కారు లోపల హెల్మెట్ ఏంటి బాసూ? హువావే లక్సీడ్ V9 టెక్నాలజీ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ఆటోమొబైల్ ప్రపంచంలో భద్రతకు సంబంధించి ఒక పెను మార్పు రాబోతోంది. సాధారణంగా హెల్మెట్ అంటే కేవలం ద్విచక్ర వాహనదారులకే పరిమితం అనుకుంటాం. కానీ భవిష్యత్తులో కార్లలో ప్రయాణించే వారు కూడా హెల్మెట్ వంటి రక్షణను పొందబోతున్నారు. చైనీస్ టెక్ దిగ్గజం హువావే (Huawei), చెర్రీ (Chery) కార్ల తయారీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలోని లక్సీడ్(Luxeed) బ్రాండ్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీని తన రాబోయే లగ్జరీ మినివాన్ లక్సీడ్ V9లో పరిచయం చేస్తోంది.

రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాల్లో అత్యధికం తల, మెడ భాగాలకు తగిలే తీవ్రమైన గాయాల వల్లే జరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, లక్సీడ్ సంస్థ సరికొత్త సేఫ్టీ టెక్నాలజీని తెరపైకి తెచ్చింది. 2026 ప్రథమార్థంలో విడుదల కానున్న లక్సీడ్ V9 ఎలక్ట్రిక్ మినివాన్ ద్వారా ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇది కేవలం ఎయిర్‌బ్యాగ్ మాత్రమే కాదు, ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికుడి తల చుట్టూ ఒక రక్షక కవచంలా మారి, ప్రాణాపాయం నుండి కాపాడుతుంది.

Huaweis Luxeed V9 Set to Feature Worlds First Helmet Airbag A Deep Dive into the Future of Passenger Safety

ఈ టెక్నాలజీ వెనుక ఉన్న బ్రెయిన్ ఎవరు?
ఈ అద్భుతమైన హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ను ప్రపంచ ప్రఖ్యాత ఆటోమోటివ్ ఇంటీరియర్ సరఫరాదారు యాన్‌ఫెంగ్ (Yanfeng) అభివృద్ధి చేసింది. ఈ సంస్థకు ఫోక్స్‌వ్యాగన్, బీఎండబ్ల్యూ, టయోటా, జనరల్ మోటార్స్ వంటి గ్లోబల్ బ్రాండ్‌లతో సుదీర్ఘ అనుబంధం ఉంది. యాన్‌ఫెంగ్ అభివృద్ధి చేసిన ఈ కొత్త సీట్ ఆర్కిటెక్చర్, కేవలం భద్రతనే కాకుండా ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాన్ని (Luxury Comfort) కూడా అందిస్తుంది.

సెకనులో వందో వంతు కాలంలోనే రక్షణ
ప్రమాదం జరిగే సమయంలో ఈ సిస్టమ్ ఎలా స్పందిస్తుందో వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సిస్టమ్ మూడు దశల్లో ప్రయాణికుడిని కాపాడుతుంది..
ప్రీ-క్రాష్ రాపిడ్ రిటర్న్: కారులోని అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సెన్సార్లు ప్రమాదం జరగబోతోందని గుర్తించిన వెంటనే, ప్రయాణికుడు ఒకవేళ సీటును వెనక్కి వాల్చుకుని (Recline) ఉన్నా, ఆ సీటు కేవలం మిల్లీ సెకన్లలోనే నిటారుగా (Upright position) మారిపోతుంది.

Huaweis Luxeed V9 Set to Feature Worlds First Helmet Airbag A Deep Dive into the Future of Passenger Safety

హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్ డిప్లాయ్‌మెంట్: సీటు పైభాగం (Headrest) నుంచి ఒక ప్రత్యేకమైన ఎయిర్‌బ్యాగ్ విచ్చుకుని ప్రయాణికుడి తలను, మెడను, ముఖం కింది భాగాన్ని ఒక కోకన్(Cocoon) లాగా పూర్తిగా కప్పేస్తుంది. ఇది ప్రయాణికుడి తల కారులోని ఇతర భాగాలకు తగలకుండా అడ్డుకుంటుంది.

కుదుపుల నివారణ (Whiplash Protection): ప్రమాదం జరిగినప్పుడు తల ఒక్కసారిగా ముందుకు వెనక్కు ఊగడం వల్ల మెడ ఎముకలు విరిగిపోయే ప్రమాదం (Whiplash effect) ఉంటుంది. ఈ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్ తలను స్థిరంగా ఉంచడం ద్వారా అటువంటి గాయాలను నిరోధిస్తుంది.

టెక్నాలజీ, లగ్జరీల కలయిక
లక్సీడ్ V9 కేవలం భద్రతకే కాదు, హై-టెక్ ఫీచర్లకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది. ఇది సుమారు 5.3 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వీల్‌బేస్‌తో భారీగా ఉంటుంది. లోపల ప్రయాణికులకు రాజభోగాలను తలపించే స్థలం ఉంటుంది.

పవర్ ఆప్షన్స్: ఇది ప్యూర్ ఎలక్ట్రిక్ (EV), ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ (EREV) వెర్షన్లలో రానుంది. దీనికి శక్తిని అందించడానికి CATL కంపెనీ తయారు చేసిన అత్యాధునిక బ్యాటరీ ప్యాక్‌లను వాడుతున్నారు.

హువావే పవర్: హువావే అభివృద్ధి చేసిన 800V హై-వోల్టేజ్ సిస్టమ్, క్వాంకున్ అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ సిస్టమ్ (ADS) దీని సొంతం. అంటే ఇది ఆటోమేటిక్ డ్రైవింగ్ (Self-driving) సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది.

ప్రస్తుతం చైనాలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వాయిబో(Weibo)లో ఈ కారు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఈ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీ విజయవంతమైతే, రాబోయే రోజుల్లో అన్ని లగ్జరీ కార్లలో ఇది ప్రామాణికంగా మారే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, December 26, 2025, 14:31 [IST]
English summary
Huaweis luxeed v9 set to feature worlds first helmet airbag a deep dive into the future of passenger
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+