ఇక తగ్గేదేలే అంటున్న హ్యుందాయ్.. ఏకంగా టాటాకే షాక్ ఇచ్చింది.. వడ్డీ, అసలుతో కలిపి సమాధానం
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai)కి అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా మంచి మార్కెట్ ఉంది. దేశంలో ప్రస్తుతం అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా మారుతీ సుజుకీ ఉంటుంది. దాని తరువాత హ్యుందాయ్ నిలుస్తుంది. అధునాతన ఫీచర్స్, సరికొత్త డిజైన్లతో మార్కెట్లోకి అదిరిపోయే కార్లను విడుదల చేస్తూ హ్యుందాయ్ తన వ్యాపారాన్ని ఢిల్లీ నుంచి గల్లి వరకు కూడా విస్తరిస్తోంది. అంతటి ప్రసిద్ధి చెందిన కంపెనీ తాజాగా తన కార్ల సేల్స్ వివరాలను వెల్లడించింది. 2025 జనవరిలో హ్యుందాయ్ ఈ విషయంలో దేశీయ మరో అతిపెద్ద కంపెనీ అయిన టాటా మోటార్స్‌ను అధిగమించి రెండో స్థానంలో నిలవడం గమనార్హం. భారత్‌లో తన మార్కెట్‌ను పెంచుకోవడానికి ఎంతో కాలంగా తీవ్రంగా కృషి చేస్తున్న హ్యుందాయ్ జనవరిలో మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది.
హ్యుందాయ్ 2025 జనవరి నెలలో సేల్ చేసిన కార్ల వివరాలను చూసినట్లయితే, 65,603 కార్లను విక్రయించింది. వీటిలో 54,003 కార్లను లోకల్‌గా దేశీయ వినియోగదారులకు సేల్ చేయగా, 11,600 హ్యుందాయ్ కార్లను మాత్రం ఇక్కడే తయారు చేసి హ్యుందాయ్ కార్లకు మంచి మార్కెట్ ఉన్న దేశాలకు ఎగుమతి చేసింది. మారుతీ సుజుకీ తరువాత అత్యధికంగా కార్లను సేల్ చేస్తున్న లిస్ట్‌లో హ్యుందాయ్ ఈ సంఖ్యలతో రెండో స్థానంలో నిలిచింది.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే గతంలో టాటా మోటార్స్ కంపెనీ హ్యుందాయ్ కంటే కార్ల విక్రయాల్లో రెండో స్థానంలో నిలవగా, ఇప్పుడు దానికి వడ్డీ, అసలుతో కలిపి హ్యుందాయ్ కంపెనీ టాటా మోటార్స్‌కు గట్టి బదులు ఇచ్చింది. 2024 డిసెంబర్ నెలలో కార్ల సేల్స్‌లో హ్యుందాయ్ మూడో స్థానంలో నిలవగా, టాటా మోటార్స్ దానికి షాక్ ఇస్తూ ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. ఈ నెలలో టాటా అమ్మకాలు తగ్గాయి.
దీంతో పాటు హ్యుందాయ్ అమ్మకాలు కూడా క్షీణించాయి. ఈ కంపెనీ ఇండియాలో 2024 డిసెంబర్ నెలలో 42,208 కార్లను మాత్రమే విక్రయించింది. అదే జనవరి 2025లో 54,003 కార్లను సేల్ చేసి కొత్త ఏడాది ప్రారంభంలోనే మంచి ఎంట్రీని పొందింది. అదే గత ఏడాది 2024 జనవరి నెలలో హ్యుందాయ్ 57,115 కార్లను విక్రయించింది. 2025 జనవరితో పోలిస్తే గత ఏడాది ఇదే నెలలో 3,113 ఎక్కువ కార్లు అమ్ముడుపోయాయి.

2024 జనవరిలో ఇతర దేశాలకు కార్ల ఎగుమతులు కూడా మెరుగ్గానే ఉన్నాయి. డేటా ప్రకారం, 10,500 కార్లను భారత్‌లో తయారుచేసి విదేశాలకు సరఫరా చేశారు. ఇదిలా ఉంటే 2025 జనవరి నెలలో అమ్మకాల పరంగా హ్యుందాయ్ క్రెటా (hyundai Creta) మోడల్ 18,522 అమ్మకాలతో మెరుగైన స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో కంపెనీ జనవరి నెలలోనే క్రెటా ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. దీని అమ్మకాలు కూడా సానుకూలంగా ఉన్నాయి.
కొత్త ఏడాది ప్రారంభ నెలలోనే హ్యుందాయ్ అమ్మకాలతో దూసుకుపోవడంపై కంపెనీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేసి మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి ప్రధాన ప్రత్యర్థులకు ధీటుగా అమ్మకాల్లో దూసుకుపోవాలని చూస్తుంది. లోకల్‌గా విక్రయిస్తూనే, విదేశీ మార్కెట్లకు సైతం ఇక్కడి నుంచే ఎగుమతులు చేస్తుంది. ఈ సంఖ్య త్వరలో మరింత పెంచడానికి సిద్ధంగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








