా మోటార్స్. హ్యుందాయ్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కొత్త ఎలివేట్ SUV డిజైన్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు, బ్లాక్ కలర్‌లో అదిరిపోతుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 10, 2025, 15:50 [IST]
English summary
Honda elevate and signature black edition launched in india starting price at rs 15 51 lakh
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+