విదేశాల్లో హాట్‌కేకుల్లా అమ్ముడైన కారుతో ఎంట్రీ ఇవ్వనున్న హోండా.. ఇది వస్తే ఇక మార్కెట్‌లో రచ్చ రచ్చే!
జపాన్‌కు చెందిన ఆటో మొబైల్ సంస్థ హోండా.. భారత్‌లో బాగా ఫేమస్ అయిన బ్రాండ్. తమ వాహనాలతో ఎన్నో ఏళ్లుగా వినియోగదారుల మనసు దోచుకుంటూ వస్తోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన హోండా సిటీ, సివిక్, అమేజ్ వంటి సెడాన్ కార్లతో భారత కస్టమర్లకు బాగా చేరువైంది. వీటితో ఈ సంస్థ లాభాల్ని కూడా ఆర్జించింది. ఆ తర్వాత హోండా.. ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా.. 'ఎలివేట్' పేరుతో ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఒకప్పుడు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నవి కారు ఇప్పుడు.. డీలా పడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. కొత్త కార్లను భారత మార్కెట్లోకి తీసుకువచ్చి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం.
హోండా సంస్థ తమ వినియోగదారులకు ఒక శుభవార్త చెప్పింది. ఎలివేట్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను త్వరలో లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా హోండా సంస్థ.. ZR-V హైబ్రిడ్ ఎస్‌యూవీని కూడా త్వరలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీని టైంలైన్‌పై కచ్చితమైన వివరాలు లేనప్పటికీ.. ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే యేడాది ప్రారంభంలో ఈ కారును లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ZR-V ఎస్‌యూవీని.. అంతకుముందు CR-V, హోండా అకార్డ్ హైబ్రిడ్ కార్ల తరహాలో పూర్తిగా దిగుమతి చేసుకొని విక్రయించాలని భావిస్తోంది హోండా సంస్థ. అంటే భారత్లో కాకుండా విదేశాల్లో దీన్ని తయారు చేసి, ఇక్కడకు దిగుమతి చేసుకొని విక్రయించనుంది. తమ గ్రేటర్ నోయిడాలోని ప్లాంట్‌లో CKD ఆపరేషన్లను నిర్వహిస్తోంది హోండా సంస్థ. కానీ ఈ యూనిట్ 2020 డిసెంబర్ నుంచి మూతపడి ఉంది.
ఇప్పుడు హోండా ZR-V ఎస్ యూవీకి భారత్లో మంచి రెస్పాన్స్ లభించినట్లయితే.. భవిష్యత్తులో దీని అసెంబ్లింగ్ అంతా భారత్‌లోనే నిర్వహించాలని భావిస్తోంది హోండా సంస్థ. ఈ ZR-V మోడల్ లాంచ్‌పై హోండా సంస్థ ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. గతంలో కూడా ఈ సంస్థ కొన్ని మోడళ్లను లాంచ్ చేయాలని భావించి, ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న దాఖలాలు ఉన్నాయి.

మరి ఈ ZR-V మోడల్ విషయంలో ఏం జరుగుతుందో ఎదురుచూడాల్సిందే!. అంతర్జాతీయంగా ఈ ZR-V కారును 2022లో తీసుకువచ్చింది హోండా సంస్థ. జపాన్ సహా ఇతర ఆసియాన్ దేశాల్లో ఈ కారు హాట్ కేకుల్లా అమ్ముడైంది. అందువల్ల భారత్‌లోనూ ఈ కారుకు మంచి ఆదరణ దొరుకుతుందని హోండా సంస్థ భావిస్తోంది.
ఇది 4.56 మీటర్ల పొడవుతో, 2,655 mm వీల్ బేస్‌తో ఉంటుంది. క్రెటా కంటే ఈ హోండా ఎస్‌యూవీ కాస్త పొడవుగా ఉంటుంది. ఈ కారును హోండా సివిక్ లేటెస్ట్ జనరేషన్ ఆధారంగా తయారు చేశారు. అధునాతనమైన డిజైన్‌తో హోండా ZR-V కారు ఉంటుంది. దీని ఫ్రంట్ భాగంలో octagonal గ్రిల్, LED హెడ్‌లైట్స్ ఉంటాయి. దీని పక్క భాగంలో రౌండెడ్ షేప్ ఉంటుంది.

Coupe తరహాలో వాలి ఉండే దీని గ్లాస్ స్లోప్ ఉంటుంది. ఇది దీనికి కలర్ ఫుల్ లుక్ అందిస్తుంది. ఈ కారు బ్యూటిఫుల్ డ్యాష్ బోర్డ్‌తో వస్తుంది. దీంట్లో ఇంటిగ్రేటెడ్ క్లైమేట్ వెంట్స్, ఫిజికల్ క్రైమేట్ కంట్రోల్ బటన్లు, ఫ్రీ- స్టాండింగ్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్టుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీంట్లో బటన్-ఆపరేటెడ్ గేర్ షిఫ్ట్ ప్యానెల్ ఉంటుంది.
జపాన్ సహా ఇతర ఏసియన్ మార్కెట్లలో విక్రయిస్తున్న ఈ కారు 2.0- లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇది ఎలక్ట్రిక్ CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జోడించి ఉంటుంది. దీంట్లో రెండు ఎలక్ట్రిక్ మోటార్స్‌తో AWD పెట్రోల్- హైబ్రిడ్ సెటప్ ఉంటుంది. ఇది 180 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








