ఎలక్ట్రిక్ రంగంలో కొత్త యుద్దం..హోండా ఆల్ఫా ఎస్‌యూవీ అంటే మామూలుది కాదబ్బా..!

ఇండియన్ మార్కెట్‌లో హోండా (Honda) తన పాత వైభవాన్ని కోల్పోయి నిరాశలో ఉంది. అయినా తగ్గేదేలే అంటూ పోరాడానికి కాలు దువ్వుతోంది. అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి మోడళ్లు అమ్మకాల్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా, భవిష్యత్తు కోసం కొత్త వ్యూహాలను రచిస్తోంది. ముఖ్యంగా టాటా మోటార్స్ (Tata Motors), ఎంజీ (MG), మహీంద్రా (Mahindra) వంటి దిగ్గజాలు రాజ్యమేలుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) రంగంలోకి హోండా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా జపాన్ మొబిలిటీ షోలో హోండా కొత్త ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ(Alpha Electric SUV) ప్రోటోటైప్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.

దీనిలో మొదటి అడుగుగా 2025 జపాన్ మొబిలిటీ షోలో (Japan Mobility Show) హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రోటోటైప్‌ను ఆవిష్కరించింది. ఈ వాహనం బ్రాండ్ నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల గురించి ఒక అవగాహనను ఇస్తుంది. బ్రాండ్ ఎలక్ట్రిక్ హోండా 0 సిరీస్‌లో (Honda 0 Series) సరికొత్త అదనంగా వచ్చిన ఈ మోడల్ భారతదేశాన్ని కూడా టార్గెట్ చేసుకుంది.

Honda s New Electric SUV Alpha to Challenge Maruti eVitarra Made in India

సిటీ డ్రైవింగ్‌తో పాటు అవుట్‌డోర్ అవసరాలకు సరిపోయేలా ఈ ఎస్‌యూవీని డిజైన్ చేశారు. దీని నిర్మాణం బరువు తక్కువగా, పవర్ఫుల్‎గా, అడ్వాన్సుడ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌తో ఉండేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. హోండా ఆల్ఫా EV ప్రధాన మార్కెట్లుగా జపాన్, భారతదేశం ఉండనున్నాయి.

వచ్చే ఏడాదే (2026) భారత్‌లోకి సీబీయూ (Completely Built Unit) మార్గం ద్వారా వచ్చే పెద్ద హోండా 0 ఎస్‌యూవీకి భిన్నంగా, ఆల్ఫా ఎస్‌యూవీని మాత్రం భారతదేశంలోనే తయారు చేస్తారు. దీని ప్రొడక్షన్ వెర్షన్ 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా విక్రయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Honda s New Electric SUV Alpha to Challenge Maruti eVitarra Made in India

షార్ప్ ర్యాక్డ్ ఫ్రంట్, నిలువు రియర్ విండ్‌స్క్రీన్‌లు, మందపాటి C-పిల్లర్, బూట్ స్పాయిలర్ అన్నీ అందంగా ఉన్నాయి.హెడ్‌లైట్లు, ఇల్యూమినేటెడ్ హోండా ఎంబ్లమ్, ఛార్జింగ్ పోర్ట్ కవర్, వెనుక వైపున U-ఆకారపు లైట్ బార్ టెయిల్ ల్యాంప్‌లు, ఇండికేటర్లు, రివర్స్ లైట్లు వంటివి కూడా ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచుతాయి.

హోండా ఆల్ఫా కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ లేదా టెక్నికల్ వివరాలను హోండా ఇంకా వెల్లడించనప్పటికీ, లోపలి భాగం మోడ్రన్‎గా ఉంటుందని భావిస్తున్నారు. ప్రొడక్షన్-స్పెక్ ఆల్ఫా ఎస్‌యూవీలో హోండా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లను అందిస్తుందని, రెండింటిలోనూ LFP బ్యాటరీలు ఉంటాయి.

Honda s New Electric SUV Alpha to Challenge Maruti eVitarra Made in India

ఇది భారతదేశంలోని వేడి పరిస్థితులకు మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఖచ్చితమైన బ్యాటరీ సామర్థ్యం ఇంకా వెల్లడించనప్పటికీ అవి పోటీతత్వాన్ని కలిగి ఉంటాయని, 65kWh-75kWh యూనిట్లు ఉండవచ్చని బ్రాండ్ పేర్కొంది.

మొదట హోండా ఆల్ఫా ఎస్‌యూవీ సింగిల్-మోటార్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ ఈవీగా ప్రవేశపెట్టనుంది. ఈ మోడల్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు, ప్రొడక్షన్-స్పెక్ హోండా ఆల్ఫా ఎస్‌యూవీ భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ మార్కెట్లలోనూ మారుతి eVitarraతో పోటీ పడుతుంది.

Honda s New Electric SUV Alpha to Challenge Maruti eVitarra Made in India

భారతదేశంలో హోండా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ఇతర ప్రత్యర్థులలో మహీంద్రా BE 6 (Mahindra BE 6), MG ZS EV, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric), టాటా కర్వ్ EV (Tata Curvv EV) వంటివి ఉన్నాయి. హోండా EV అంచనా ధర రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 29, 2025, 17:59 [IST]
English summary
Hondas new electric suv alpha to challenge maruti evitarra made in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+