యాక్సిడెంట్ అయినా భయపడాల్సిన పనిలేదు.... సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్ గా హోండా మోడల్..క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్స్!
హోండా ఎలివేట్ (Honda Elevate) ఎట్టకేలకు భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలు ఏలుతున్న ఈ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేయాలని హోండా గట్టిగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ SUV క్రాష్ టెస్ట్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించింది.
జపాన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (JNCAP) క్రాష్ టెస్ట్‌లో హోండా ఎలివేట్ ఏకంగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. గ్లోబల్ NCAP లేదా భారత్ NCAP ఇంకా ఈ కారును పరీక్షించనప్పటికీ, ఈ విజయం హోండాకు గర్వకారణం. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలోని హోండా తపుకర ప్లాంట్‌లో తయారవుతున్న ఎలివేట్ జపాన్‌తో సహా వివిధ అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి అవుతోంది. జపనీస్ మార్కెట్‌కు ఎగుమతి చేయబడుతున్న మొట్టమొదటి భారతీయ తయారీ హోండా వాహనం కూడా ఇదే. JNCAP పరీక్షల్లో ఎలివేట్ మొత్తం 90 శాతం స్కోరు సాధించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అంటే, క్రాష్ టెస్ట్‌లోని 193.8 పాయింట్లకు 176.23 పాయింట్లు సాధించి A గ్రేడ్‌ను పొందింది. ప్రివెంటివ్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్‌లో 95 శాతం స్కోరు (82.22/85.8) సాధించగా, కొలిషన్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్‌లో 86 శాతం స్కోరు (86.01/100) ఎలివేట్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా, ప్రయాణికుల సేఫ్టీలో 57.73 పాయింట్లు, పాదచారుల సేఫ్టీలో 28.28 పాయింట్లు సాధించి క్రాష్ టెస్ట్ నుంచి హోండా ఎలివేట్ తిరుగుముఖం పట్టింది.

ఫుల్-ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్‌లో ఎలివేట్ డ్రైవర్‌కు 96 శాతం, వెనుక ప్రయాణికుడికి 88 శాతం విజయం సాధించింది. ఆఫ్-సెట్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్‌లో డ్రైవర్‌కు 86.9 శాతం, వెనుక ప్రయాణికుడికి 100 శాతం స్కోరు లభించింది. సైడ్ కొలిషన్ సేఫ్టీ టెస్ట్‌లో కూడా ఈ SUV గరిష్ట పాయింట్లను సాధించగలిగింది. హోండా సెన్సింగ్‌తో కూడిన టాప్ వేరియంట్‌లను టెస్ట్ కోసం పంపారు.
హోండా సెన్సింగ్ అనేది ప్రాథమికంగా ఒక అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS). కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, ఆటోమాటిక్ హై బీమ్, లేన్ వాచ్ కెమెరా వంటి ఫీచర్లను కంపెనీ ఇందులో చేర్చింది. ఈ ఫీచర్ ఉండడం వల్లనే ఎలివేట్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడానికి కారణమైంది.

విడుదలైన 18 నెలల్లోనే హోండా ఎలివేట్ ప్రపంచవ్యాప్తంగా లక్ష యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత 18 నెలల్లో జపాన్, దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్ వంటి దేశాలకు 47,653 యూనిట్లను ఎగుమతి చేయడం ద్వారా ఎలివేట్ లక్ష అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2023 సెప్టెంబర్‌లో ఎలివేట్ భారతీయ రోడ్లపైకి వచ్చింది.
రూ.11లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కార్ల సెగ్మెంట్‌లో ఇంత త్వరగా విజయం సాధిస్తుందని చాలా మంది పోటీదారులు ఊహించలేదు. ఇప్పుడు అద్భుతమైన సేఫ్టీ కూడా ఉందని తేలడంతో ఎలివేట్ కొనుగోలు చేసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. SV, V, VX, ZX వంటి వివిధ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఎలివేట్ ప్రస్తుతం రూ.11.91లక్షల నుండి రూ.16.73లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ధరను కలిగి ఉంది.
జనాదరణ పొందిన సిటీ మిడ్-సైజ్ సెడాన్‌కు శక్తినిచ్చే అదే 1.5 లీటర్, 4 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను హోండా ఈ SUVలో కూడా ఉపయోగించింది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వచ్చే ఈ ఇంజిన్ 6,600 rpm వద్ద 119 bhp పవర్‌ను, 4,300 rpm వద్ద 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








