మండే ఎండలో హోండా స్పెషల్ గిఫ్ట్.. సమ్మర్ స్పెషల్ కారు వచ్చేసింది.. సరికొత్త ఫీచర్లతో ప్రీమియం లుక్!
భారత ఆటోమొబైల్ రంగంలో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తన అమ్మకాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సిటీ, అమేజ్ సెడాన్లు, తాజా ఎలివేట్ SUVలను విక్రయిస్తున్న కంపెనీ గత కొంత కాలంగా ఇతర తయారీదారులకు బలమైన పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన కార్లను తీసుకొస్తుంది. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హోండా కొత్తగా ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్, స్టాండర్డ్ వేరియంట్ కంటే మరింత స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన కలర్స్, సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఎలివేట్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించడమే కాక, SUV ప్రియులను ఆకట్టుకోవడంలో ఈ ఎడిషన్ కీలక పాత్ర పోషించనుంది. ఈ కొత్త మోడల్ విడుదల ద్వారా హోండా, భారత మార్కెట్లో తిరిగి తన స్థానం నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అపెక్స్ సమ్మర్ ఎడిషన్ పేరుతో వచ్చిన ప్రత్యేక వేరియంట్ ధర రూ.12.39 లక్షల ఎక్స్‌షోరూమ్ వద్ద లాంచ్ అయింది. అయితే మరో కీలక విషయం ఏమిటంటే, ఈ ధర పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించింది. వినియోగదారులను ఆకర్షించేందుకు ధరను కూడా బలమైన అంశంగా చూపించేందుకు హోండా చేసిన వ్యూహాత్మక ప్రయత్నమని అర్థం అవుతుంది. ఈ కారులో కొన్ని కాస్మెటిక్ మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ప్రత్యేకమైన అపెక్స్ బ్యాడ్జ్‌లను జోడించడమే కాక, కొన్ని స్టైలిష్ టచ్‌లు కూడా కలిపి డిజైన్ పరంగా కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఈ మార్పులు కారుకు ప్రత్యేకతను తీసుకురావడమే కాక, వినియోగదారులు మరో అదిరిపోయే కారును ఎంచుకునే అవకాశం కలిగింది. "సమ్మర్ ఎడిషన్" అనే పేరుతో వస్తున్న ఈ వేరియంట్‌లో, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు కూడా ఉంటాయని అనుకున్న నిరాశే. ఎందుకంటే దీనిలో వాటిని అందించలేదు.
అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌లో హోండా కొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్‌ను అందించింది. ముఖ్యంగా, కొత్త 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఇప్పుడు కారుకి మరింత లేటెస్ట్ లుక్‌ను జోడిస్తుంది. ఇది V ట్రిమ్‌లో లభించే 8-అంగుళాల స్క్రీన్‌కు మించినదిగా నిలుస్తోంది. ఈ స్క్రీన్ ఇప్పుడు 360-డిగ్రీ కెమెరా సపోర్ట్ ను కలిగి ఉండటం, పార్కింగ్ సమయంలో మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే, ఇంటీరియర్ డిజైన్ విషయంలో కూడా హోండా కొత్త ఫీచర్స్‌ను అందించింది.

ఐవరీ, బ్లాక్ కలర్‌లతో కూడిన డ్యూయల్-టోన్ థీమ్, ఈ ఎడిషన్‌కు ప్రత్యేకమైన ఎలిగెన్స్‌ను ఇస్తోంది. డాష్‌బోర్డ్, తలుపులు, సీట్ల అప్హోల్స్టరీలో ఉపయోగించిన ఐవరీ లెథరెట్, అలాగే సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ వాడకంతో కేబిన్ మునుపటికంటే మరింత ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. మొత్తానికి, హోండా ఈ అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌ను సాధారణ మోడల్‌కు కాస్మెటిక్ అప్‌డేట్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ, ఇంటీరియర్ అనుభవంలోనూ స్పష్టమైన మెరుగుదలగా తీసుకువచ్చింది.
హోండా ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్, ఆకర్షణీయమైన డిజైన్ మార్పులతో పాటు, మెకానికల్ పరంగా అదే శక్తివంతమైన పరిమాణాలతో అందుబాటులో ఉంది. ఇది 1.5 లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పై నడుస్తుంది. ఈ ఇంజిన్ 119 bhp పవర్, 145 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర డ్రైవింగ్‌తో పాటు హైవే ప్రయాణాలకూ సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇటీవల, హోండా తన అమేజ్, ఎలివేట్ మోడళ్ల కోసం ప్రభుత్వం ఆమోదించిన CNG రెట్రోఫిట్ కిట్లను ప్రవేశపెట్టింది. ఇది పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇంధన ఖర్చును తగ్గించాలనుకునే వినియోగదారులకు ఓ మంచి ప్రత్యామ్నాయంగా మారనుంది. ఇదే కిట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్ వేరియంట్‌కి కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. త్వరలో దీనిపై కూడా పూర్తి సమాచారం వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








