ఇంతకాలం ఎదురు చూశారు కదా? పెట్రోల్ ఖర్చులకు గుడ్ బై చెప్పే కారు వస్తోంది.. మార్కెట్‌ షేక్ కాబోతుంది!

హోండా (Honda) కార్స్ ఇండియా మార్కెట్లో తన శక్తిని తిరిగి చూపించడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మూడు మోడళ్లలో అమేజ్, సిటీ, ఎలివేట్‌‌లు క్రమంగా ప్రజల ఆదరణను పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం హోండా ఎలివేట్ SUV మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంది. 2023 రెండవార్థంలో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎలివేట్, ప్రారంభంలో మంచి ఆదరణను పొందినా, తరువాత నెలలుగా అమ్మకాల పరంగా కాస్త మందగమనంలోకి చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎలివేట్ SUV, భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడింది. దీని 1.5 లీటర్ 4-సిలిండర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 121 bhp పవర్, 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఈ సమయంలో హోండా, మిడ్‌సైజ్ SUV విభాగంలో పోటీకి మరింతగా రంగం సిద్ధం చేస్తూ, హైబ్రిడ్ వెర్షన్‌‌ను త్వరలో పరిచయం చేయాలని యోచిస్తోంది. మారుతున్న మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, మెరుగైన డ్రైవ్ అనుభూతి, ఎమిషన్ ఫ్రెండ్లీ టెక్నాలజీ అవసరమవుతున్న తరుణంలో, హోండా ఎలివేట్ హైబ్రిడ్ వెర్షన్ కంపెనీకి కీలక మలుపు కావచ్చు. ఈ కొత్త ఎలివేట్ హైబ్రిడ్ వెర్షన్ ద్వారా హోండా తన స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుంది.

Eelevate Hybrid Suv

హోండా ఎలివేట్ మిడ్‌సైజ్ SUV మార్కెట్లోకి వచ్చేసరికి వినియోగదారులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అదే సమయంలో, ఒకే పెట్రోల్ ఇంజిన్‌ ఆప్షన్ మాత్రమే అందించడమనేది ప్రధాన లోపంగా మారింది. ఇది ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర మోడళ్లతో పోలిస్తే పెద్ద లోపంగా నిలిచింది. ఎందుకంటే ప్రస్తుతం మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లాంటి ప్రత్యర్థులు పెట్రోల్, మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లను అందిస్తున్నాయి.

ప్రస్తుత మార్కెట్ ధోరణిని పరిశీలిస్తే, వినియోగదారులు ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండే వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. హోండా ఎలివేట్‌ను తొలిసారిగా లాంచ్ చేసిన సమయంలో, దాని డిజైన్, ఫీచర్లపై ప్రశంసలు లభించినా, హైబ్రిడ్ వేరియంట్ అందుబాటులో లేకపోవడం ఓ పెద్ద నిరాశగా మారింది. దీంతో మిడిల్‌క్లాస్ కోసం ఎలివేట్ హైబ్రిడ్‌ను పరిచయం చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది.

Eelevate Hybrid Suv Wll Be Launch In 2026

తాజా నివేదికల ప్రకారం, హోండా 2026లో ఈ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది కంపెనీకి మార్కెట్‌లో తిరిగి దూకుడు తేవడానికి ఒక కీలక అడుగు అవుతుంది. అంతేకాకుండా, ఈ ఎలివేట్ హైబ్రిడ్ వేరియంట్ ఉత్పత్తిని రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న తపుకర ప్లాంట్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇది భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా తయారు చేయడం ద్వారా ధరలపై నియంత్రణ ఉంచే వ్యూహానికి భాగంగా ఉంది.

హోండా ఎలివేట్ హైబ్రిడ్‌ను భారత్‌లో 2026 పండుగ సీజన్ నాటికి లాంచ్ చేయాలన్నది కంపెనీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నదని తాజా సమాచారం వెల్లడిస్తోంది. SUV సెగ్మెంట్‌లో పోటీతత్వ పరిస్థితులు అధికంగా ఉన్న ఈ తరుణంలో, హోండా మళ్లీ తన స్థానాన్ని బలపరచాలనుకుంటోంది. ప్రస్తుతం, ఎలివేట్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌కు సంబంధించి అధికారిక సమాచారం అందుబాటులో లేకపోయినప్పటికీ, కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న హోండా సిటీ e\:HEV హైబ్రిడ్ సెడాన్ ఆధారంగా అంచనాలు వేయవచ్చు.

Eelevate Hybrid Suv Wll Be Launch In India

హోండా సిటీ e:HEV పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను ఎలివేట్ హైబ్రిడ్‌లోనూ ఉంటాయని అంచనాలు ఉన్నాయి. కానీ దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం అమ్ముడవుతున్న హోండా సిటీ e:HEV హైబ్రిడ్ కారు లీటర్‌కు 26.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని తెలుస్తుంది. ఇది ఫుల్ ట్యాంక్ మీద 1,000 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను కలిగి ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇప్పుడు కొత్త హైబ్రిడ్ ఇంత కంటే మెరుగ్గా ఉండవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, July 10, 2025, 14:28 [IST]
English summary
Honda new eelevate hybrid suv wll be launch in india second half of 2026
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+