రూ.1.07 లక్షల వరకు తగ్గింపు.. కారు కలను నిజం చేసే ఛాన్స్.. హోండా డిస్కౌంట్ సునామీ!
హోండా ఇండియా కస్టమర్లను తమ షోరూమ్‌కు రప్పించడానికి, తక్కువ ధరలో కొత్త కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మంచి అవకాశాన్ని అందించడానికి జులై 2025 నెలకు సంబంధించి తన మోడళ్లపై తగ్గింపును ప్రకటించింది. ఎప్పటినుండో కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మంచి గుర్తింపు పొందిన హోండా అమేజ్, అలాగే, ఇతర మెడళ్లు హోండా సిటీ, ఎలివేట్ కార్లపై దాదాపు రూ. 1.07 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా హోండా అందిస్తున్న కార్పొరేట్ బోనస్, లాయల్టీ డిస్కౌంట్స్ వంటివి ఉన్నాయి. ఇటీవల కాలంలో తక్కువ ధరలో అయిన సొంత కారును కలిగి ఉండాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ తగ్గింపు ఆఫర్ సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన హోండా కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.
ఈసారి హోండా అమేజ్ పై అందిస్తున్న ఆఫర్లు మొత్తంగా వినియోగదారులకు సరైన ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నాయి. జులై 2025లో అమేజ్ కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.57,200 వరకు డిస్కౌంట్ ప్రయోజనాలు లభిస్తాయి. అమేజ్ రెండవ తరం కారుకు ఉంటుంది. ఇప్పటికే హోండా కారు ఉన్న కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపు లాయల్టీ బోనస్, కంపెనీలకు లేదా కార్పొరేట్ ఉద్యోగులకు ఇవ్వబడే ప్రత్యేక ఆఫర్ కార్పొరేట్ డిస్కౌంట్ ఈ కారుపై లభిస్తాయి.

హోండా సిటీ కారుపై హోండా ఈ నెలలో దాదాపు 1.07 లక్షల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ మొత్తంలో రెండు ప్రధాన రకాల ఆఫర్లు ఉన్నాయి, కారు ధరపై నేరుగా తగ్గింపు అందించడానికి నగదు డిస్కౌంట్లు, మీ వద్ద పాత కారును ఉన్నట్లయితే దానిని మార్చుకుని తగ్గింపును పొందవచ్చు. ఇవన్నీ కలిపి సిటీని మిడ్‌సైజ్ సెడాన్ విభాగంలో తక్కువ ఖర్చుతో అత్యధిక విలువ కలిగిన కారును సొంతం చేసుకోవచ్చు.
హోండా జులై 2025లో ఎలివేట్ SUVపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. ప్రత్యేకంగా, ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లను ఎంచుకునే కస్టమర్లకు గరిష్ఠంగా రూ.1.2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలు అందిస్తున్నారు. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్లు వంటి విభిన్న డిస్కౌంట్లు ఉంటాయి. మొత్తానికి, ఎలివేట్ మాన్యువల్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.

భారతీయ మార్కెట్లో హోండా తన ఒకే ఒక హైబ్రిడ్ మోడల్, సిటీ e:HEV పై కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. జులై 2025లో ఈ ఎలక్ట్రిఫైడ్ సెడాన్ కొనుగోలు చేసే వినియోగదారులు రూ.65,000 వరకు పొదుపు పొందే అవకాశం ఉంది. ఈ మొత్తంలో కాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు ఉండవచ్చు.ఇది 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ ఒక శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌తో కలసి పనిచేస్తుంది.
ఈ రెండింటి ద్వారా మంచి పవర్, మెరుగైన ఇంధన సామర్థ్యం, తక్కువ ఉత్సర్జనలు సాధ్యమవుతాయి. తాజాగా, కొద్ది వారాల క్రితం హోండా సిటీ స్పోర్ట్ అనే పరిమిత ఎడిషన్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో లోపలి సౌకర్యాలపై కొత్త కలర్ యాక్సెంట్లు, వెలుపల స్పోర్టీ డిజైన్ హైలైట్లు, ప్రత్యేక బాడీ డీకల్స్ వంటి మరికొన్ని ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

హోండా జులై 2025 లో అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్స్ గురించి వినియోగదారులు తమకు దగ్గరలోని షోరూమ్‌లలో సంప్రదించి అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోగలరు. ఎందుకంటే కంపెనీ అందిస్తున్న తగ్గింపులు దేశంలోని రాష్ట్రాలు, నగరాలను బట్టి మారుతు ఉంటాయి. కాబట్టి వినియోగదారులు హోండా సిబ్బందిని సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications








