ప్రపంచాన్ని జయించిన హైబ్రిడ్ కారులో కుటుంబ సమేతంగా భార్యాపిల్లలతో వెళ్లొచ్చు.. ఇండియాలోకి ఇంటర్నేషనల్ మోడల్!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా (Honda) భారత్‌లో మంచి మార్కెట్ కలిగి ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఇతర కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి తయారీదారుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి రానున్న రోజుల్లో హోండా కొత్త కార్లను విడుదల చేసే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగా కంపెనీ ZR-V హైబ్రిడ్ మోడల్‌ను త్వరలోనే లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కారు లాంచ్‌తో హోండా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో తన పట్టును సాధించాలని చూస్తుంది. ఈ కొత్త కారుకు సంబంధించి కంపెనీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికి రానున్న రోజుల్లో ఇది మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీలకు భారత్‌లో మంచి ఆదరణ ఉంటుంది.

ఈ తరుణంలో ఈ సెగ్మెంట్‌లో ZR-V హైబ్రిడ్ సక్సెస్ అవుతుందని అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కారు ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాల్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. అక్కడ చాలా మంది వినియోగదారులు ఈ కారును ఆదరించారు. దీంతో భారత్‌లో కూడా మంచి సేల్స్ సాధిస్తుందని హోండా అంచనా వేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో సక్సెస్ కావడంతోనే హోండా తన హైబ్రిడ్ కారును ఇక్కడికి తీసుకొస్తుంది.

Honda Zr V Hybrid Suv

ఈ కారును హోండా సివిక్ ఆధారంగా రూపొందించారు. ఇండియాలో ZR-V విడుదలను కంపెనీ అధికారికంగా పేర్కొనలేదు, అయినప్పటికి 2025 ఏడాది చివరి నాటికి లేదా ఆ తర్వాత ఏడాది ప్రారంభం నాటికి దేశంలో విడుదల అవుతుందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న ZR-V హైబ్రిడ్ రెండు వేరు వేరు డ్రైవ్ సెటప్‌లతో కొనుగోలుకు లభిస్తుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్, e:HEV హైబ్రిడ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది.

ప్రత్యేకంగా హైబ్రిడ్ ఎడిషన్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ CVT గేర్‌బాక్స్‌‌ను జతచేశారు. ఇది 181 hp పవర్, 315 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ZR-V హైబ్రిడ్ మోడల్‌ని కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) ద్వారా ఇండియా మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారు విడిభాగాలను దిగుమతి చేస్తారని తెలుస్తుంది.

Honda Zr V Hybrid Suv Design

ఈ తరువాత వీటన్నింటిని కలిపి లోకల్‌గా ఉన్న ప్లాంట్ ద్వారా అసెంబుల్ చేసి విక్రయిస్తారు. దీని కొలతల విషయానికి వస్తే, పొడవు 4,568 mm,వెడల్పు 1,840 mm, ఎత్తు 1,620 mmను కలిగి ఉంటుంది. వీల్‌బేస్ 2,655 mmగా ఉంది. ఎక్స్‌టీరియర్ చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. LED హెడ్‌లైట్లు ఇంటిగ్రేటెడ్ DRLల సెటప్‌తో చాలా స్మూత్‌గా ఉంటాయి. ఓవల్ గ్రిల్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌ కారుకు ప్రధాన ఆకర్షణ.

వెనుక భాగంలో మెటాలిక్ కలర్‌లో ఫినిష్ చేసిన బంపర్ సెటప్, LED టెయిల్‌లైట్‌లు ఉన్నాయి. హైబ్రిడ్ కారు ఇంటీరియర్ థీమ్ ఆకట్టుకుంటుంది. లోపల డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణంలో లోపల బోర్ కొట్టకుండా పాటలు వింటూ రైడ్‌ను ఎంజాయ్ చేయడానికి ప్రీమియం బోస్ సౌండ్ సిస్టం ఉంటుంది.

Honda Zr V Hybrid Suv Specifications

USB టైప్-సి ఛార్జింగ్‌ పోర్ట్, 10.2-అంగుళాల డ్రైవర్ ఇంటర్‌ఫేస్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, హీటెడ్ సీట్లు, అన్ని కూడా లెదర్ లాంటి అప్హోల్స్టరీతో అందించారు. రిమోట్ కీలెస్ ఎంట్రీ, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సేఫ్టీ కోసం కొలిషన్ మిటిగేషన్ ప్రివెన్షన్ సిస్టమ్ (CMBS), లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW) వంటివి ఉన్నాయి. ఈ కారు 22 kmpl మైలేజీని అందిస్తుందని అంచనా వేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 28, 2025, 16:01 [IST]
English summary
Honda zr v hybrid suv will launch soon in india here the all top things details
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+