హ్యుందాయ్‌కి చెమటలు పట్టించేలా హోండా కొత్త కారు.. చూడటానికి అదిరిపోతుంది, కానీ ధర కూడా ఎక్కువే!
అమ్మకాలు లేక అల్లాడుతున్న హోండా కంపెనీకి ఇప్పుడు కొత్త ఉత్సాహం రాబోతుంది. అందుకు కారణం భారత మార్కెట్లోకి సరికొత్త కారు రాబోతుండడమే. ప్రస్తుతం అమేజ్, సిటీ, ఎలివేట్ అనే మూడు మోడళ్లతోనే మార్కెట్లో గట్టిగా నిలబడటానికి ప్రయత్నిస్తున్న ఈ జపనీస్ బ్రాండ్ ఈ కొత్త కారుతో దేశంలో మళ్ళీ జోరు పెంచడానికి రెడీ అవుతుంది.
ఇటీవల సివిక్ టైప్ R లాంటి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మోడళ్లు కూడా హోండా షోరూమ్‌లలోకి రాబోతున్నాయట. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ లాగానే హోండా కూడా తన కొత్త హ్యాచ్‌బ్యాక్‌తో మార్కెట్లో ప్రభంజనం సృష్టించగలదని నమ్మకం ఉంది.

అయితే, సివిక్ రాకకు ముందే షోరూమ్‌లకు జనాన్ని రప్పించడానికి హోండా ఇప్పుడు సిటీ సెడాన్ సరికొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఇటీవల కాలంలో అమ్మకాలు పెంచుకోవడానికి వాహనాలకు కొత్త వెర్షన్‌లను విడుదల చేసే ప్లాన్‌నే హోండా ఇప్పుడు కూడా వాడుతోంది. ఎలివేట్, సిటీలలో అపెక్స్ ఎడిషన్ తీసుకొచ్చినట్లే, సిటీ సెడాన్‌కు మరో స్పెషల్ ఎడిషన్ త్వరలోనే రోడ్లపైకి వస్తుంది.
హోండా తన అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా సిటీ సెడాన్ కొత్త స్పెషల్ ఎడిషన్ వెర్షన్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. "ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్ అండ్ గేర్ అప్ ఫర్ ఏ స్పోర్టియర్ లైఫ్" అనే క్యాప్షన్‌తో రాబోయే కారు టీజర్ వీడియోను షేర్ చేశారు. ఎక్కువగా, ఇది సిటీ టాప్-ఎండ్ ZX వేరియంట్‌పై ఆధారపడిన సిటీ స్పోర్ట్ ఎడిషన్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ సిటీ స్పోర్ట్ ఎడిషన్‌కు కారును మరింత అందంగా మార్చడానికి కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉంటాయట. ముందు, వెనుక బంపర్‌లపై బ్లాక్ ట్రిమ్స్, బ్లాక్ రియర్‌వ్యూ మిర్రర్స్, ఒక బ్లాక్ లిప్ స్పాయిలర్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ వంటివన్నీ ఈ మిడ్-సైజ్ సెడాన్‌కు న్యూ లుక్‌ను ఇవ్వబోతున్నాయి. బయట మార్పుల్లాగే, లోపల కూడా హోండా ఇదే తరహాలో కొత్త మార్పులు తీసుకురావచ్చు.
డ్యాష్‌బోర్డ్, సీట్ అప్‌హోల్స్టరీ , సెంటర్ కన్సోల్ వంటి చోట్ల స్పోర్టీ రెడ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. స్టాండర్డ్ మోడల్స్‌తో పోలిస్తే మరింత స్పోర్టీగా కనిపించడానికి స్టీరింగ్ వీల్, గేర్ సెలెక్టర్, సీట్ అప్‌హోల్స్టరీలలో రెడ్ స్టిచింగ్ కూడా ఉండొచ్చు. ఈ కాస్మెటిక్ మార్పులు తప్ప, మెకానికల్‌గా అంటే ఇంజిన్ లేదా ఇతర టెక్నికల్ విభాగాల్లో హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్‌కు ఎలాంటి మార్పులు ఉండవు.

ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌కు కూడా V-TEC వేరియబుల్ వాల్వ్ టైమింగ్ ఉన్న 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్నే వాడతారు. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది 120 bhp పవర్‌తో గరిష్టంగా 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. రాబోయే హోండా సిటీ స్పెషల్ ఎడిషన్ ధర కూడా కాస్త ఎక్కువే ఉండొచ్చట.
ప్రస్తుతం హోండా సిటీ SV, V, VX, ZX అనే రకరకాల వేరియంట్లలో లభిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్ ధరలు భారతదేశంలో రూ.12.38 లక్షల నుంచి రూ.16.65 లక్షల వరకు ఉన్నాయి. కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌కు టాప్-ఎండ్ వేరియంట్ కంటే సుమారు రూ.30,000 వరకు ఎక్కువ ధర ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

భారత మార్కెట్‌లో అత్యుత్తమ సెడాన్‌లలో హోండా సిటీ ఒకటి అనేది అందరికీ తెలిసిన విషయమే. మంచి రిఫైన్‌మెంట్, మంచి పర్ఫార్మెన్స్, మంచి మైలేజ్ మరియు అదిరిపోయే రీసేల్ వాల్యూ అన్నీ కలిపి అందించే హోండా సిటీని కొందరు ఒక స్టేటస్ సింబల్‌గా కూడా చూస్తారు.
ప్రస్తుతం ఐదో తరం మోడల్‌లో ఉన్న ఈ సెడాన్, సి-సెగ్మెంట్‌లో హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వర్టిస్, స్కోడా స్లావియా వంటి పెద్ద పెద్ద కార్లతో పోటీ పడుతోంది. వీటితో పాటు, హ్యుందాయ్ క్రెటా వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో కూడా ఇది పోటీ పడాల్సి వస్తుంది. ఈ కొత్త మోడల్ రాకతో హోండా కంపెనీ తన అమ్మకాలను మరింత పెంచుకోగలదని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








