ఈ కారును జనాలు తెగ కొన్నారు.. ఏకంగా షోరూమ్‌ల ముందు క్యూ.. ఎందుకంత పాపులర్ అయిందో ?
ఇండియాలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా (Honda)కు మంచి మార్కెట్ ఉంది. టాటా మోటార్స్, మారుతీ వంటి దేశీయ తయారీదారులకు పోటీగా అధునాతన మోడళ్లను విడుదల చేస్తూనే ఉంది. గత కొన్నేళ్లుగా దేశంలో కార్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో హోండా మార్కెట్లో మెజార్టీ వాటాను పొందడానికి ప్రతి ఏడాది అదిరిపోయే మోడళ్లను భారతీయ వినియోగదారులు కొనగలిగే విధంగా బడ్జెట్ ధరలో విడుదల చేస్తూ అమ్మకాలను క్రమంగా పెంచుకుంటుంది. ఇండియాలో పలు మోడళ్లను విక్రయిస్తున్న హోండా తాజాగా తన ప్రసిద్ధ SUV ఎలివేట్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది. ఈ కారు సేల్స్ పరంగా సరికొత్త రికార్డును సాధించింది. హోండా ఎలివేట్ ఎస్‌యూవీ (Honda Elevate SUV) మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి దాదాపు ఒక లక్ష అమ్మకాలను నమోదు చేసింది. జనాలు ఈ కారును ఆదరించడంపై కంపెనీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ Suvకి భారతీయ వినియోగదారుల్లో మంచి ఆదరణ లభించడం కారణంగానే ఏకంగా లక్ష అమ్మకాలను నమోదు చేసి, మార్కెట్లో డిమాండ్ కారుగా స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మొత్తం అమ్మకాలో దేశీయంగా విక్రయించిన వాటితో పాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేసిన గణంకాలు కూడా ఉన్నాయి. హోండా తన ఎలివేట్ ఎస్‌యూవీను లోకల్‌గా కస్టమర్లకు డెలివరీ చేస్తూనే ఇదే సమయంలో కంపెనీ కీలక మార్కెట్ అయిన పలు దేశాల్లో కూడా విక్రయించింది.

మొత్తం అమ్మకాల్లో ఇండియాలో 53,326 కార్లు స్థానికంగా అమ్ముడుపోగా, జపాన్, దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్ వంటి దేశాలకు దాదాపు 47,653 కార్లను ఎగుమతి చేసి అక్కడి ప్రజలకు విక్రయించారు. వాహన పరిశ్రమలో ఏ రేంజ్‌లో పోటీ ఉందో అందరికి తెలిసిందే. ఒక కారు మార్కెట్లోకి విడుదల అయిందంటే అది ఏ మేరకు అంచనాలకు తగ్గట్టుగా సేల్స్ సాధిస్తుందో అని తయారీదారులు ఆందోళన చెందుతున్నారు.
ఒక కంపెనీ నుంచి వచ్చిన కారుకు పోటీగా నాలుగైదు మోడళ్లు వరుసగా లాంచ్ అవుతూనే ఉంటాయి. ఇంత పోటీ మార్కెట్లో ఎలివేట్ కారును ప్రజలు ఆదరించడం విశేషం అని చెప్పాలి. లాంచ్ అయినప్పటి నుంచి దీని ఆకర్షణీయమైన స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్‌తో ఇంత కాలం ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించింది. అయితే ఈ మొత్తం అమ్మకాల్లో ఎక్కువగా ప్లాటినం వైట్ పెర్ల్ కలర్ వేరియంట్‌ను కొనుగోలు చేయడం గమనార్హం.

కలర్ కస్టమర్లను అట్రాక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 35.1 శాతం మంది వినియోగదారులు ప్లాటినం వైట్ పెర్ల్ కలర్‌ను ఎంచుకున్నారు. తరువాత 19.9 శాతం మంది కస్టమర్లు గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్‌ను, 15.4 శాతం మంది మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్ , 5.3 శాతం అబ్సిడియన్ బ్లూ పెర్ల్ కలర్ వేరియంట్‌ను కొనుగోలు చేశారు. మిగిలిన 14.3 శాతం ఇతర వాటిని ఎంచుకున్నారు.
టాప్ వేరియంట్ ZXను ప్రధానంగా అమ్మకాల్లో ముందు స్థానంలో ఉంది. మొత్తం లక్ష యూనిట్ల సేల్స్‌లో ఈ వేరియంట్‌ను దాదాపు 53 శాతం మంది కొనుగోలు చేశారు. అలాగే 79 శాతం మంది కస్టమర్లు మాన్యువల్ కాకుండా CVT గేర్‌బాక్స్‌ను ఎంచుకోవడం గమనార్హం. మొత్తం కస్టమర్లలో 22 శాతం మంది మొదటిసారి కారు కొనుగోలు చేసేవారు కాగా, 43 శాతం మంది రెండో కారు కోసం దీన్ని కొన్నారు.

ఇక దీని ధర విషయానికి వస్తే, రూ.11.69 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది మాన్యువల్, ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 121 PS పవర్, 145 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లీటరుకు 15.31 కి.మీల మైలేజ్ ఇస్తుంది. అదే CVT ఆప్షన్‌లో 16.92 కిమీగా ఉంది.


Click it and Unblock the Notifications








