హోండా కార్లపై భారీ తగ్గింపులు.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై ప్రత్యేక ఆఫర్లు.. ఛాన్స్ కొద్ది రోజులు మాత్రమే
ప్రతి నెలా ప్రారంభం కాగానే కార్ల కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు డీలర్‌షిప్‌ల ద్వారా వివిధ రకాల ఆఫర్లు అందించడం సహజం. అయితే, ఈ ఆగస్టు 2025 మాత్రం హోండా కార్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే, ఈ నెలలో హోండా తన పాపులర్ కార్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ఇప్పుడు హోండా కారు కొనాలంటే, ఇది నిజంగా సరైన సమయం అని చెప్పొచ్చు. వినియోగదారుల మధ్య మంచి క్రేజ్ ఉన్న Honda Elevate (హోండా ఎలివేట్), అలాగే సొగసైన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్‌తో ఆకట్టుకునే Honda City(హోండా సిటీ), బడ్జెట్ సెగ్మెంట్‌లో నెంబర్ వన్ ఫ్యామిలీ కార్‌గా నిలిచిన Honda Amaze (హెండా అమేజ్) ఈ మూడింటిపైనే ప్రస్తుతం డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు లాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
హోండా పాపులర్ మోడల్ అయిన ఎలివేట్‌పై భారీ డిస్కౌంట్లు, బెనిఫిట్స్‌ను ప్రకటించింది. SUV సెగ్మెంట్‌లో పోటీ పెరుగుతున్నా, హోండా ఎలివేట్ తన డిజైన్, ఫీచర్లు, అలాగే భద్రతా ప్రమాణాలతో వినియోగదారుల మన్ననలు పొందుతోంది. ఈ నెలలో అందుతున్న అత్యధిక ఆఫర్ కూడా ఎలివేట్‌కే దక్కింది. ముఖ్యంగా టాప్-ఎండ్ మోడల్‌పై రూ. 1.22 లక్షల వరకు బెనిఫిట్లు లభిస్తున్నాయి. ఇది SUV కోసం ఎదురు చూస్తున్న వారికి నిజంగా షాకింగ్ డీల్.

మిగతా వేరియంట్లు కూడా బాగానే ఆఫర్‌తో లభిస్తున్నాయి. VX ట్రిమ్‌పై రూ. 78,000 వరకు ఆఫర్, V వేరియంట్ రూ. 55,000 వరకు, బేస్ మోడల్ కూడా రూ. 25,000 వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఎలివేట్ ప్రస్తుతం SV, V, VX, ZX వంటి నాలుగు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.91 లక్షల నుంచి రూ. 16.73 లక్షల వరకు ఉన్నాయి.
సెడాన్ ప్రియులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకున్న హోండా ఈ ఆగస్టులో తమ పాపులర్ మోడల్ అయిన హోండా సిటీపై భారీ ప్రయోజనాలు ప్రకటించింది. హుందాతనాన్ని కోరుకునే వినియోగదారులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇటీవల మార్కెట్‌లోకి ప్రవేశించిన సిటీ స్పోర్ట్స్ ఎడిషన్‌తో పాటు, అన్ని పెట్రోల్ వేరియంట్‌లపై కూడా ఇప్పుడు రూ. 1.07 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

స్టాండర్డ్ వేరియంట్లకే కాదు, కొత్త స్పోర్ట్ ఎడిషన్‌ను కొనే వారి కోసం కూడా డిస్కౌంట్లు వర్తిస్తున్నాయి. దీని బేస్ వేరియంట్(పెట్రోల్) ధర రూ.12.28 లక్షలు, టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.16.55 లక్షలు. సిటీ హైబ్రిడ్ వేరియంట్ ధర రూ.20.75 లక్షలుగా ఉంది. ఇవి అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు. సిటీ హైబ్రిడ్ వేరియంట్‌కి డిమాండ్ బాగా ఉంటుంది. హైబ్రిడ్ టెక్నాలజీతో మైలేజ్, పెర్ఫార్మెన్స్‌ను కలిపి కోరుకునే వారికి ఇది బెస్ట్.
హోండా ఎలివేట్, సిటీపై అందించిన డిస్కౌంట్లకు తోడుగా, హోండా నుండి వచ్చిన మరో ప్రజాదరణ పొందిన సెడాన్ హోండా అమేజ్‌పై కూడా ఈ ఆగస్టు నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కుటుంబ ప్రయాణాలకు, సిటీ యూజ్‌కి సూటైన కారుగా పేరు పొందిన ఈ కారుపై కంపెనీ ఈ ఆగస్టు నెలలో రూ. 97,200 వరకు బెనిఫిట్లు అందిస్తోంది. ఇది కొనుగోలుదారులకు నిజమైన డీలే అని చెప్పొచ్చు.

మరికొద్ది రోజుల్లో పండగలు మొదలుకానున్నాయి. ఇలాంటి సమయంలో హోండా తగ్గింపు ఆఫర్స్ కస్టమర్లను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ డిస్కౌంట్లను వాడుకుని తక్కువ ధరలో కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. పైన పేర్కొన్న ఆఫర్స్ అనే నగరాలను బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిస్కౌంట్ల గురించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని హోండా షోరూమ్‌లో సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications








