అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..!
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ బాగా పెరిగిపోయింది. పెద్ద టాప్ కంపెనీలు తమ మార్కెట్‌ను విస్తరించడానికి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకోడానికి హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి మొదలుకుని Suvలు, ఎంపీవీలు మొదలగు వాటిని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు అయితే కలిసిపోయి ఒకే సంస్ధగా ఏర్పడి మరి వాహనాలను ఉత్పత్తి చేసి, వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో వాహన తయారీలో అంతర్జాతీయంగా పేరుగాంచిన జపాన్ కార్ల సంస్థలు హోండా(Honda), నిస్సాన్(Nissan) రెండు కలిసి ఒకే సంస్థగా మారి ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ కలిగిన కంపెనీగా అవతరించాలని ప్రయత్నాలు చేశాయి. ఇంతకుముందు ఈ రెండు సంస్థల మధ్య విలీనం కోసం చర్చలు కూడా జరిగాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ చర్చలు విఫలమయ్యాయని తెలుస్తుంది.
అమెరికా ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అలాగే చైనా కంపెనీ BYD అంతర్జాతీయ కార్ల మార్కెట్‌లో ప్రస్తుతం ఎక్కువగా పోటీపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలు ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి మరి వాహనాలు విడుదల చేస్తూ, అన్ని దేశాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా, చైనా కంపెనీల అధిపత్యానికి చెక్ పెట్టడానికి హోండా, నిస్సాన్ రెండు విలీనం చర్చలు జరిపాయి.

ఈ రెండు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీల విలీనంతో ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో భారీ విప్లవానికి దారితీయవచ్చని మార్కెట్ వర్గాలు భావించాయి. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని అంతా అనుకున్నప్పటికీ ఈ చర్చలు మధ్యలోనే ఆగిపోవడంంతో అందరు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమలో టయోటా మొదటి స్థానంలో ఉండగా, హోండా రెండో స్థానం, నిస్సాన్ మూడో స్థానంలో ఉన్నాయి.
హోండా-నిస్సాన్ విలీనం ద్వారా దాదాపు 60 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కంపెనీని సృష్టించే అవకాశం ఉందని గతంలో సమాచారం కూడా వచ్చింది. ఇక్కడ విలీన చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం నిస్సాన్ కంపెనీ తన అనుబంధ సంస్థగా మారాలని హోండా డిమాండ్ చేయడంతో ఈ ప్రతిపాదనను నిస్సాన్ తిరస్కరించడంతో పాటు, ఇతర ఒప్పందాల విషయంలో రెండు కంపెనీలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో చర్చలు ముందుకు సాగలేదని సమాచారం.

మార్చి 2024 నాటికి హోండా 1.382 ట్రిలియన్ యెన్ల లాభాన్ని నమోదు చేయగా, అదే నిస్సాన్ 568.7 బిలియన్ యెన్ల లాభాన్ని సాధించింది. ఇవి జపాన్‌లో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉండగా, విలీనంతో ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త ఒరవడి మొదలవుతుందని రెండు కంపెనీల ఉన్నతాధికారులు తెలపగా, ఇప్పుడు ఇది ముగింపు కావడంతో అంతా నిరాశలో ఉన్నారు. ఇవి ప్రస్తుతం ఈవీలపై ఎక్కువగా దృష్టి పెట్టాయి.
టెస్లా, Byd కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అంతర్జాతీయంగా పేరున్న సంస్థలుగా ఉండగా, వీటికి పోటీగా మరిన్ని అధునాతన కార్లను తీసుకొచ్చి ప్రపంచంలో అతిపెద్ద ఈవీ తయారీదారుగా అవతరించడానికి అవకాశం పొందాలని హోండా-నిస్సాన్ భావించాయి. వివిధ కారణాల వల్ల చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. దీని గురించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








