ఫార్చ్యూనర్ కంటే ఎక్కువ డిమాండ్.. ఈ ఎస్యూవీ అమ్మకాలు చూసి సొంత కంపెనీనే షాక్ అయింది
ఇండియన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ (Mid-Size SUV) సెగ్మెంట్‌లో హోండా ఎలివేట్ (Honda Elevate) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొద్ది నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ అమ్మకాలు మొదట్లో తక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక ఊహించని విజయాన్ని నమోదు చేసింది. తాజాగా సెప్టెంబర్ 2025 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) కంటే కూడా హోండా ఎలివేట్‌కు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఈ గణాంకాలు హోండాకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు, ఎలివేట్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చిన JNCAP క్రాష్ టెస్ట్ ఫలితాలను కూడా వెల్లడించింది.
సెప్టెంబర్ నెలలో హోండా ఎలివేట్‌కు టయోటా ఫార్చ్యూనర్ కంటే ఎక్కువ అమ్మకాలు లభించాయి. పండుగల సీజన్‌లో వినియోగదారులకు హోండాపై ఉన్న ఆసక్తికి 24 శాతం వృద్ధి ఒక నిదర్శనం. హోండా ఎలివేట్‌ను పరిశీలిస్తే, 2025 ఎస్‌యూవీ మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నం ఫలిస్తోంది. అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ, పవర్ఫుల్ ఇంజిన్ పర్ఫామెన్స్ ఈ మోడల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

కొత్త ఇంటీరియర్ థీమ్స్, ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ ఎలిమెంట్స్, షోరూమ్‌లకు ఎక్కువ మందిని ఆకర్షించే లక్ష్యంతో ప్రత్యేక ఎడిషన్ (Special Edition) వంటి మార్పులను హోండా ఎలివేట్ ఎస్‌యూవీలోకి తీసుకువచ్చారు. వీటిలో అత్యంత ముఖ్యమైన మార్పు జెడ్‌ఎక్స్ వేరియంట్‌లో (ZX Variant) జరిగింది. ఈ అప్‌డేట్స్‌తో కారు మరింత ఆకర్షణీయంగా మారింది.
భారతదేశంలోని హోండా తపుకర ప్లాంట్‌లో (Tapukara Plant) తయారైన ఎలివేట్ జపాన్‌తో (Japan) సహా వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతోంది. జపనీస్ మార్కెట్‌కు ఎగుమతి అవుతున్న మొదటి భారతీయ తయారీ హోండా వాహనం కూడా ఇదే. జెఎన్‌సిఎపి పరీక్షలలో ఎలివేట్ మొత్తం 90 శాతం స్కోర్‌ను సాధించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే క్రాష్ టెస్ట్‌లో 193.8 పాయింట్లలో 176.23 పాయింట్లను పొంది 'A' గ్రేడ్ సాధించింది.

నివారణ సేఫ్టీ పర్ఫామెన్సులో 95 శాతం స్కోరు (82.22/85.8) సాధించగా, క్రాష్ సేఫ్టీ పర్ఫామెన్సులో ఎలివేట్ 86 శాతం స్కోరును (86.01/100) సాధించింది. అంతేకాకుండా, పాసింజర్ ప్రొటెక్షన్లో 57.73 పాయింట్లు, పాదచారుల రక్షణకు 28.28 పాయింట్లు సాధించి క్రాష్ టెస్ట్ నుండి హోండా ఎలివేట్ రీఎంట్రీ ఇచ్చింది.
ఫుల్ ఫ్రంట్ కొల్లిజన్ టెస్ట్‌లో ఎలివేట్ డ్రైవర్‌కు 96 శాతం, వెనుక ప్రయాణీకుడికి 88 శాతం సక్సెస్ సాధించింది. ఆఫ్-సెట్ ఫ్రంటల్ కొల్లిజన్ టెస్ట్‌లో డ్రైవర్‌కు 86.9 శాతం, వెనుక ప్రయాణీకుడికి 100 శాతం స్కోరు లభించింది. సైడ్ కొల్లిజన్ టెస్టులో కూడా ఈ ఎస్‌యూవీ గరిష్ట పాయింట్లను సాధించింది. హోండా సెన్సింగ్‌తో కూడిన టాప్ వేరియంట్‌లు ఈ టెస్టుకు వచ్చాయి.

రూ.11 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ వాహనం తన సెగ్మెంట్లో ఇంత త్వరగా విజయం సాధిస్తుందని చాలా మంది కాంపిటేటర్లు ఊహించలేదు. ఇప్పుడు అద్భుతమైన భద్రత కూడా ఉందని నిరూపించబడటంతో ఎలివేట్ కొనడానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. SV, V, VX, ZX అనే వివిధ వేరియంట్‌లలో లభిస్తున్న ఎలివేట్‌కు ప్రస్తుతం రూ.11.91 లక్షల నుండి రూ.16.73 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధర ఉంది.


Click it and Unblock the Notifications








