కార్లపై రూ.1.51 లక్షల వరకు ఆఫర్లు.. లేట్ చేయకుండా వెంటనే షోరూమ్‌కి వెళ్లండి

భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుల్లో ఒకటైన హోండా (Honda) కార్స్ ఇండియా, పండుగ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చే వార్తను తన కస్టమర్లకు అందించింది. దీపావళి సందర్భంగా కంపెనీ భారీ ఆఫర్లను ప్రకటించింది, ఈ అక్టోబర్ నెలలో హోండా కార్లు కొనుగోలు చేసే వారికి ఆర్థిక పరంగా గొప్ప ప్రయోజనాలు లభించనున్నాయి. హోండా ఎప్పటినుంచీ నాణ్యత, విశ్వసనీయత, మరియు శుద్ధమైన ఇంజనీరింగ్‌కి పేరొందిన బ్రాండ్‌. ఇప్పుడు పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, కంపెనీ తమ మోడల్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ప్రత్యేక ఫైనాన్స్ ఆఫర్లను అందిస్తోంది. ఈ కింది కథనంలో ఆ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

Honda Elevate: ఈ SUVపై రూ. 1.51 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.11.51 లక్షల నుండి రూ. 16.15 లక్షల వరకు ఉండగా, ఆకర్షణీయ డిస్కౌంట్లు ఈ మోడల్‌ను మరింత విలువైన ఎంపికగా నిలిపాయి. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 15 నుండి 17 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.

Honda Offers Up Rs 1 51 Lakh Discount In Diwali October 2025 Amaze Elevate And City

దీని ఎక్స్‌టీరియర్‌లో హై గ్లోస్ గ్రిల్‌, సిగ్నేచర్ LED హెడ్‌ల్యాంప్స్, మస్క్యులర్ బాడీ లైన్స్ SUVకి స్పోర్టీ, ఎలిగెంట్ ఇంప్రెషన్ ఇస్తాయి. ఇది ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్‌, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్‌, అబ్సిడియన్ బ్లూ పెర్ల్‌, రేడియంట్ రెడ్ మెటాలిక్‌, ప్లాటినం వైట్ పెర్ల్‌ వంటి ఐదు ఆకర్షణీయ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ప్రతి షేడూ వాహనానికి ప్రత్యేకమైన ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

Honda City: ఇప్పుడు దీపావళి సందర్భంగా హోండా కంపెనీ ఈ మోడల్‌పై రూ. 1.27 లక్షల వరకు భారీ ఆర్థిక ప్రయోజనాలు ప్రకటించింది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.95 లక్షల నుండి రూ. 16.07 లక్షల వరకు ఉన్నాయి. హోండా సిటీ డిజైన్ పరంగా ఎలిగెంట్, ప్రీమియం స్టైలింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఇంజిన్ పరంగా హోండా సిటీ 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

Honda Offers Up Rs 1 51 Lakh Discount In Diwali October 2025 Amaze Elevate And City

ఇది హోండా ప్రత్యేక i-VTEC టెక్నాలజీతో మృదువైన, శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 18.40 కి.మీ. మైలేజీ అందిస్తుంది. 5 మంది ప్రయాణికులకు సరిపడే విశాలమైన సీటింగ్ అమరికతో వస్తుంది. కేబిన్‌లో ఉపయోగించిన మెటీరియల్స్ ప్రీమియం టచ్‌ను ఇస్తాయి. 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో,యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి

Honda Amaze: అమేజ్, భారతీయ మార్కెట్‌లో ప్రసిద్ధి పొందిన సెడాన్ కారుగా, చిన్న కుటుంబాలకోసం సరైన ఎంపికగా నిలుస్తోంది. దీపావళి సీజన్‌లో, హోండా కంపెనీ రూ. 68,000 వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తూ కస్టమర్ల కోసం ఈ SUVను మరింత ఆకర్షణీయంగా చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 7.41 లక్షల నుండి రూ. 10 లక్షల మధ్య ఉంటాయి. వినియోగదారులకు తక్కువ ఖర్చులో ప్రీమియం సెడాన్ అనుభవం లభిస్తుంది.

Honda Offers Up Rs 1 51 Lakh Discount In Diwali October 2025 Amaze Elevate And City

హోండా అమేజ్ డిజైన్ పరంగా మోడరన్ స్టైలింగ్‌తో ఆకట్టుకుంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా 1.2 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది తక్కువ ఇంధన వినియోగంతో 19.46 kmpl మైలేజీ ఇస్తుంది. వేరియంట్‌లను బట్టి, 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇది 215 kmph వరకు గరిష్ట వేగాన్ని అందించగలదు. కేవలం 15 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని చేరుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, October 18, 2025, 7:30 [IST]
English summary
Honda offers up rs 1 51 lakh discount in diwali october 2025 amaze elevate and city
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+