పాత కార్లను తుప్పు పట్టకుండా చేయాలంటే ఈ చిట్కాలు పాటించండి.. కొత్త కారులా మెరిసిపోతుంది

వర్షాకాలం వచ్చిందంటే చాలు, కారు యజమానులకు ఓ పెద్ద సమస్య మొదలవుతుంది. అదే తుప్పు. ముఖ్యంగా, పాత కార్లు ఉన్నవారికి ఇది మరింత పెద్దగా మారుతుంది. కొత్త కార్లతో పోలిస్తే, పాత కార్లకు తుప్పు పట్టే ప్రమాదం చాలా ఎక్కువ. చిన్నపాటి గీతలు, పెయింట్ ఊడిపోయిన చోట్ల వర్షపు నీరు చేరితే, మెల్లగా తుప్పు పట్టి కారు రూపాన్నే మార్చేస్తుంది.

మరి మీ పాత కారు తుప్పు పట్టకుండా ఈ వానాకాలంలో ఎలా కాపాడుకోవాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. తుప్పు నుండి కారును రక్షించడానికి మీరు కారుకు ప్రత్యేక కోటింగ్స్‌ను చేయించవచ్చు.

Car Rust

యాంటీ-రస్ట్ కోటింగ్ : ఇది మీ కారు లైఫ్ టైం పెంచడంతో పాటు, కారు బాడీకి తుప్పు పట్టకుండా కాపాడుతుంది. ముఖ్యంగా, కారు కింద భాగానికి ఈ కోటింగ్ చేయించడం తప్పనిసరి. రోడ్లపై ఉన్న బురద, నీరు, కెమికల్స్ అన్నీ ఈ భాగాన్నే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. పాత కార్లలో అండర్‌బాడీ ఇప్పటికే బలహీనంగా ఉంటే, ఈ కోటింగ్ తుప్పును నిరోధించడంలో చాలా సహాయపడుతుంది.

సిరామిక్ కోటింగ్ / టెఫ్లాన్ కోటింగ్ : యాంటీ-రస్ట్ కోటింగ్‌తో పాటు, మీరు వర్షపు నీటి నుండి రక్షించడానికి సిరామిక్ కోటింగ్ లేదా టెఫ్లాన్ కోటింగ్ కూడా చేయుంచుకోవచ్చు. ఈ కోటింగ్ కారు పెయింట్‌ను రక్షించడమే కాకుండా, కారు మెరుపును కూడా నిలబెడుతుంది.

Car Rust

ఇవి కారు ఉపరితలంపై ఒక అదనపు పొరను ఏర్పరచి, నీరు తేమ లోపలికి చొరబడకుండా నిరోధిస్తాయి. సిరామిక్ కోటింగ్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. హైడ్రోఫోబిక్ గుణాలను కలిగి ఉంటుంది.. అంటే నీటిని నిరోధించి, ఈజీగా జారిపోయేలా చేస్తుంది.

కారుకు ఎక్కడైనా డ్యామేజ్ అయినట్లయితే, ఆ డ్యామేజ్‌ను వెంటనే సరిచేయించాలి. లేదా ఎక్కడైనా గీతలు పడి ఉంటే, వర్షంలో కారును బయటకు తీయడానికి ముందు వాటిని రిపేర్ చేయించడం అవసరం. లేకపోతే, ఆ భాగంలో తేమ చేరి నెమ్మదిగా తుప్పు పట్టడం ప్రారంభమవుతుంది. పాత కార్లలో ఇప్పటికే చిన్న చిన్న డ్యామేజ్‌లు లేదా పెయింట్ ఊడిపోయిన ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి.

Car Rust

ఈ ప్రదేశాలు తేమకు గురైనప్పుడు తుప్పు పట్టేందుకు అనుకూలంగా మారుతాయి. అందువల్ల, పెయింట్ అవసరమైతే పెయింట్ చేయించండి. లేదంటే డ్యామేజ్ అయిన భాగాన్ని మార్చడం మంచిది. చిన్న గీతలు కూడా వర్షాకాలంలో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.

రెగ్యులర్ చెకింగ్ : వర్షాకాలంలో కారును తరచుగా చెక్ చేయాలి. ముఖ్యంగా డోర్‌ల అంచులు, వీల్ ఆర్చ్‌లు, అండర్‌బాడీ వంటి ప్రదేశాలను జాగ్రత్తగా గమనించాలి. పాత కార్లలో సాధారణంగా తుప్పు మొదలయ్యే ప్రదేశాలు ఇవే.

తుప్పు పట్టిన చోట్ల వెంటనే చర్యలు: చిన్నపాటి తుప్పు మచ్చలు కనిపించినట్లయితే, వాటిని వెంటనే శుభ్రం చేసి, రస్ట్ కన్వర్టర్ లేదా చిన్నపాటి టచ్-అప్ పెయింట్ తో కవర్ చేయాలి. ఇది తుప్పు మరింత వ్యాప్తి చెందకుండా ఆపుతుంది. నిర్లక్ష్యం చేస్తే, అది కారు బాడీకి పెద్ద నష్టం కలిగిస్తుంది.

కారు లోపల శుభ్రత: వర్షాకాలంలో కారు లోపల తేమ చేరి దుర్వాసన రావడమే కాకుండా, లోపలి భాగంలో కూడా తుప్పు పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, కార్ మ్యాట్‌లను తరచుగా శుభ్రం చేసి, ఆరబెట్టాలి. అవసరమైతే తేమను పీల్చుకునే ప్యాకెట్లను కారు లోపల ఉంచాలి.

వర్షాకాలంలో వర్షపు నీరు కూడా కారుకు నష్టం కలిగించవచ్చు, కాబట్టి ముందుగానే రెడీగా ఉండడం చాలా ముఖ్యం. మీరు మీ కారును సరిగ్గా చూసుకోకపోతే, వర్షాకాలంలో నీటి కారణంగా మీ కారు భాగాలు మాత్రమే కాకుండా, కారు బాడీ కూడా తుప్పు పట్టే సమస్యతో మీరు పోరాడాల్సి రావచ్చు. ఈ చిట్కాలు మీ కారును తుప్పు పట్టకుండా కాపాడటానికి సహాయపడతాయి. ముఖ్యంగా పాత కార్ల యజమానులకు ఇవి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 16, 2025, 14:49 [IST]
English summary
How to save your vehicles body from rusting especially for older cars
Read more on: #car repair #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+